Anasuya: టాలీవుడ్ స్టార్ యాంకర్ నటి అనసూయ అటు సినిమాలతోనే కాక, ఇటు తన ఇంట్లో కొత్త కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఇటీవల కొత్త ఇంట్లోకి అడుగు పెట్టినట్లు నటి అనసూయ తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఎంతో వేడుకగా గృహప్రవేశ కార్యక్రమాన్ని బంధుమిత్రుల సమక్షంలో నిర్వహించారు. ఈ వేడుకలు అనంతరం అనసూయ దంపతులు తాజాగా ఆమె నివాసంలో మరో శుభకార్యం జరిగినట్లుగా వీడియోలను సోషల్ మీడియా వేదికగా మరోసారి షేర్ చేశారు. ఇప్పుడు వివరాలు చూద్దాం..
అనసూయ కొత్త ఇంట్లో మరో కొత్త వేడుక..
అనసూయ జబర్దస్త్ షో ద్వారా పాపులర్ అయ్యారు. ఎంతోకాలం ఈమె జబర్దస్త్ షోకి యాంకరింగ్ చేశారు. ఈ షో తో వచ్చిన క్రేజ్ సినిమాలలో నటించడానికి ఉపయోగపడింది. ఎన్నో సినిమాలలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ముఖ్యంగా రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ లో, అనసూయ జీవించిందని చెప్పొచ్చు. ఈ మూవీ తర్వాత ఆమెకి ఎన్నో సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కొన్ని సినిమాలలో హీరోయిన్ గాను నటించి మెప్పించారు. ఇటీవల పుష్ప, పుష్ప 2 సినిమాలలో దాక్షాయిని పాత్రలో, పాన్ ఇండియా గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా అనసూయ ఇంట మరో శుభకార్యం జరిగినట్లు ఆమె పోస్ట్ చేశారు. ఈ కార్యక్రమం తనకు ఎంతో ప్రత్యేకమైన తెలిపింది. తాజాగా తన పెద్ద కుమారుడికి ఉపనయన కార్యక్రమాన్ని అనసూయ నిర్వహించింది. హనుమాన్ జయంతి సందర్భంగా ఈ ఉపనయనాన్ని నిర్వహించినట్లు శౌర్య భరద్వాజకు సాంప్రదాయ పద్ధతిలో, ఈ వేడుకను నిర్వహించారు అనసూయ భరద్వాజ దంపతులు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది అనసూయ. ఈ వేడుకైనా తనకు ఎంతో ప్రత్యేకమని ఆమె తెలిపారు.
శౌర్య భరద్వాజకు..అనసూయ..ఆశీర్వాదం ..
ప్రియమైన శౌర్య భరద్వాజకు నువ్వు ఎల్లప్పుడూ నీతిమంతుడిగా, సాంప్రదాయాన్ని గౌరవించడంలో భవిష్యత్ తరాలకు ఒక స్ఫూర్తిగా నిలవాలని, ఈ జనరేషన్ లోను మన సాంస్కృతిక విలువలను ఆధ్యాత్మిక సూత్రాలను జ్ఞానాన్ని, నీకు అందించే అవకాశాన్ని నువ్వు మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తున్నాను. హనుమన్ శక్తీ నిన్ను ఎల్లప్పుడూ నీతి మార్గంలో నడిపించాలని నేను కోరుకుంటున్నాను అంటూ తన కుమారుని ఆశీర్వదిస్తూ ఆమె ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.ఈ ఉపనయన వేడుక మాకు ఎంతో ఆనందాన్ని ఆధ్యాత్మిక అనుభూతిని అందించింది అని ఆమె తెలిపింది. ఇప్పుడు ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ జనరేషన్ లోను ఇలా సాంప్రదాయంగా కార్యక్రమాలు నిర్వహించడంలో అనసూయ ముందుంటారని ఆమె తన కుటుంబానికి ఇచ్చే విలువ గౌరవం, ఎంతో ప్రత్యేకమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
శ్రీరామ సంజీవిని..గా
ఇటీవల అనసూయ తన కొత్త ఇంటి గృహప్రవేశం సందర్భంగా..ఆమె సీతారామాంజనేయుల కృపతో, మా తల్లిదండ్రుల ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో మా జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. ఈ కొత్త అధ్యాయానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను, మా కొత్త ఇంటి పేరు శ్రీరామ సంజీవిని అని ఆమె తెలిపింది. అనసూయ సినిమాలలోనే కాక, టీవీ షో లోను జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు ప్రస్తుతం మాటీవీలో కిరాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్ షోలో శేఖర్ మాస్టర్తో కలిసి జడ్జిగా వ్యవహరిస్తున్నారు అలాగే కొన్ని వెబ్ సిరీస్ లోను సినిమాలలోనూ నటిస్తున్నారు.
Hari Hara Veeramullu : DCM నిబద్ధత… వీరమల్లులో వాటిని దగ్గరుండి డిలీట్ చేయించారు