BigTV English

Akkineni Amala : పెళ్లి ఇంట కొత్త చిచ్చు… అమల ఎంత పని చేసింది అంటూ ఫైర్

Akkineni Amala : పెళ్లి ఇంట కొత్త చిచ్చు… అమల ఎంత పని చేసింది అంటూ ఫైర్

Akkineni Amala : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా ఫ్యామిలీలలో ఒకటైన అక్కినేని ఫ్యామిలీలో త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. ఒకటి కాదు ఏకంగా రెండు పెళ్లిళ్లు ఒకేసారి జరగబోతున్నాయనే వార్త తెరపైకి వచ్చింది. అక్కినేని నాగచైతన్య (Akkineni Naga Chaitanya) శోభిత దూళిపాళ (Shobhita dhulipala)తో పెళ్లికి సిద్ధమవుతుండగా.. మరోవైపు సడన్ గా అఖిల్ (Akkineni Akhil) కూడా నిశ్చితార్థం చేసుకొని ఆశ్చర్యపరిచారు. దీంతో ఇద్దరు పెళ్లిళ్లు ఒకే వేదికపై జరిపించాలని అక్కినేని ఫ్యామిలీ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇద్దరి హీరోల వివాహాలను త్వరలోనే ఒకే వేదికపై చూడబోతున్నాము అని అభిమానులు సంబరపడేలోపే అక్కినేని అమల(Akkineni Amala) చేసిన పని నాగచైతన్య అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. అంతేకాదు బుద్ధి చూపించింది అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.


స్నేహాన్ని బంధంగా మార్చుకున్న లెజెండ్రీస్..

సినీ ఇండస్ట్రీలో దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswar Rao), దివంగత నిర్మాత దగ్గుబాటి రామానాయుడు (Daggubati Ramanaidu) మంచి స్నేహితులుగా ఉండేవారు. స్నేహాన్ని బంధుత్వంగా మార్చుకోవాలి అనుకున్న వీరు.. నాగేశ్వరరావు తన కొడుకు నాగార్జున (Nagarjuna) కు రామానాయుడు కూతురు దగ్గుబాటి లక్ష్మీ(Daggubati lakshmi)ని ఇచ్చి వివాహం జరిపించారు. వీరి ఇద్దరికి నాగ చైతన్య జన్మించాడని అందరికీ తెలిసిందే.. అయితే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో, విడాకులు తీసుకొని వేరుపడ్డారు. దీంతో లక్ష్మీ నాగచైతన్యను తీసుకొని చెన్నైకి వెళ్ళిపోయి, అక్కడే వ్యాపారవేత్తను వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి అమెరికాలో ఉంటున్నా.. నాగచైతన్య విద్యాభ్యాసం పూర్తయ్యే వరకు చెన్నైలోనే ఉంది. చెన్నైలో ఉన్నప్పుడు తన తండ్రిని కలుసుకోవడానికి అప్పుడప్పుడు హైదరాబాద్ కి వచ్చే నాగచైతన్య, చదువు పూర్తయిన తర్వాత హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యి కెరియర్ పై ఫోకస్ పెట్టారు.


అమల.. నాగచైతన్యను కొడుకుగా స్వీకరించారా..?

ఇక మరోవైపు నాగార్జున.. దగ్గుబాటి లక్ష్మికి విడాకులు ఇచ్చిన వెంటనే రష్యాకు చెందిన ప్రముఖ నటి అమలను వివాహం చేసుకున్నారు. ఇకపోతే వీరిద్దరికీ అఖిల్ జన్మించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా నాగచైతన్య – అమల ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సందర్భాలు ఎక్కడా కనిపించలేదు. ఒకవేళ ఏదైనా వెకేషన్ కి, ట్రిప్ కి వెళ్లినా ఫోటోల్లో కనిపిస్తారే తప్ప, ఇద్దరి మధ్య సఖ్యత ఉన్న దాఖలాలు కనిపించవు. ముఖ్యంగా సమంత – నాగ చైతన్య విడిపోవడానికి కారణం కూడా ఒకరకంగా అమల అనే వార్తలు గతంలో వినిపించాయి.

కొడుకలపై వివక్షత చూపిస్తుందా..?

అయితే ఇదంతా కాస్త పక్కన పెడితే.. నాగచైతన్య – శోభితతో ఆగస్టు 8వ తేదీన నిశ్చితార్థం చేసుకున్నారు. ఆ ఫోటోలను నాగార్జున సోషల్ మీడియాలో షేర్ చేసి కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఈ ఫోటోలను అమల సోషల్ మీడియాలో షేర్ చేయలేదు. వాస్తవానికి అమల సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండరు కాబట్టి ఈ విషయాన్ని ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఈమె సొంత కొడుకు అయినా అఖిల్ నిశ్చితార్థం కూడా జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త కూతురైన జైనాబ్ రవ్డ్జీ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ ఫోటోలను అమలా తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసి వారికి శుభాకాంక్షలు చెప్పారు.

తెరపైకి కొత్త చర్చ..

దీంతోనే అసలు రచ్చ తెరపైకి వచ్చింది. సొంత కొడుకు అఖిల్ ఎంగేజ్మెంట్ పై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన అమల, సవతి కొడుకు నాగచైతన్య పట్ల ఎందుకు వివక్షత చూపిస్తోంది..? దీన్ని బట్టి చూస్తే అమలకు నాగచైతన్య పట్ల ఎఫెక్షన్ లేదు.. అసలు నాగచైతన్యను అమల కొడుకుగా అంగీకరించడం లేదు.. అంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఇందులో ఎంత నిజముందో తెలియదు కానీ నెట్టింట కొత్త దుమారం రేపింది అని చెప్పవచ్చు.

Related News

Avika Gor : ప్రేమించిన వాడితో ఏడడుగులు వేసిన చిన్నారి పెళ్ళికూతురు.. చెప్పినట్టే చేసిందిగా!

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Big Stories

×