BoycottAlluArjun :సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం #బాయ్ కాట్ అల్లుఅర్జున్(#Boycottalluarjun) ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ముఖ్యంగా అల్లు అర్జున్(Allu Arjun) చేసిన పనికి సినిమా ఇండస్ట్రీ నుండి పూర్తి వ్యతిరేకత నెలకొంటోంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అల్లు అర్జున్ చేసిన పనికి ఇకపై తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలు రద్దు చేయడమే కాకుండా.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకూ సినిమా టికెట్ ధరలు పెంచే ఛాన్సే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) తాజాగా అసెంబ్లీలో కన్ఫామ్ చేసేశారు. దీంతో #బాయ్కాట్ అల్లుఅర్జున్ అంటూ ఈ విషయం కాస్త ట్రెండింగ్ లోకి వచ్చేసింది. దీంతో ఒక్కడి వల్ల ఇండస్ట్రీ మొత్తం సఫర్ అవుతోంది అంటూ సినీ లవర్స్, స్టార్ హీరోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సరికొత్త రికార్డే కాదు విధ్వంసం కూడా..
అసలు విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా, ప్రముఖ డైరెక్టర్ సుకుమార్(Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ సీక్వెల్ గా వచ్చిన చిత్రం ‘పుష్ప2’. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా 12 వేలకు పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా 15 రోజుల్లోనే రూ.1500 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రూ.2000 కోట్ల కలెక్షన్స్ దిశగా అడుగులు వేస్తోంది. ఇదంతా ఇలా ఉండగా ఈ సినిమా బెనిఫిట్ షోను డిసెంబర్ 4వ తేదీన వేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అభిమానులు ఒక్కో టికెట్ కు ఏకంగా రూ.3వేలు ఖర్చుపెట్టి కూడా సినిమా వీక్షించారు. ఇదంతా బాగానే ఉన్నా హైదరాబాదులోని క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్లో కూడా పుష్ప 2 బెనిఫిట్ షో వేశారు.
సంధ్య థియేటర్ ఘటన.. ఉలిక్కిపడ్డ ప్రభుత్వం.
సాధారణంగా సెలబ్రిటీలు ఏ సినిమా విడుదలైనా.. ఆ సినిమా చూడడానికి ఈ సంధ్య థియేటర్ కి వస్తారన్న విషయం అందరికీ తెలిసిందే. వారంతా కూడా వచ్చి, చూసి కామ్ గా వెళ్ళిపోతారు. ఏ రోజు కూడా ప్రాణ నష్టం జరిగిన సందర్భాలు లేవు. కానీ ఈసారి మాత్రం డిసెంబర్ 4వ తేదీ అర్ధరాత్రి బెనిఫిట్ షో వేయగా.. అల్లు అర్జున్ పోలీసులు వద్దని చెప్పినా సరే కారులో ర్యాలీ నిర్వహించుకుంటూ థియేటర్ కి వచ్చారు.. దాంతో అభిమానులు ఆయనను చూడడానికి ఎగబడగా.. తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి (39) అనే మహిళ అక్కడికక్కడే మరణించింది.. ఆమె కొడుకు శ్రీ తేజ (9) ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రాణ నష్టం జరగడంతో అల్లు అర్జున్ పై తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
అల్లు అర్జున్ పై స్టార్ హీరోల అభిమానులు..
అందుకే ఇకపై విడుదలయ్యే ఏ సినిమా అయినా సరే బెనిఫిట్ షో లతో పాటు టికెట్ రేట్లు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నారు. దీంతో సినీ లవర్స్, స్టార్ హీరోల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఒక్కడి వల్ల ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సఫర్ అవుతోందని, బెనిఫిట్ షోలు రద్దు అయ్యాయని, టికెట్ ప్రైజ్ లు పెరగకపోతే… తమ హీరోలకు కొత్త రికార్డులు రావు అని, ఉన్న రికార్డులు బ్రేక్ అవ్వడం కష్టమని, సినీ అభిమానులు అంటున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ చేసిన పనికి మిగతా హీరోల అభిమానులు మాత్రం పూర్తి స్థాయిలో ఫైర్ అవుతున్నారు అందుకే ఈ కొత్త విషయాన్ని ట్రెండింగ్లోకి తీసుకొచ్చారు. మరి ఈ విషయంపై టాలీవుడ్ ఇండస్ట్రీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.