Hari Hara Veeramullu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీలక పాత్రలో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం హరిహర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 12న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సినిమాలో పవన్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తుంది. ఈ చిత్రంలో బాబీ డియోల్, నర్గస్ వంటి నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి అసుర హనం అంటూ సాగే మరో పాటను మేకర్స్ బుధవారం విడుదల చేశారు. అందులో భాగంగా కీరవాణి ఈ సినిమాలో ఐటెం సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. కాగా ఈ పాట నుంచి పవన్ కొన్ని పదాలు డిలీట్ చేయించారని సమాచారం.. ఆ వివరాలు చూద్దాం..
దగ్గరుండి డిలీట్ చేయించారు..పాట లో ఆ పదాలు ..
హరిహర వీరమల్లు సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలతో ప్రేక్షకులలో సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ఇక తాజాగా ఇప్పుడు ఈ మూవీలో ఓ ఐటెం సాంగ్ ఉందని కీరవాణి తెలపడంతో ఫాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ సాంగ్ లో యాంకర్ అనసూయ భరద్వాజ్ నటిస్తున్నట్లు సమాచారం. ఐటెం సాంగ్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించే టైంలోనే చిత్రీకరించారు. మొదట కొంత భాగం క్రిష్ దర్శకత్వం వహించి తర్వాత జ్యోతి కృష్ణకు బాధ్యతను అప్పగించాడు. అయితే క్రిష్ దర్శకత్వం వహించే టైంలోనే ఈ ఐటెం సాంగ్ షూటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. తన గ్లామర్ తో కుర్రకారుని కట్టిపడేసే అనసూయ ఈ ఐటమ్ సాంగ్ తో ప్రేక్షకుల కట్టిపడేయనుంది. అయితే ఈ సాంగ్ లో కొన్ని అసభ్యకరమైన పదాలు ఉండడంతో.. ఆ పదాలను పవన్ కళ్యాణ్ దగ్గర ఉండి మరి రిమూవ్ చేయించాడు అని సమాచారం. అనసూయ భరద్వాజ్ నటించిన ఈ ఐటెం సాంగ్ సినిమాలోనే ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఈ పాటలో పవన్ కళ్యాణ్ సూచనలతో అసభ్యకర పదాలను తొలగించి ప్రేక్షకులకు ఫుల్ వినోదాన్ని అందించేలా రూపొందించారు.
మూవీ నుండి మరో సాంగ్ రిలీజ్ ..
ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటుడిగానే కాక రాజకీయాలలో ఒక కీలక పదవిలో డిప్యూటీ సీఎం హోదాలో, పలు కీలక మంత్రిత్వ శాఖలకు బాధ్యత వహిస్తున్నాడు. ఈ టైంలో ఆయన నుంచి వచ్చే సినిమాలు, వాటి నుంచి వచ్చే
పాటలు అన్నీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం వారికి మంచి మెసేజ్ ఇవ్వటానికి మాత్రమే రూపొందించాలి. కానీ ఐటమ్ సాంగ్ లో యూత్ ని ఆకట్టుకోవడం కోసం అసభ్యకరమైన పదాలను వాడితే, దానిపై ఎన్నో విమర్శలు,ట్రోల్స్ వస్తాయని పవన్ కళ్యాణ్ ముందే గ్రహించాడు. అందుకే ఆయన నిబద్ధతతో రిమూవ్ చేయించాడు. ఇక హరిహర వీరమల్లు సినిమా నుండి ఇంపార్టెంట్ సాంగ్ రిలీజ్ అయింది అదే అసుర హనం పాట. మొఘలుల మీద తిరుగుబాటు ప్రకటించిన వీరమల్లు పరాక్రమం తో ప్రజలను ఉత్తేజ పరచే సందర్భంలో సాగే సాంగ్. కీరవాణి చాలా పవర్ ఫుల్ సౌండ్ తో ఈ పాటని రూపొందించారు. ఈ పాటపై అభిమానులు పెట్టుకున్న అంచనాలు తగ్గకుండా సాంగ్ రిలీజ్ చేశారు.జూన్ 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Samantha : సమంత సక్సెస్ కి చెక్ పెట్టిన డిజిటల్ పార్టనర్.. ఎందుకో తెలుసా!?