BigTV English
Advertisement

Kennedy Murdery Mystery: అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీ హత్య వెనుక రహస్యాలు.. బహిర్గతం చేసిన ట్రంప్

Kennedy Murdery Mystery: అమెరికా ప్రెసిడెంట్ కెన్నెడీ హత్య వెనుక రహస్యాలు.. బహిర్గతం చేసిన ట్రంప్

Kennedy Murdery Mystery Trump| అమెరికాలో అతి పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా జాన్ ఎఫ్ కెన్నెడీ రికార్డ్ ఉంది. అయితే ఆయన అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత కొద్ది కాలానికే మరణించారు. ఆయన హత్యకు గుర్యయారు. అయితే మాజీ అధ్యక్షుడు కెన్నెడీ (John F. Kennedy) ఎలా చనిపోయారు? ఆయన హత్య వెనుక ఏం జరిగిందన్నది ఇప్పటికీ రహస్యంగానే ఉంది. ఈ విషయాలను బహిర్గతం చేయడానికి అమెరికా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు కెన్నెడీ హత్య కేసు (Kennedy Assassination)కు సంబంధించిన రహస్య దస్తావేజులను ప్రభుత్వం ఇటీవల బహిర్గతం చేసింది. ఈ డాక్యుమెంట్లను యూఎస్ నేషనల్ ఆర్కైవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ వెబ్ సైట్లో పోస్ట్ చేశారు. ఇప్పుడు సామాన్యులందరూ ఈ దస్తావేజులను చదవగలరు.


అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Donald Trump) గరిష్ఠ పారదర్శకతతో కూడిన కొత్త శకానికి నాంది పలికారని యూఎస్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ఎలాంటి సవరణలు లేకుండానే కెన్నెడీ హత్య కేసు రహస్య దస్తావేజులను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని వెల్లడించారు. మాజీ అధ్యక్షుడి మరణానికి సంబంధించి దాదాపు 80 వేల కీలక దస్తావేజులను విడుదల చేయనున్నట్లు ట్రంప్ సోమవారం వెల్లడించారు. కెన్నెడీ హత్యకు సంబంధించి ఇటీవల ఎఫ్‌బీఐ దాదాపు 2,400 కొత్త రికార్డులను గుర్తించింది.

Also Read: గాజాలో 413 మంది మరణం.. ఇజ్రాయెల్ భీకర దాడి.. యద్ధం మళ్లీ మొదటికే


కెన్నెడీ ఎలా చనిపోయారంటే..

1961లో అమెరికాకు 35వ అధ్యక్షుడిగా జాన్ ఎఫ్. కెన్నెడీ బాధ్యతలు చేపట్టారు. 43 ఏళ్లకే ఆయన ఆ పదవిని అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా అరుదైన ఘనత సాధించారు. 1963 నవంబర్ 22న టెక్సాస్ పర్యటనకు వెళ్లగా ఆయనపై దాడి జరిగింది. కారులో ప్రయాణిస్తున్నప్పుడు, దుండగుడు వెనుక నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య కేసులో ముందుగా లీ హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తిని ప్రధాన నిందితుడిగా పోలీసులు అరెస్టు చేయగా, కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో అనూహ్యంగా అతను కూడా హత్యకు గురయ్యాడు. అయితే హార్వేను చంపిన హంతకుడిన పోలీసులు అరెస్టు చేసి శిక్ష వేయగా.. కొంతకాలానికి అతను కూడా క్యాన్సర్ వ్యాధి బారిన పడి మరణించాడు. అయితే అతని హత్యపై అనుమానాలున్నాయి. అప్పటి నుంచి కెన్నెడీ హత్య కేసు ఓ పెద్ద మిస్టరీగానే మిగిలిపోయిది. అయితే విచారణ ఆ తరువాత ఎంత వరకు జరిగింది. ఇంతవరకు ఏం తేలింది అనే వివరాలను ప్రభుత్వం ఇన్నాళ్లు రహస్యంగానే ఉంచింది. కానీ ట్రంప్ ఆ వివరాలను బహిర్గతం చేశారు.

బ్రిటన్ దేశ రాజకుమారుడు ప్రిన్స్ హ్యారీ కేసు రహస్య దస్తావేజులు కూడా..
ఈ సందర్భంగా బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ ఇమ్మిగ్రేషన్ కేసుకు సంబంధించిన దస్తావేజులను కూడా ట్రంప్ ప్రభుత్వం విడుదల చేసింది. 2020లో హ్యారీ వీసా దరఖాస్తు విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో యూఎస్ దర్యాప్తు చేపట్టింది. అందుకు సంబంధించిన దస్తావేజుల్లో చాలా భాగం సవరణలు కూడా జరిగాయి. వాటిని ఇటీవల బహిర్గతం చేశారు. ఆయన గోప్యతకు రక్షణ కల్పించాలని బాధ్యత ఉందని, అందుకే దస్తావేజులను సవరించామని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా, వీసా జారీ సమయంలో ఆయనకు ప్రత్యేక మినహాయింపులు కల్పించినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. మొత్తంగా ఈ కేసుకు సంబంధించి 80 పేజీలను బహిర్గతం చేశారు. ఇందులో చాలా వరకు బ్లాక్ ఇంక్తో కవర్ చేసినవే కావడం గమనార్హం.

Tags

Related News

Nvidia: ఎన్విడియా పై చైనా నిషేధం.. భారత్ స్టార్టప్ లకు ఇలా కలిసొస్తోంది..

New York First Lady: న్యూయార్క్ ఫస్ట్ లేడీ రామా దువ్వాజి ఎంత ఫేమస్సో తెలుసా?

America News: అమెరికాలో ఎన్నికలు.. అధికార పార్టీకి ఝలక్, వర్జీనియా లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌గా హైదరాబాద్ మహిళ

NYC Mayor Election-2025: న్యూయార్క్‌ మేయర్ ఎన్నికలు..ట్రంప్‌కు ఝలక్, భారతీయడికే పీఠం

H1B Visa VS EB5 Visa: పర్మినెంట్‌‌గా అమెరికాలోనే.. ఈ వీసాపై ఇండియన్స్ కన్నేశారా?

Plane Crash: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన మరో విమానం.. స్పాట్‌లో 14 మంది

Philippines: ఫిలిప్పీన్స్‌లో తుఫాను బీభత్సం.. 40 మందికి పైగా మృతి..

Adarsh Behera: సూడాన్ లో భారతీయుడు కిడ్నాప్, ఇంతకీ ఎవరీ ఆదర్శ్ బెహరా?

Big Stories

×