Big Tv Kissik Talks: బిగ్ టీవీ తాజాగా కిస్సిక్ టాక్స్ అనే కొత్త పోడ్కాస్ట్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీనికి జబర్దస్త్ వర్ష హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించి రెండు ఎపిసోడ్స్ విడుదలయ్యయి. ఇక కిస్సిక్ టాక్స్‌కు తరువాతి గెస్ట్‌గా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ అషు రెడ్డి రానుంది. వర్షతో కలిసి అషు రెడ్డి చేసిన అల్లరికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.
వైజాగ్ అమ్మాయిని
ప్రోమో మొదలవ్వగానే కిస్సిక్ టాక్స్‌కు ఇకపై వర్ష కాకుండా తనే యాంకర్ అని ప్రకటించింది అషు రెడ్డి. దీంతో వర్షకు ఏం చెప్పాలో తెలియక నవ్వింది. తన సొంతూరు ఏది అని అడగగా వైజాగ్ అని చెప్పింది అషు. వైజాగ్‌లో తన ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడగగా పెద్ద లిస్టే చెప్పింది. తను అందంగా ఉందని వర్ష ప్రశంసించగానే తను అందంగా ఉందని చెప్పిన మొదటి వ్యక్తి వర్షనే అని స్టేట్‌మెంట్ ఇచ్చింది అషు. తనకు వైజాగ్‌లో ఆర్కే బీచ్ అంటే ఫేవరెట్ అని తెలిపింది. తన బ్యాంక్ బ్యాలెన్స్ గురించి మాట్లాడుతూ ప్రస్తుతం అందులో రూ.41 వేలు ఉన్నాయని, నమ్మకపోతే చూపిస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చింది అషు రెడ్డి. కమెడియన్ హరితో తనకు ఎలాంటి రిలేషన్ లేదని, కేవలం స్క్రీన్ వరకే అని క్లారిటీ ఇచ్చేసింది.
శివుడిపై భక్తి
తన క్రష్ ఎవరు అని అడగగా.. ‘‘నా క్రష్, నేను ఊహించుకునే నా డ్రీమ్ బాయ్ అన్నీ పవన్ కళ్యాణే. నిజానికి ఆయన ఒక పొలిటీషియన్ కాదు. ఆయన ఒక లీడర్’’ అంటూ తన ఫేవరెట్ హీరోపై ప్రశంసలు కురిపించింది అషు రెడ్డి. ఈమధ్యకాలంలో అషు రెడ్డి (Ashu Reddy) సోషల్ మీడియా చూస్తుంటే తను ఎక్కువగా ఫారిన్ ట్రిప్స్‌కు వెళ్తుందని అర్థమవుతోంది. దీనిపై కూడా తను స్పందించింది. తన దగ్గర ఉన్న కాస్ట్‌లీ హ్యాండ్ బ్యాగ్ ధర రూ.2 లక్షలు అని బయటపెట్టింది. తనకు ఇష్టమైన దేవుడు ఎవరు అని అడగగా.. అరుణాచల శివ పేరు చెప్పింది. అంతే కాకుండా శివుడిపై తనకు ఉన్న భక్తిని మాటల్లో చెప్పుకొచ్చింది. దీంతో అషులో ఇంత పెద్ద భక్తురాలు ఉందా అని ప్రేక్షకులు ఫీలవుతున్నారు. తన జీవితం అరుణాచలం వెళ్లొచ్చిన తర్వాత చాలా మారిపోయిందని స్టేట్‌మెంట్ ఇచ్చింది.
Also Read: ఇన్ని కష్టాలు పడ్డారా.. కన్నీళ్లు పెట్టిస్తున్న బలగం నటుడి జీవితం..
తప్పు చేశాను
బిగ్ బాస్‌కు వెళ్లడం వల్ల తనకు బుద్ధి వచ్చిందని స్టేట్‌మెంట్ ఇచ్చింది అషు. తనకు బిగ్ బాస్‌లో ఫేవరెట్ కంటెస్టెంట్ రాహుల్ అని చెప్తూ సిగ్గుపడింది. రాహుల్ కోసం ‘రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే’ పాటను డెడికేట్ చేసింది. త్వరలో గుడ్ న్యూస్‌తో వస్తున్నాం కాబట్టి ఈ పాటను డెడికేట్ చేస్తున్నానని చెప్పింది. తర్వాత ఏం జరుగుతుంది అని ఆలోచించకుండా ఒక ఇంటర్వ్యూ చేయడం తన జీవితంలో తను చేసిన పెద్ద తప్పు అని చెప్పుకొచ్చింది. ఆ ఇంటర్వ్యూ తర్వాత ఆర్జీవీతో తను ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపింది. ఈ ఎపిసోడ్‌లో అషు రెడ్డి మాత్రమే కాదు.. వర్ష కూడా తన జీవితంలో జరిగిన చేదు అనుభవాల గురించి చెప్తూ ఎమోషనల్ అయినట్టు ప్రోమోలో చూపించారు.