Dil Raju About Sri Tej: సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెల్సిందే. పుష్ప 2 బెన్ ఫిట్ షో చూడడానికి కుటుంబంతో సహా వచ్చి ఆమె మృత్యువాత పడగా.. కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్ పాలయ్యాడు. ఈ ఘటన టాలీవుడ్ మొత్తాన్ని షేక్ చేసింది. రేవతి మృతికి కారణం సంధ్యా థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ అని వారిపై కేసులు నమోదు అయ్యాయి. ఈరోజు బన్నీని విచారణకు కూడా పిలిచి విచారించారు. ఈ కేసులో A1 to A8 వరకు సంధ్యా థియేటర్ యాజమాన్యం ఉండగా.. A11 గా అల్లు అర్జున్ ను చేర్చారు.
ఇక బన్నీకి ఇండస్ట్రీ సపోర్ట్ కూడా చాలా తక్కువ ఉంది. కొంతమంది బన్నీకి సపోర్ట్ గా ఉంటుండగా .. ఇంకొంతమంది మాత్రం విమర్శలతో ముంచెత్తుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిర్మాత దిల్ రాజు బన్నీకి మద్దతు తెలిపాడు. తాజాగా ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ.. ” పుష్ప ప్రీమియర్ షో సమయంలో జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇలాంటివి సినిమా ఇండస్ట్రీ లో అప్పుడప్పుడు చూస్తుంటాం.
Pushpa 2: దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. ఏం టైమింగ్ రా బాబు.. రెచ్చగొట్టడానికేనా.. ?
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, సినిమా కి వారధిలా ఉండాలని నన్ను FDC చైర్మన్ గా నియమించారు. వేరే ప్రోగ్రాంలో నేను అమెరికాలో ఉండడం వలన ఇప్పటివరకు ఎవరిని కలువలేకపోయాను. ఈరోజు రాగానే సిఎం రేవంత్ నీ కలిశాను. త్వరలోనే నేను అల్లు అర్జున్ ని కలవబోతున్నాను. ప్రస్తుతం జరుగుతున్న అన్ని పరిస్థితులను చూస్తున్నాను. త్వరలోనే వీటికి ఫుల్ స్టాప్ పెడతాను. రేవతి భర్త భాస్కర్ నీ ఇండస్ట్రీ కి తీసుకుని వచ్చి ఏదోక జాబ్ ఏర్పాటు చేస్తాం. వాళ్ల బాధ్యత నేను తీసుకుంటాను. FDC ద్వారా వీరికి ఏవిధమైన సహకారం అందించగలిగితే అవి అందిస్తాం.
ప్రభుత్వానికి ఇండస్ట్రీ కి మధ్యలో ఉండి… భాస్కర్ కుటుంబాన్ని మేము బాధ్యత తీసుకుంటాం. సీఎం ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది. ఆయనతో కూడా వీరి బాధ్యత తీసుకోవడం పై చర్చించాను.. వారు కూడా ఓకే అన్నారు. సినీ పెద్దలను, ప్రభుత్వ పెద్దలను కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ప్రభుత్వానికి, సినిమా కి వారధిలా నేను పనిచేస్తాను. శ్రీ తేజ ఆరోగ్యం కుదుట పడుతుంది. త్వరలోనే శ్రీతేజ్ ఆరోగ్యంగా బయటకు వస్తాడు.
10 Years for Varun Tej : పదేళ్ళ జర్నీ లో ఎన్నో కన్సెప్ట్ బేస్ సినిమాలు
ఇక సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లలో నిజం లేదు. సంధ్యా థియేటర్ ఘటన ఎవరు చేసింది కాదు. ఒక్కరినే బ్లేమ్ చేయడం సమంజసం కాదు. ఇటువంటివి జరగటం దురదృష్టకరం. ఎవ్వరూ కావాలని చెయ్యరు. టెక్నికల్ గా భాస్కర్ గా జరిగేవి అన్ని జరుగుతాయి. అండగా మేము నిలబడతాం” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం దిల్ రాజు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇకపోతే ప్రస్తుతం దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసమే దిల్ రాజు.. చరణ్ తో కలిసి అమెరికా వెళ్లి వచ్చాడు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా దిల్ రాజుకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.