Allu Arjun : అల్లు వర్సెస్ మెగా వార్ కు ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేలా కనిపించట్లేదు. ముఖ్యంగా అల్లు అర్జున్ చేసే పనులు ఎప్పటికప్పుడు మెగా అభిమానులను రెచ్చగొట్టేలా ఉంటున్నాయి. తాజాగా మరోసారి అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి బర్త్ డే వేడుకలు మెగా వర్సెస్ అల్లు వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి. మరి స్నేహ రెడ్డి బర్త్ డేలో అసలు ఏం జరిగింది? అల్లు అర్జున్ వ్యూహం ఏంటో తెలుసుకుందాం పదండి.
అల్లు స్నేహ బర్త్ డే పార్టీలో వైసీపీ లీడర్
తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డి పుట్టినరోజును గోవాలో సెలబ్రేట్ చేశారు. ఈ ఈవెంట్ లో స్నేహ రెడ్డి, తన భర్త అల్లు అర్జున్, ఇద్దరు పిల్లలతో సహా మరి కొంతమంది స్నేహితులు మాత్రమే పాల్గొన్నారు. ఇక ఆ మెమొరబుల్ క్షణాలను ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది స్నేహ. ఆమె పిక్స్ ను అలా షేర్ చేసిందో లేదో సెలబ్రిటీలతో సహా అభిమానులు కూడా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బాయ్ కాట్ బన్నీ అనే కామెంట్స్ కూడా మొదలయ్యాయి. ఎందుకంటే స్నేహ రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో వైసీపీ లీడర్ కనిపించడమే దీనికి కారణం.
పవన్ కు చెక్ పెట్టడానికే ఈ ప్లాన్…?
ఇక గోవాలో జరిగిన అల్లు స్నేహా రెడ్డి బర్త్ డే వేడుకకు పెద్దగా ఎవ్వరూ హాజరు కాలేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుంచి ఒక్కరు కూడా కనిపించలేదు. కానీ ఊహించని విధంగా వైసీపీ లీడర్ శిల్పా రవి రెడ్డి ఈ స్టార్ కపుల్ సెలబ్రేషన్స్ లో పాల్గొనడం ఆసక్తికరంగా మారింది. నిజానికి ఎలక్షన్ టైంలో ఈ శిల్పా రవి రెడ్డి వల్లే పవన్ కళ్యాణ్ తో పాటు మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులకు బన్నీ దూరం కావలసి వచ్చింది. పైగా ఆ ఎఫెక్ట్ కారణంగానే పుష్ప 2 మూవీని పోస్ట్ పోన్ చేశారనే టాక్ నడిచింది. రీసెంట్ గా ‘మారుతి నగర్ సుబ్రహ్మణ్యం’ మూవీ ఈవెంట్ లో కూడా కామెంట్ చేసి టార్గెట్ అయ్యాడు. ఇప్పుడేమో భార్య బర్త్ డే పార్టీలో శిల్పా రవి రెడ్డితో అల్లు ఫ్యామిలీ కనిపించడంతో మెగా అభిమానులు తెగ ఫైర్ అవుతున్నారు.
ముఖ్యంగా కల్తీ లడ్డూ వివాదం వల్ల వైసిపికి, పవన్ కి మధ్య ఎంత గ్యాప్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దేశాన్ని షేక్ చేస్తున్న కల్తీ లడ్డు వివాదం ఓ వైపు రాజకీయంగా ముదురుతుంటే, ఇలాంటి టైంలో వైసిపి లీడర్ తో అల్లు అర్జున్ కనిపించడం కొత్త వివాదానికి కారణమైంది. దీంతో అల్లు అర్జున్ వ్యవహారం చూస్తుంటే పవన్ కు ఫుల్ స్టాప్ పెట్టడమే టార్గెట్ గా భావిస్తున్నాడా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆయన వేసే ప్రతి మూవ్ రాజకీయ ఎంట్రీ కోసమే చేస్తున్నాడా? అనిపిస్తోంది.
కల్తీ లడ్డూ వల్ల పవన్ పై కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి. సనాతన ధర్మం అంటూ ఆయాన చేసిన కామెంట్స్ పై పవన్ వ్యతిరేకులు పవన్ పై విరుచుకుపడుతున్నారు. ఎప్పటి లాగే విడాకులు, బీఫ్ తిన్నాడు అంటూ ఇంకా చాలా విషయాల్లో పవన్ ను సెంటర్ చేసి, విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల వెనక ఉన్నది ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రతిపక్ష పార్టీ అని అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో జనసేనకు వైసీపీ కి మధ్య పచ్చ గడ్డి వేస్తే బగ్గు మనేంతగా వేడి రాజుకుంది. ఈ టైంలో అల్లు అర్జున్ భార్య బర్త్ డే వేడుకల్లో శిల్పరవి రెడ్డి కనిపించడం పవన్ ఫ్యాన్స్ కు మింగుడు పడటం లేదు.
రెచ్చగొట్టడానికేనా..?
కల్తీ లడ్డూ వివాదం నడుస్తున్న టైంలో వైసీపీ లీడర్‌తో బన్నీ మీట్ అవ్వడం వెనక ఏదైన వ్యూహం ఉందా.. అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ ను, ఆయన ఫ్యాన్స్ ను, జనసేన నేతలను రెచ్చగొట్టడానికే బన్నీ ఇలా చేస్తున్నాడనే వాదనలు కూడా వస్తున్నాయి. మొత్తానికి అల్లు స్నేహ రెడ్డి బర్త్ డే వల్ల మరోసారి మెగా వర్సెస్ అల్లు, పవన్ వర్సెస్ బన్నీ అంటూ కామెంట్స్ వస్తున్నాయి.