Kantara 2..కాంతారా.. ప్రాంతీయ సినిమాగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా ఊహించని ఇమేజ్ దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా ప్రీక్వెల్ కూడా త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా కేజీఎఫ్, సలార్ వంటి విజయవంతమైన ఫ్రాంచైజీలను రూపొందించిన ‘హోం భలే ఫిలిమ్స్’ కాంతారా ఫ్రాంచైజీని కూడా నిర్మిస్తోంది. ఈ బ్యానర్ లో విడుదలైన ‘కాంతారా’ ఎలాంటి రికార్డులు క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు ఈ సంస్థలో భారీ బడ్జెట్ చిత్రాలకు ఎక్కువ ఆస్కారం ఉంది. కొత్తదనం నిండిన కథల్ని చెప్పడానికి దర్శకులకు అవకాశం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రముఖ నటుడు మోహన్ లాల్ (Mohanlal) కూడా ఈ నిర్మాణ సంస్థ గురించి ప్రస్తావిస్తూ.. “కాంతారా : చాప్టర్ 1 లో అవకాశం ఇస్తారా? అంటూ అడుగుతున్నారు
కాంతారా: చాప్టర్ 1లో మోహన్ లాల్..
ఒక ఇంటర్వ్యూలో భాగంగా..” కాంతారా: చాప్టర్ 1 లో నన్ను నటించమని అడగండి..నాకు ఒక పాత్ర ఇస్తే చాలు.. నేను గొప్ప నటుడిని అని నిరూపించుకుంటాను”..అంటూ చిత్ర నిర్మాతలకు నేరుగా విజ్ఞప్తి చేశాడు మోహన్ లాల్. వాస్తవానికి హోం భలే ఫిలింస్ పై మోహన్ లాల్ కి ఉన్న అభిమానం చాలా ప్రత్యేకమైనది. అందుకే దిగ్గజ నటుడు మోహన్ లాల్ ను హోంభలే.. తమ భవిష్యత్తు ప్రాజెక్టులలో నటింపజేసే అవకాశం ఉందని ,ఈయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇక మొత్తానికైతే కాంతార ఫ్రాంచైజీగా వస్తున్న కాంతారా: చాప్టర్ 1 లో మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు త్వరలో దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
అక్టోబర్ 2న కాంతారా: చాప్టర్ 1
ఇక కాంతారా: చాప్టర్ 1 విషయానికి వస్తే.. 2022 పౌరాణిక డ్రామాగా వచ్చిన కాంతారా సినిమా కి ప్రీక్వెల్ ఇది.. బనవాసి కధంబుల పాలనలో సాగే కథాంశంగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ఇందులో రిషబ్ శెట్టి.. మానవాతీత శక్తులు కలిగిన ఒక నాగసాధువు పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ చిత్రం కథనంలో ప్రత్యేకత, భారతీయ సినిమా స్థాయిని పెంచుతుందని కూడా అందరూ భావిస్తున్నారు. ఇక ఈ కాంతారా : చాప్టర్ 1 అక్టోబర్ 2న వివిధ భాషలలో విడుదల కానుంది. దీంతోపాటు హోంభలే ఫిలిమ్స్ బ్యానర్లో సలార్ : పార్ట్ 2 – శౌర్యాంగ పర్వంను నిర్మించేందుకు సన్నహాలు కూడా చేస్తున్నారు. ఇక మోహన్ లాల్ విషయానికి వస్తే లూసీఫర్ సీక్వెల్ గా ‘లూసీఫర్ 2: ఎంపురాన్’ సినిమాను ఇటీవల విడుదల చేశారు. పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా విడుదలైన రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరి సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రస్తుతం వరుస కలెక్షన్లతో ఈ సినిమా దూసుకుపోతోంది.
Kannappa: రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు.. అలాగే కొడుకు నటనపై స్పందిస్తూ..!