Harihara Veeramallu : ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు… దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. టాలీవుడ్ దర్శకులు క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడిక్ పాన్ ఇండియా సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. పవన్ కళ్యాణ్ తొలిసారిగా ఒక యోధుడు పాత్రలో కనిపించనున్న ఈ సినిమా కోసం అభిమానులు సుమారు ఐదేళ్లుగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీలో అనసూయ ఐటమ్స్ సాంగ్ చేసింది. ఆ పాటకు అనసూయ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందా అన్నది సోషల్ మీడియాలో ప్రస్తుతం చర్చ.. ఈ సాంగ్ చేసినందుకు అనసూయ ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో తెలుసుకుందాం..
అనసూయ రెమ్యూనరేషన్..?
బుల్లితెరపై యాంకర్ గా పాపులర్ అయిన అనసూయ ఈమధ్య ఓన్లీ సినిమాల్లో మాత్రమే నటిస్తుంది. ప్రత్యేక పాత్రలో నటించడంతో పాటుగా స్పెషల్ సాంగులు చేస్తూ కుర్ర కారుని అలరిస్తుంది. ఎలా కనిపించినా కూడా అనసూయను కుర్రాళ్ళు ఇష్టపడుతున్నారు. రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా ప్రేక్షకుల మనసు దోచుకున్న అనసూయ ప్రస్తుతం పవర్స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాతో రంగమ్మత్తగా ప్రేక్షకుల మనసు దోచుకుంది అనసూయ.. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.
ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన కొల్లగొట్టిందిరో సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఈ పాటలో యాంకర్ అనసూయ కూడా స్టెప్పేసి పవన్ కళ్యాణ్ అభిమానులను ఆకర్షించింది. ఈ సాంగ్ లో అనసూయ ఎంత అందంగా హీరోయిన్ ను డామినేట్ చేసేలా కనిపిస్తుంది. అయితే ఇందుకు గాను అనసూయ ఏకంగా 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుందని సమాచారం. కేవలం రెండే రోజులు కాల్ షీట్స్ ఇచ్చి 50 లక్షలు రెమ్యూనరేషన్ తీసుకుందని టాక్.. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Also Read : ఆ ఇద్దరు యాక్టింగ్ ఎలా చేశారు… ఇటలీ నుంచి వచ్చి రాగానే ఆరా తీస్తున్న ప్రభాస్..?
వీరమల్లు స్టోరీ విషయానికొస్తే..
తెలంగాణ పోరాట యోధుడు ‘పండగ సాయన్న’ జీవిత కథనే హరిహర వీరమల్లుగా తెరకెక్కిస్తున్నారనే ప్రచారం ఎప్పట్నుంచో ఉంది.టీజర్ తో పాటు ఇటీవల విడుదలైన రెండు సాంగ్స్ ఒక రేంజ్ లో ఉండటంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు,ప్రేక్షకుల్లో ‘వీరమల్లు’పై భారీ అంచనాలు ఉన్నాయి.. ఈ మూవీలో బాలీవుడ్ నటుడుబాబీడియోల్ఔరంగ జేబు గా మరోసారి ‘వీరమల్లు’ లో తన నట విశ్వ రూపాన్ని చూపించబోతున్నాడు.నాజర్,అనసూయ,నోరా ఫతేహి, జిష్ణుసేన్ గుప్తా, పూజిత పొన్నాడ, సునీల్, వంటి వారు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏఎం రత్నం, దయాకర్ లు 200 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా కీరవాణి సంగీతాన్ని అందించాడు.. జూలైలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.