Biggboss Syed Sohel : తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ షో ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. అక్కడినుంచి ఈ షో మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉండేది. ఫస్ట్ సీజన్లో చాలామంది తెలిసిన సెలెబ్రిటీలు వచ్చారు. ఆ తర్వాత నుంచి సీజన్లు పెరుగుతున్న కొద్దీ తెలిసిన సెలబ్రిటీల కంటే తెలుసుకోవాల్సిన సెలబ్రెటీలు ఎక్కువగా వచ్చారు. మామూలుగా వీళ్ళు బిగ్ బాస్ కి వెళ్తున్నారు అని చెప్పుకుంటాం. కానీ బిగ్ బాస్ కు వచ్చిన తర్వాత అసలు వీళ్ళ బ్యాగ్రౌండ్ ఏంటి అని కొంతమంది గురించి తెలుసుకున్నారు. బిగ్బాస్ కి వచ్చినంత వరకు కూడా చాలామందికి తెలియదు. అయితే ఆ షో తర్వాత చాలా పాపులర్ అయిపోయారు కొంతమంది సెలబ్రిటీలు. కొందరు బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేస్తూ పర్సనల్ లైఫ్ లో ఫైనాన్సియలి స్ట్రాంగ్ అయిపోయారు. అయితే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన కొంతమంది పైన కొంతమంది యూట్యూబర్స్ వీడియోలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అన్వేష్ అనే ఒక ట్రావెలర్ పేర్లు పెట్టి మరి కొంతమందిని ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ ని బయట పెట్టాడు.
బిగ్ బాస్ తర్వాత హీరోగా
బిగ్ బాస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న కంటెస్టెంట్ సయ్యద్ సోహెల్. అయితే సోహెల్ పైన కూడా విపరీతమైన కంప్లైంట్స్ ఉన్నాయి. సోహెల్ బిగ్ బాస్ చీట్ చేసి గెలిచాడు అంటూ కొంతమంది అంటుంటారు. అయితే సోహెల్ కేవలం డబ్బులకు మాత్రమే ప్రాముఖ్యత ఇచ్చి రన్నరప్ గా మిగిలిపోయాడు. ఇక బిగ్ బాస్ తర్వాత గుర్తింపు లభించడంతో హీరోగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. బూట్ కట్ బాలరాజు అనే ఒక సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. సినిమాకి విపరీతంగా ఆడియన్స్ వస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు కానీ ఎవరూ రాలేదు. దీనితో సోహెల్ ఏమైందన్నా, బిగ్ బాస్ లో ఓట్లు వేశారు కదా అన్న సినిమా చూడండి అన్నా అంటూ మీడియా ముందు వాపోయాడు.
వాళ్లు రియల్ ముస్లింస్ కాదు
సోహెల్ విషయానికి వస్తే సోహెల్ తో పాటు, ఇమ్రాన్, మెహబూబా వంటి వ్యక్తులు దిక్కు మొక్కు లేని ఇతర దేశంలోని బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం వలనే ఈరోజు ఉగ్రవాదులకు మన సీక్రెట్ తెలుస్తున్నాయి అంటూ అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే వైజాగ్ కి చెందిన ఒక వ్యక్తి ఇన్స్టాగ్రామ్ వేదికగా సోహెల్ ను తిడుతూ వీడియో పెట్టాడు. దానికి ఆ వీడియో పెట్టిన వ్యక్తిని రిక్వెస్ట్ చేసుకుని వీడియోని తీయించాడు సోహెల్. ఈ విషయంపై సోహెల్ స్పందిస్తూ నన్ను తిట్టినా పరవాలేదు మా ఫ్యామిలీని తిడుతున్నారు. మా అమ్మ చనిపోయి ఐదు నెలలు అవుతుంది నేను ఆ బాధలో ఉన్నాను. అలానే ఇస్లాంలో నేను పుట్టించిన ప్రాణాన్ని తీసే హక్కు నీకు లేదు అని చెబుతారు. అందుకే ఆ పెహల్గాం దాడికి పాల్పడిన ఆ కొడుకులెవరు రియల్ ముస్లింస్ కాదు అంటూ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు.
Also Read : Nani – Hit 3 Collections: నాని ర్యాంపేజ్ మొదలు, హిట్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే.?