BigTV English

Allu Arjun: నా లైఫ్ లో అద్భుతం చేసింది ఆయనే.. బన్నీ పోస్ట్ వైరల్

Allu Arjun: నా లైఫ్ లో అద్భుతం చేసింది ఆయనే.. బన్నీ పోస్ట్ వైరల్

Allu Arjun: అల్లు అరవింద్ వారసుడిగా టాలీవుడ్ ఎంట్రీ  ఇచ్చినా  అల్లు అర్జున్ ను మొదటి నుంచి మెగా కుటుంబం నుంచి వచ్చిన హీరోలానే చూసారు. గంగోత్రీ సినిమాతో కెరీర్ ను ప్రారంభించిన బన్నీకి మొదటి సినిమాతో హిట్ అయితే దొరికింది కానీ, ఆ ఫేస్ కట్ చూసి ఇతను హీరో ఏంటి అని విమర్శించారు. అలాంటివేమీ పట్టించుకోకుండా బన్నీ తన కెరీర్ ను నిలబెట్టుకోవడానికే కష్టపడ్డాడు. అలాంటి సమయంలోనే బన్నీని ఒక హీరోగా నిలబెట్టింది స్టార్ డైరెక్టర్ సుకుమార్.


ఆర్యలాంటి సినిమాతో  అల్లు అర్జున్ వెనక్కి తిరిగి చూడకుండా చేశాడు.  ఆర్య సినిమా బన్నీ కెరీర్ కు గట్టి పునాదిని వేసింది. ఈ సినిమా తరువాత వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో హీరో- డైరెక్టర్  హిట్ కాంబినేషన్ తీసుకుంటే.. మొదటి వరుసలో  బన్నీ- సుకుమార్ ఉంటారు. బన్నీ కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాల లిస్ట్ తీస్తే మొదట మూడు సినిమాలు సుకుమార్ తెరకెక్కించినవే ఉంటాయి.

ఆర్య, ఆర్య 2, పుష్ప, పుష్ప 2. రెండు సినిమాలు.. వాటికి సీక్వెల్స్. ఆర్య 2 ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయినా.. పుష్ప 2 మాత్రం టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ అయ్యేలా చేసింది.  నిజంగా  బన్నీ లైఫ్ లో జరిగిన అద్భుతాలు అన్నింటికి కారణం  సుకుమార్ అనే చెప్పాలి. స్టైలిష్ స్టార్ గా ఉన్న బన్నీని ఐకాన్ స్టార్ ను చేశాడు. ఇప్పటివరకు టాలీవుడ్ లో ఏ హీరోకు రాని నేషనల్ అవార్డును బన్నీకి వచ్చేలా చేశాడు. ఇక పుష్ప 2 తో టాలీవుడ్ లో మునుపెన్నడూ చూడని రికార్డ్ కలక్షన్స్ నుచూపించాడు.  అందుకే సుకుమార్ అంటే బన్నీకి  అమితమైన ప్రేమ.


Mega Vs Allu: మలయాళ హీరోకి బన్నీ సపోర్ట్.. మళ్లీ మొదలైన వార్..!

నేడు సుకుమార్ పుట్టినరోజు. నేటితో ఆయన 55  వ పడిలోకి అడుగుపెడుతున్నాడు. ఉదయం నుంచి సుక్కుకు అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా బన్నీ సైతం.. తన ఫేవరేట్ డైరెక్టర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకొచ్చాడు. ”  నా జీవితంలో అన్ని అద్భుతాల వెనుక ఉన్న వ్యక్తి  సుకుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ రాసుకోస్తూ ఒక అరుదైన ఫోటోను  షేర్ చేశాడు.

పుష్ప 2 షూటింగ్ సమయంలో బన్నీ, సుకుమార్ కలిసి కూర్చొని ఫోన్ లో ఏదో చూస్తున్నట్లు కనిపించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.  ఇక పుష్ప 2 ప్రభంజనం ఇంకా ఆగలేదు. జనవరి 14 నుంచి పుష్ప రీలోడెడ్ వెర్షన్ రానుంది. ఇందులో 20 నిమిషాల ఫుటేజ్ ను యాడ్ చేసి థియేటర్ లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మరి ఈ రీలోడెడ్  ఎన్ని రికార్డులను కొల్లగొడుతుందో  చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×