Anchor Suma: తెలుగులో మెస్ట్ వాంటెడ్ యాంకర్ ఎవరు అనగానే ముందుగా గుర్తొచ్చేది ఎవరు అంటే సుమ. తన పేరుకు యాంకర్ అనే ట్యాగ్‌ను యాడ్ చేసుకుని అందరి ఇళ్లల్లో తను కూడా ఒక వ్యక్తిగా యాడ్ అయిపోయింది. ఎప్పుడూ బుల్లితెర షోలతో, ఈవెంట్స్‌తో బిజీగా ఉండే సుమ చారిటీ విషయంలో కూడా ఎప్పుడూ ముందుంటుంది. తను వాఘ్ బక్రీ టీ గ్రూప్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కూడా పనిచేస్తోంది. తాజాగా వాఘ్ బక్రీ టీ గ్రూప్ సంస్థ వాఘ్ బక్రీ ఫౌండేషన్‌తో చేతులు కలిపి అక్షయ పాత్ర ఫౌండేషన్ అనే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించిన ఎన్‌జీఓకు 9 ఫుడ్ డెలివరీ వాహనాలను డొనేట్ చేసింది. దీంతో సుమ చేసిన పనిని తన ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
అంగన్‌వాడీ పిల్లల కోసం
ఇప్పటికే వాఘ్ బక్రీ టీ గ్రూప్ అనే సంస్థ ఎన్నో చారిటీ కార్యక్రమాల్లో పాల్గొంది. దాని బ్రాండ్ అంబాసిడర్‌గా సుమ కూడా ఎన్నో చారిటీలు చేసింది. ఇప్పుడు హైదరాబాద్, నెల్లూరు ప్రాంతాల్లో ఉన్న దాదాపు 205కు పైగా అంగన్‌వాడీల్లో ఉన్న 10,500 మందికి పైగా స్టూడెంట్స్‌కు న్యూట్రీషన్ ఉన్న ఆహారాన్ని అందించడమే తాజాగా చేసిన డొనేషన్ లక్ష్యం అని తెలుస్తోంది. ఈ స్పెషల్ ఫుడ్ డెలివరీ వాహనాలు హైదరాబాద్‌లో మంగళవారం ప్రారంభం కాగా.. నెల్లూరులో గురువారం ప్రారంభమయ్యింది. ఇవి పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నాయి. ఆహారం కడుపు నిండా ఉంటేనే చదువులో కూడా వారు ముందుంటారని ఈ సంస్థ నమ్ముతోంది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు
వాఘ్ బక్రీ ఫౌండేషన్ ఎన్నో ఏళ్లుగా అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో చేతులు కలిపి ఎన్నో చారిటీ కార్యక్రమాలు చేసింది. 2021 నుండి ఏ క్లాస్‌రూమ్‌లో పిల్లలు కూడా ఆకలితో ఉండకూడదు అనేదే లక్ష్యంగా పెట్టుకుంది. తాజాగా డొనేట్ చేసిన 9 వాహనాలతో కలిపి మొత్తంగా 32 వాహనాలు ఈ ఫుడ్ డెలివరీ కోసం దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే కాదు.. గుజరాత్, రాజస్థాన్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కూడా ఈ ఫుడ్ డెలివరీ వాహనాలు నడుస్తున్నాయి. ఈ విషయంలో వాఘ్ బక్రీ టీ గ్రూప్ సంస్థ ఓనర్ అయిన సంజయ్ సింగాల్ సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: ఆఫర్లు లేక అందుకు సై అన్న ఇస్మార్ట్ బ్యూటీ.. ఫస్ట్ ఛాన్స్ అతనికే.?
సేవలను అభినందిస్తున్నాను
వాఘ్ బక్రీ టీ గ్రూప్ తీసుకున్న నిర్ణయాన్ని సుమ కనకాల సైతం ప్రశంసించారు. ‘‘వాఘ్ బక్రీతో అసోసియేట్ అవ్వడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఇది సమాజానికి క్వాలిటీ టీను అందించడంతో పాటు ఇంకా ఎన్నో విధాలుగా సహాయపడుతోంది. అక్షయ్ పాత్ర ఫౌండేషన్‌కు వారి అందించిన సాయం ప్రశంసనీయం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వారు తీసుకొస్తున్న మార్పులను నేను అభినందిస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు సుమ. అక్షయ్ పాత్ర ఫౌండేషన్ అనేది పీఎం పోషన్ స్కీమ్‌లో భాగంగా పిల్లలకు మంచి ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే 16 రాష్ట్రాల్లోని 78 లొకేషన్స్‌లో 22 లక్షల మందికిపైగా పిల్లలకు వీరి ఆహారం చేరుతుంది.