Cricketer Love Story: 2017లో పాకిస్తాన్ క్రికెటర్లు మొహమ్మద్ అమీర్, మహమ్మద్ ఆసిఫ్, సల్మాన్ బట్ లు స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడిన విషయం తెలిసిందే. 2010 సంవత్సరంలో లార్డ్స్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఈ ముగ్గురు ఆటగాళ్లు స్పాట్ ఫిక్సింగ్ కి పాల్పడ్డారు. ఈ ముగ్గురిని కూడా ట్రిబ్యునల్ దోషులుగా నిర్ధారించారు. దీంతో సల్మాన్ బట్ పై పదేళ్లు, ఆసిఫ్ పై ఏడేళ్లు, మహమ్మద్ అమీర్ పై ఐదేళ్లపాటు ఐసీసీ నిషేధం విధించింది.
Also Read: Sachin Tendulkar: 51 ఏళ్లు..సచిన్ విధ్వంసం.. 33 బంతుల్లోనే !
అయితే ఈ కేసులో మొహమ్మద్ అమీర్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో మొహమ్మద్ అమీర్ కేసును వాదించేందుకు బ్రిటిష్ – పాకిస్తానీ యువతి నర్జీస్ ని నియమించారు. ఆరు సంవత్సరాల క్రితం మహమ్మద్ అమీర్ ని లండన్ లో కలిసింది నర్జీస్. అయితే ఈ కేసు వాదించే క్రమంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా {Cricketer Love Story} మారి.. వీరి ప్రేమకు పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నర్జీస్ తో మహమ్మద్ అమీర్ ల నిశ్చితార్థం 2014లో జరిగింది.
అలా మొహమ్మద్ అమీర్ తన కేసును వాదించిన నర్జీస్ ని వివాహం చేసుకున్నాడు. 2016లో వీరి వివాహం జరిగింది. ఈ దంపతులకు {Cricketer Love Story} ముగ్గురు పిల్లలు ఉన్నారు. లాహోర్ లో జరిగిన వీరి వివాహానికి పలువురు పాకిస్తాన్ క్రికెటర్లు హాజరయ్యారు. ఇక పాకిస్తాన్ 2017 లో ఛాంపియన్స్ ట్రోఫీని సాధించడంలో అమీర్ కీలకపాత్ర పోషించాడు. 2020 డిసెంబరులో తొలిసారి రిటైర్మెంట్ ప్రకటించిన అమీర్.. ఆ తర్వాత 2024 మార్చ్ లో ఆ నిర్ణయం పై వెనక్కి తగ్గాడు.
ఆ తర్వాత అదే ఏడాది జూన్ లో జరిగిన టి-20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తరపున నాలుగు మ్యాచ్ లు ఆడి 7 వికెట్లు పడగొట్టాడు. ఈ టోర్నీలో పాకిస్తాన్ గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. దీంతో మరోసారి రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం అతడు ప్రపంచ క్రికెట్ లీగ్ లో ఆడుతున్నాడు. ఇక 2009 జూన్ లో అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేసిన మహమ్మద్ అమీర్.. తన కెరీర్ లో 15 సంవత్సరాలు సాగినా పాకిస్తాన్ తరపున తక్కువ మ్యాచ్ లు ఆడాడు.
Also Read: Saud Shakeel: మ్యాచులో నిద్ర పోయాడు.. ఔట్ అయ్యాడు.. పాకిస్థాన్ ప్లేయర్లకే ఇది సాధ్యం…!
తన కెరీర్ లో 36 టెస్టులు, 61 వన్డేలు, 62 టీ-20 మ్యాచ్ లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో మొత్తంగా 271 వికెట్లు పడగొట్టడంతో పాటు.. తన బ్యాట్ తో 1,179 పరుగులు చేశాడు. ఇక 2024 సంవత్సరంలో అమెరికా, వెస్టిండీస్ లో జరిగిన టి-20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ తరపున తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ స్పాట్ ఫిక్సింగ్ వల్ల తన కెరీర్ లో చాలా సంవత్సరాలు నిషేధానికి గురి కావడంతో తక్కువ మ్యాచులు ఆడాడు.