BigTV English

Amitabh Bachchan: నా మరణం తర్వాత.. నా రూ.3,190కోట్ల ఆస్తి వారికే ..!

Amitabh Bachchan: నా మరణం తర్వాత.. నా రూ.3,190కోట్ల ఆస్తి వారికే ..!

Amitabh Bachchan: బాలీవుడ్ బిగ్ బీ గా గుర్తింపు తెచ్చుకున్న అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అసలు హీరో ముఖమా అంటూ విమర్శించిన వారు కూడా ఉన్నారు. అలాంటి ఎన్నో విమర్శలు, హేళనలు ఎదుర్కొని నేడు బాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్నారు అమితాబ్ బచ్చన్. హీరో గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , హోస్ట్ గా కూడా వ్యవహరిస్తూ.. భారీ ఇమేజ్ దక్కించుకున్నారు. ఇక అంతేకాదు ఎనిమిది పదుల వయసులో కూడా యాక్షన్ పర్ఫామెన్స్ తో అదరగొడుతూ అందరిని ఆశ్చర్య పరుస్తున్నారు అమితాబ్ బచ్చన్. ఇకపోతే సినిమాల తోనే కాదు యాడ్స్, టీవీ కార్యక్రమాలతో భారీగా సంపాదించారు కూడా..అలా సుమారుగా రూ.3,190 కోట్లకు అధిపతి అయ్యారు అమితాబ్ బచ్చన్.


కూతురు పేరు మీద విలాసవంతమైన బంగ్లా..

ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అమితాబ్ బచ్చన్ తన ఆస్తులకు తానే వారసుడినని తన ఆస్తులు అభిషేక్ వెళ్ళవు అంటూ చెప్పడం ఆశ్చర్యంగా మారింది. ఇకపోతే బాలీవుడ్ నటుడిగా వేలకోట్ల ఆస్తులకు యజమాని అయిన ఈయన.. తన కుమార్తె శ్వేతాకు ప్రతీక్ష బంగ్లాను బహుమతిగా అందించారు. 1564 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన ఈ బంగ్లా ధర సుమారుగా రూ.50 కోట్లు ఉంటుందని సమాచారం. ఇక అంతే కాదు జల్సా అనే మరో విలాసవంతమైన బంగ్లా కూడా ఈయన కలిగి ఉన్నారు. దీని విలువ సుమారుగా రూ.112 కోట్లు ఉంటుంది. ఇది చాలా విలువైనది కూడా.. అంతే కాదు తండ్రీకొడుకుల పేరు మీద బంగ్లాలు కూడా ఉన్నాయి.


నా వేలకోట్ల ఆస్తులు అభిషేక్ కి కాదు.. అమితాబ్ బచ్చన్

అమితాబ్ బచ్చన్ దగ్గర విలువైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. బెంట్లీ కాంటినెంటల్ GT, రేంజ్ రోవర్ ఆటో బయోగ్రఫీ, రోల్స్ రాయిస్ ఫాంటమ్, లెక్సస్ LX 570 తో పాటు ఆడి A8L వంటి లగ్జరీ వాహనాలతో పాటు రూ.260 కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ కూడా ఉంది. ఇక అలాగే ఇంత ఆస్తి కలిగి ఉన్న అమితాబ్ బచ్చన్ తర్వాత ఆయన ఆస్తి మొత్తం ఆయన వారసుడు అభిషేక్ కి వెళ్తుంది అని అందరూ అనుకున్నారు. కానీ ఈ విషయంపై ఆయన హోస్ట్గా వ్యవహరిస్తున్న కౌన్ భనేగా కరోడ్పతి కార్యక్రమంలో తెలిపి అందరిని ఆశ్చర్యపరిచారు. అమితాబ్ బచ్చన్ తన రియాల్టీ షో కౌన్ బనేగా కరోడ్పతి లో ఈ ఆస్తుల పంపకంపై మాట్లాడారు. అభిషేక్ బచ్చన్ కి మొత్తం ఆస్తి లభిస్తుందని అందరూ అనుకుంటున్నారు. కానీ అలా లభించదు. మాకు ఇద్దరు పిల్లలు.అభిషేక్ బచ్చన్ , శ్వేత . నా రూ.3,190 కోట్ల ఆస్తిలో సగం, సగం నా కొడుకు, కూతురుకి చెందుతుంది. ప్రస్తుతానికి నా మొత్తం ఆస్తికి నేనే వారసుడిని. నా కష్టార్జితంతోనే ఇదంతా సంపాదించాను. కాబట్టి నా తదనంతరం ఈ ఆస్తిని సమానంగా వారిద్దరికీ పంచుతాను అంటూ అమితాబచ్చన్ క్లారిటీ ఇచ్చారు మొత్తానికైతే ఇన్ని వేల కోట్ల ఆస్తికి వారసుడు అభిషేక్ మాత్రమే అంటూ వస్తున్న వార్తలను నిజం లేదని, ఈ ఆస్తిలో ఇద్దరికీ భాగాలు అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి అయితే అమితాబ్ బచ్చన్ కొడుకు, కూతురు అని తేడా లేకుండా ఇద్దరికీ తన ఆస్తిలో సమ వాటా ఇస్తుండడంపై ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Ishwarya Menon: ఎలా ఉండేది.. ఇలా అయిపోయింది.. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సీక్రెట్ ఏంటో..?

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×