BigTV English

India T20 World Cup Squad: టీ 20 వరల్డ్ కప్‌లో యశస్వి, గిల్ ఆడతారా..? లేదా..? అసలేం జరగబోతుంది..?

India T20 World Cup Squad: టీ 20 వరల్డ్ కప్‌లో యశస్వి, గిల్ ఆడతారా..? లేదా..? అసలేం జరగబోతుంది..?

India T20 World Cup Squad: ఐపీఎల్ జోరు చూస్తుంటే టీమ్ ఇండియా టీ 20 ప్రపంచకప్ లో దుమ్ము దులిపేలా ఉందని అందరూ అంటున్నారు. అయితే టీమ్ ఇండియాపై అప్పుడే అందరూ ఒక అంచనాకి వచ్చేశారనే టాక్ అయితే నడుస్తోంది. ముఖ్యంగా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్లలో మొత్తం ఐదుగురు ఉన్నారు. ఓపెనర్లకి మంచి డిమాండ్ కనిపిస్తోంది.ఎవరిని ఉంచాలి, ఎవరిని పక్కన పెట్టాలనేది పెద్ద తలనొప్పిగా మారింది.


వీటన్నింటితోపాటు విరాట్ కొహ్లీని ఎక్కడకి పంపించాలి. ఓపెనర్ గా వెళతాడా? ఫస్ట్ డౌన్ వెళతాడా? లేక సెకండ్ డౌన్ ఆడతాడా? అనేదానిపై క్లారిటీ లేదు. అంతేకాదు ఈ విషయాన్ని స్వయంగా విరాట్ తో కూడా చర్చించాల్సి ఉంటుంది. ఎందుకంటే తనెక్కడైనా ఆడతాడు. పరిస్థితులకి తగినట్టుగా ఆడతాడు.

Yashasvi Jaiswal and Shubman Gill (1)
Yashasvi Jaiswal and Shubman Gill (1)

కానీ, తను అంగీకరించేలా ఒప్పించడం టీమ్ మేనేజ్మెంట్ కి విషమ పరీక్ష అంటున్నారు. అంటే సీనియర్ అయిన కొహ్లీకి కౌన్సెలింగ్ చేసి ఒప్పించడం కన్నా కుర్రాళ్లనే ముందు, వెనుకకు పంపించవచ్చు కదా.. అని కొందరు కామెంట్ చేస్తున్నారు.


Also Read: Raman Subba Row Dies: మాజీ క్రికెటర్ రామన్ ఇక లేరు, సొంతూరు ఏపీలోని

ఇకపోతే ప్రస్తుత సీజన్ లో ఎన్నో అంచనాలతో వచ్చిన యశస్వి జైశ్వాల్, గిల్ తేలిపోతున్నారు. వైట్ బాల్ క్రికెట్ ని ఇంకా వాళ్లు అందుకోలేక పోతున్నారు. ఈ క్రమంలో వీరిద్దరిలో ఎవరో ఒకరినే తీసుకోవాలంటే, అదొక పెద్ద పజిల్ అని అంటున్నారు. ఇకవేళ ఇద్దరినీ తీసుకుంటే వీరిలో ఒకరు రోహిత్ శర్మతో ఓపెనింగ్ చేస్తారు. అప్పుడు గిల్ ఫస్ట్ డౌన్ వస్తాడు. సెకండ్ డౌన్ కొహ్లీ రావల్సి ఉంటుంది. ఇదొక ఆర్డర్ అనేది అందరికీ తెలిసిన విషయమే.

ఇకపోతే కొత్త కుర్రాళ్లు రింకూ సింగ్, శివమ్ దుబె ఇద్దరూ పక్కా కన్ ఫర్మ్ అని అంటున్నారు. చివరిగా చెప్పాలంటే కీపర్ కమ్ బ్యాటర్లు ఐదుగురు కనిపిస్తున్నారు. వీరిలో రిషబ్ పంత్ పక్కా అంటున్నారు. తనకి తోడు సంజూ శాంసన్, కేఎల్ రాహుల్, జితేశ్, ఇషాన్ ఇలా అందరూ కనిపిస్తున్నారు. వీరిలో ఎవరు ఫైనల్ అదే దానిపై క్లారిటీ లేదు.

Also Read: మేం ముగ్గురం కలవలేదు.. ధోనీ గురించి చెప్పలేను: రోహిత్ శర్మ

అయితే టీమ్ మేనేజ్మెంట్ అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చినట్టు అంటున్నారు. మొత్తానికి వచ్చేవారంలో దాదాపు ఎంపిక ఖరారవుతుందని చెబుతున్నారు.

Related News

Virat Kohli: RCBకి ఎదురుదెబ్బ.. కోహ్లీ షాకింగ్ నిర్ణయం… అగ్రిమెంట్ రద్దు!

Rahkeem Cornwall Helmet: జ‌స్ట్ మిస్‌… బుల్లెట్ లా దూసుకొచ్చిన బంతి…హెల్మెట్ లో ఇరుక్కుని మ‌రి..!

Smriti Mandhana: స్మృతి మందాన 28 ఏళ్ల‌ చ‌రికొత్త రికార్డు..1000 ప‌రుగులు క్రాస్, ఆసీస్ పై భారీ స్కోర్‌

Ind vs WI: 5 వికెట్ల‌తో చెల‌రేగిన‌ కుల్దీప్…మొద‌టి ఇన్నింగ్స్ లో విండీస్ ఆలౌట్‌..స్కోర్ వివ‌రాలు ఇవే

Mahika Sharma: 13 ఏళ్లలోనే షాహిద్ ఆఫ్రీదితో ఎ**ఫైర్‌.. బ‌య‌ట‌ప‌డ్డ‌ పాండ్యా కొత్త ల‌వ‌ర్ భాగోతం !

INDW vs AUSW: ఇవాళ ఆసీస్ తో బిగ్ ఫైట్‌..ఓడితే టీమిండియా ఇంటికేనా? పాయింట్ల ప‌ట్టిక ఇదే

Sai Sudharsan Catch: సాయి సుద‌ర్శ‌న్ స‌న్నింగ్ క్యాచ్‌..చూస్తే గూస్ బంప్స్ రావాల్సిందే..కానీ చివ‌ర‌కు

Roman Reigns vs Bronson reed: క్రికెట్ బ్యాట్ ప‌ట్టి చిత‌క‌బాదిన రోమన్ రీన్స్..బ‌లంగా బాదేసి మ‌రీ, కానీ చివ‌ర‌కు

Big Stories

×