BigTV English

Allu Arjun : నోటుపై అల్లు అర్జున్ ఫోటో… పిచ్చి బాగా ముదిరింది భయ్యా వీళ్లకు

Allu Arjun : నోటుపై అల్లు అర్జున్ ఫోటో… పిచ్చి బాగా ముదిరింది భయ్యా వీళ్లకు

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానుల రచ్చ ఈమధ్య మామూలుగా ఉండట్లేదు. ఎక్కడ చూసినా ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమాలో అల్లు అర్జున్ డైలాగులు చెప్పడం, మేనరిజం, స్టైల్ ఫాలో అవ్వడం లాంటివి చేస్తూ తమ అభిమానాన్ని వెల్లడిస్తున్నారు. అయితే కొన్నిసార్లు అభిమానులు స్టార్ హీరోల మీద ఇష్టంతో చేసే పనులు క్రేజీగా ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ మీద అభిమానంతో ఓ అభిమాని చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


100 నోటుపై అల్లు అర్జున్ ఫోటో 

తాజాగా 100 రూపాయల నోట్ పై అల్లు అర్జున్ ముఖచిత్రం ఉన్న ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ అభిమానులు ఇలా నోట్లను క్రియేట్ చేసినట్టు సమాచారం. మొత్తానికి గాంధీ తాత బదులు పుష్ప రాజ్ ని పెట్టేసి, తమ అభిమానాన్ని చాటుకున్నారు అల్లు ఫ్యాన్స్. కానీ మిగతా వాళ్ళు మాత్రం అల్లు అర్జున్ అభిమానులకు పిచ్చి ముదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా ‘పుష్ప ‘ తర్వాత అల్లు అర్జున్ క్రేజ్ నిజంగానే ప్రపంచం నలుమూలలా వ్యాపించింది. అంతకు ముందు క్రికెటర్ డేవిడ్ వార్నర్ అల్లు అర్జున్ స్టైల్ లో హడావిడి చేస్తే, నిన్నటికి నిన్న ఏకంగా ఓ స్టేడియంలో చీర్ లీడర్స్ ‘పుష్ప 2’లోని పాపులర్ సాంగ్ ‘పీలింగ్స్’కి డాన్స్ చేసి దుమ్మురేపారు. ఆ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.


కుంభమేళాలో కూడా ‘పుష్ప రాజ్’ సందడి 

‘పుష్ప 2’ సినిమా తరువాత అల్లు అర్జున్ యాక్టింగ్ కు ఫిదా అయిపోయారు మూవీ లవర్స్. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ బన్నీకి అభిమానులు అవుతున్నారు. ముఖ్యంగా నార్త్ బాక్స్ ఆఫీసును ‘పుష్ప 2’ ఊపేసిన సంగతి తెలిసిందే. అలా కుంభమేళాలో సైతం ఓ అభిమాని ‘పుష్పరాజ్’ మేకోవర్ లో సందడి చేశాడు.

ఇదిలా ఉండగా, ‘పుష్ప 2’ సినిమాలో చెప్పినట్టుగానే ఇప్పుడు అల్లు అర్జున్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ స్టార్. ఎన్ని విమర్శలు, వివాదాలు వచ్చినా ఆయన స్టార్ డం ఏమాత్రం తగ్గట్లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం అల్లు అర్జున్… అట్లీ దర్శకత్వంలో సినిమా చేయడానికి సిద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోందని సమాచారం. ఈ మూవీ కోసం అల్లు అర్జున్ తో పాటు అట్లీ కూడా భారీ రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని అంటున్నారు. అలాగే ఇందులో నటించబోయే హీరోయిన్ల గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇక అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టుతో పాటు మరో ప్రాజెక్ట్ ని కూడా పట్టాలెక్కించబోతున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో బిగ్గెస్ట్ మైథాలజికల్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అల్లు అర్జున్ చేయబోతున్న ఈ రెండు ప్రాజెక్టులు కూడా మోస్ట్ అవైటింగ్ సినిమాలు అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే అల్లు అభిమానులు బన్నీ చేయబోయే నెక్స్ట్ రెండు సినిమాలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ గురించి వెయిట్ చేస్తున్నారు.

Tags

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×