Allu Arjun: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తిరుగులేని కమెడియన్స్ లిస్ట్ తీస్తే.. అల్లు రామలింగయ్య పేరు మొదటి వరుసలో ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. కామెడీ విలన్ గా అయినా సరే.. కమెడియన్ గా అయినా సరే నటనలో ఆయనను కొట్టేవారు లేరు. హీరోహీరోయిన్స్ డేట్స్ లేకపోతే షూటింగ్ ఆగుతుందని విన్నాం. అప్పట్లో అల్లు రామలింగయ్య డేట్స్ లేక చాలా సినిమాలు షూటింగ్స్ ను క్యాన్సిల్ చేసుకొనేవారట. అంతలా ఆయన బిజీగా ఉండేవారట.
1000 చిత్రాలకు పైగా నటించిన అల్లు రామలింగయ్య చనిపోయేవరకు కూడా సినిమాల్లో నటిస్తూనే వచ్చారు. అల్లు రామలింగయ్య నటించిన చివరి చిత్రం కళ్యాణరాముడు. ఇక అల్లు రామలింగయ్య 1922, అక్టోబర్ 1 న జన్మించారు. నేడు ఆయన 102 వ జయంతి. 2004 లో వృద్ధాప్య సమస్యలతో అల్లు రామలింగయ్య మరణించారు. ఇక అల్లు కుటుంబం ఎప్పుడు అల్లు రామలింగయ్యను స్మరిస్తూనే ఉంటుంది. కొడుకు అల్లు అరవింద్ ను హీరోగా నిలబెట్టాలని అల్లు రామలింగయ్య ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ, అల్లు అరవింద్ నటించడం పైన కంటే నిర్మించడంపైనే ఎక్కువ ఫోకస్ ఉండడంతో నిర్మాతగా మార్చరట.
ఇక తాత కలను నిజం చేయడానికి అల్లు అర్జున్ రంగంలోకి దిగాడు. గంగోత్రి సినిమాతో కెరీర్ మొదలుపెట్టిన బన్నీ.. అంచలంచలుగా ఎదుగుతూ వస్తున్నాడు. ఐకాన్ స్టార్ గా మారినా.. తనను ఇలా నిలబెట్టిన తాతను మాత్రం ఏరోజు మరువలేదు. అల్లు రామలింగయ్య జయంతిని కానీ, వర్థంతిని కానీ బన్నీ ఎప్పుడు మరిచింది లేదు. తాజాగా తాత 101 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి బన్నీ నివాళులు అర్పించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. బన్నీ ముఖం కనిపించలేదు కానీ, ఆయన అల్లు రామలింగయ్య విగ్రహానికి మాల వేసి నివాళులు అర్పించాడు.
ఇక అల్లు వర్సెస్ మెగా విభేధాల గురించి తెల్సిందే. చిరంజీవి లేనిదే అల్లు అర్జున్ లేడు అని కొందరు అంటారు. అసలు అల్లు రామలింగయ్య లేనిదే చిరంజీవి లేడు అని ఇంకొంతమంది అంటారు. చిరు ఎన్నోసార్లు.. అల్లు రామలింగయ్య వలనే తాను ఇలా ఉన్నానని ఒప్పుకున్నాడు. ఆ సమయంలో తాను ఎదుగుతాను అని తెలిసే ఆయన తన కూతురిని ఇచ్చి పెళ్లి చేశాడని చెప్పుకొచ్చాడు. ఇక ఇప్పుడు మెగా వర్సెస్ అల్లు విషయానికొస్తే.. మెగా లెగసీని చరణ్ ముందుకు తీసుకెళ్తుంటే.. అల్లు లెగసీని అల్లు అర్జున్ ముందుకు తీసుకెళ్తున్నాడు.
ఇక బన్నీ కెరీర్ విషయానికొస్తే ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. డిసెంబర్ 6 న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. ఈ ఏడాది అల్లు అర్జున్ చేసిన కొన్ని పనుల వలన సోషల్ మీడియాలో ఎన్ని విమర్శలు అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ, వాటన్నింటిని తట్టుకొని నిలబడాలన్నా.. ? ట్రోల్స్ బారిన పడకుండా ఉండాలన్నా పుష్ప 2 తో బన్నీ హిట్ కొట్టాల్సిందే. మరి ఈ సినిమాతో అల్లు అర్జున్ ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలంటే ఇంకొన్ని నెలలు ఆగాల్సిందే.
Remembering the legacy. Icon Star @alluarjun pays his heartfelt tribute to his grandfather, Legendary actor, Padma Shri Dr. #AlluRamalingaiah garu on his birth anniversary. pic.twitter.com/BXvcH5TQ85
— Allu Arjun Official (@TeamAAOfficial) October 1, 2024