BigTV English

Amaran : ‘అమరన్’ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన మేకర్స్… ఆ సీన్స్ ఛేంజ్

Amaran : ‘అమరన్’ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టిన మేకర్స్… ఆ సీన్స్ ఛేంజ్

Amaran : బ్లాక్ బస్టర్ మూవీ ‘అమరన్’ లో వివాదానికి దారితీసిన అంశాలపై తాజాగా మేకర్స్ చర్యలు తీసుకున్నారు. ఓ స్టూడెంట్ ఏకంగా మేకర్స్ ని రూ. 1.1 కోట్ల నష్టపరిహారం కోరుతూ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ వివాదానికి తాజాగా చిత్ర నిర్మాతలు ఫుల్ స్టాప్ పెట్టారు.


శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా రూపొందిన బ్లాక్ బస్టర్ మూవీ ‘అమరన్’ (Amaran). దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ నిర్మాతలకు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ మాత్రమే కాదు ‘అమరన్’ నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాలో ఒక సన్నివేశంలో మేకర్స్ పొరపాటున చెన్నై కాలేజ్ స్టూడెంట్ ఫోన్ నెంబర్ ని వాడారు. సాయి పల్లవి తన ఫోన్ నెంబర్ ను శివ కార్తికేయన్ తో పంచుకున్న సీన్ అది. ఈ సీన్ ఏకంగా న్యాయ పోరాటానికి దారి తీసింది. ఎందుకంటే ఈ ఒక్క సన్నివేశం కారణంగా చెన్నైకి చెందిన కాలేజీ స్టూడెంట్ తన నెంబర్ కు విపరీతంగా కాల్స్ వస్తున్నాయని ఆవేదనను వ్యక్తం చేశారు. బిగ్ స్క్రీన్ పై ఆ నెంబర్ ను చూసిన కొంతమంది అది నిజంగానే సాయి పల్లవి నెంబర్ అనుకుని వరుసగా కాల్స్ చేయడంతో, గ్యాప్ లేకుండా 4000 ఫోన్ కాల్స్ వచ్ఛాయట.

దీంతో సినిమాలో తన పర్మిషన్ లేకుండా ఇలా ఫోన్ నెంబర్ ను వాడి, తనను ఇబ్బందులకు గురి చేసినందుకు ‘అమరన్’ (Amaran) నిర్మాతలు రూ. 1. 1 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వాగేషన్ అనే ఆ స్టూడెంట్ కేసు పెట్టారు. అయితే ఈ కేసు ఇంకా కోర్టులో ఉండగానే ‘అమరన్’ (Amaran) నిర్మాతలు ఆ సీన్స్ ని సరిదిద్దారు. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో సదరు సన్నివేశంలో ఫోన్ నెంబర్ ని బ్లర్ చేశారు. ‘హే మిన్నలే’ అనే సాంగ్ లో ఆ నెంబర్ ఇదివరకు కనిపించింది. అయితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టుగా బాధితుడు కోర్టుకెక్కిన తర్వాత, నిర్మాతలు ఈ చర్యలు తీసుకున్నారు. మరి బాధితుడు కేసు పెట్టిన విధంగా నిర్మాతలు కోటి రూపాయలను సమర్పించుకోవాల్సిందేనా అన్నది తెలియాలంటే ఈ విషయంపై కోర్టులో తీర్పు వచ్చేదాకా ఆగాల్సిందే.


రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ‘అమరన్’ (Amaran) మూవీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం. శివకార్తికేయన్ మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రను పోషించగా, సాయి పల్లవి అతని భార్య ఇంధు రెబెకా వర్గీస్‌గా కనిపించింది. రాహుల్ బోస్, భువన్ అరోరా, లల్లు, శ్రీకుమార్, గీతా కైలాసం, ఉమైర్ ఇబాన్ లతీఫ్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 5 నుండి ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

 

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×