Adivi Sesh: యాక్షన్, థ్రిల్లర్ చిత్రాలు తెరకెక్కించాలంటే భారీ బడ్జెట్ కావాలి, నిర్మాతలు అదిరిపడే రేంజ్‌లో పెట్టుబడులు పెట్టాలి అని కొందరు ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. కానీ మినిమమ్ బడ్జెట్‌తో ఒక రేంజ్‌లో యాక్షన్ థ్రిల్లర్ సినిమాలు తెరకెక్కించి ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచిన యంగ్ హీరో అడవి శేష్. ఒక పాన్ ఇండియా మూవీ తెరకెక్కించే బడ్జెట్‌తో అడవి శేష్ నాలుగు థ్రిల్లర్ సినిమాలు తీసి హిట్ కొట్టగలడు అని ఇప్పటికే చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఇక ప్రస్తుతం అడవి శేష్ ఖాతాలో మరో రెండు చిత్రాలు ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధంగా ఉండగా.. వాటికి సంబంధించిన సర్‌ప్రైజ్‌లతో సిద్ధంగా ఉన్నట్టు బయటపెట్టాడు.
అప్డేట్స్ వస్తున్నాయి
అడవి శేష్ (Adivi Sesh) హీరోగా నటించిన ‘గూఢచారి’ సినిమా అప్పట్లో సూపర్ సక్సెస్‌ను సాధించింది. నాగచైతన్య సతీమణి శోభితా ధూళిపాళ కూడా ఈ మూవీతోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. అయితే ఆ మూవీకి సెకండ్ పార్ట్ కూడా ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు మేకర్స్. దానికి కథ సిద్ధంగా ఉన్నా కూడా అప్పటికే అడవి శేష్ పలు ఇతర సినిమాలకు కమిట్ అవ్వడంతో ఇప్పటికే ‘గూఢచారి 2’ను సెట్స్‌పైకి తీసుకెళ్లే ఛాన్స్ రాలేదు. కొన్నాళ్ల క్రితం ‘గూఢచారి 2’ (Goodachari 2) స్టార్ట్ చేస్తున్నట్టుగా అప్డేట్ ఇచ్చాడు అడవి శేష్. మధ్యలో ‘డెకాయిట్’ అనే మరో మూవీ చేస్తున్నట్టు ప్రకటించాడు. అలా ప్రస్తుతం అడవి శేష్.. ఈ రెండు పడవలపై ప్రయాణం చేస్తున్నాడు.
Also Read: యాక్సిడెంట్ జీవితంపై నవీన్ అలాంటి కామెంట్స్.. బాలయ్య ఏమన్నారంటే..?
బ్యాక్ టు బ్యాక్
అడవి శేష్ చేస్తున్న రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉండగా.. తాజాగా వీటికి సంబంధించిన అప్డేట్స్ అందించాడు. ‘డిసెంబర్‌లో డెకాయిట్ సర్‌ప్రైజ్. జనవరిలో గూఢచారి 2 సర్‌ప్రైజ్’ ట్వీట్ చేశాడు ఈ యంగ్ హీరో. సర్‌ప్రైజ్ అన్నావు కానీ ఏం సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నావు, ఎప్పుడు ఇవ్వబోతున్నావు అంటూ ఫ్యాన్స్ అప్పుడే దీనికి కామెంట్స్ పెట్టడం మొదలుపెట్టారు. అంటే ఈ మూవీ నుండి అప్డేట్స్ వస్తున్నాయని హింట్ ఇచ్చిన అడవి శేష్.. అవి ఎప్పుడు వస్తున్నాయనే వివరాలు పూర్తిగా బయటపెట్టలేదు. కొన్నాళ్ల క్రితం ‘డెకాయిట్’ (Dacoit) విషయంలో జరిగిన కన్ఫ్యూజన్ క్లియర్ అయ్యిందని కూడా ఈ ట్వీట్‌తో క్లారిటీ ఇచ్చేశాడు.
హీరోయిన్ ఎవరు?
ఇప్పటికే ‘డెకాయిట్’కు సంబంధించిన గ్లింప్స్ ఒకటి విడుదలయ్యింది. అందులో అడవి శేష్‌కు జోడీగా శృతి హాసన్ నటిస్తుందని మేకర్స్ చూపించారు. కానీ కొన్నాళ్ల షూటింగ్ తర్వాత మేకర్స్‌తో శృతి హాసన్‌కు విభేదాలు వచ్చాయి. దీంతో తను ఈ మూవీ నుండి తప్పుకుంది. ఈ విషయాన్ని శృతి స్వయంగా బయటపెట్టింది. కొన్నాళ్లు షూటింగ్ కూడా పూర్తయ్యింది కాబట్టి ఇప్పుడు మళ్లీ ఆ సీన్స్ అన్నింటిని కొత్త హీరోయిన్‌తో రీషూట్ చేయాలి. కానీ ఆ కొత్త హీరోయిన్ ఎవరు అనే విషయాన్ని ‘డెకాయిట్’ టీమ్ ఇంకా బయటపెట్టలేదు. దీంతో అడవి శేష్ ‘డెకాయిట్’లో హీరోయిన్ ఎవరో డిసెంబర్‌లో ప్రకటించనున్నాని ఆడియన్స్ అంచనా వేస్తున్నారు.
December #DACOIT surprise 🙂
January #G2 surprise 🙂❤️🔥
— Adivi Sesh (@AdiviSesh) December 7, 2024