L2 Empuraan: మళయాళం ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమాల్లో లూసీఫర్ కూడా ఒకటి. మోహన్ లాల్ (Mohanlal) హీరోగా 2019లో పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా.. 125 కోట్లకు పైగా కలెక్షన్స్ కొల్లగొట్టింది. తెలుగులో ఈ సినిమాను మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ పేరుతో రీమేక్ చేశారు. కానీ ఇక్కడ అనుకున్నంత స్థాయిలో అలరించలేకపోయింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన L2: ఎంపురాన్ (L2: Empuraan) మార్చి 27న రిలీజ్‌కు రెడీ అవుతోంది. తెలుగులోను ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడం, మరియు హిందీ భాషలలో కూడా విడుదలవుతుంది. ఇది మలయాళ సినిమా చరిత్రలో మొట్టమొదటి IMAX ఫార్మాట్‌లో విడుదలయ్యే చిత్రంగా నిలుస్తుంది. కానీ ఓటిటి డీల్ ఇంకా పూర్తి కాలేదు.
Also Read: ‘రాబిన్‌హుడ్’ రికార్డ్ బిజినెస్.. నితిన్ ముందు భారీ టార్గెట్!
ఓటీటీ కోసం భారీ డిమాండ్
ఈ మధ్య కాలంలో ఓటిటి డీల్ జరగకుండా సినిమాలు రిలీజ్ కావడం లేదు. తెలుగులో పెద్ద పెద్ద సినిమాలు సెట్స్ పైకి వెళ్లగానే ఓటిటి డీల్ సెట్ చేసుకుంటున్నాయి. అప్పటికీ కుదరకపోతే.. టీజర్ రిలీజ్ చేసి మార్కెట్ చేసుకుంటున్నారు మేకర్స్. కానీ ఎంపురాన్ సినిమా ఓటిటి వ్యవహారం వేరేలా ఉంది. మళయాళంలో ఈ సినిమా క్రేజ్ నెక్స్ట్ లెవల్‌లో ఉంది. రేపే ఈ సినిమా రిలీజ్ అవుతుండగా.. ఇంకా ఓటిటి డీల్ జరగలేదు. దానికి కారణం మేకర్స్ భారీగా డిమాండ్ చేయడమేనని సమాచారం. ఈ మూవీని దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అందులో 80 కోట్ల వరకు రెమ్యునరేషన్స్ అని తెలిసింది. అంటే..
20 కోట్లతో ఈ సినిమాను తెరకెక్కించారు. అదే.. తెలుగు సినిమాలను తీసుకుంటే.. దీనికి రివర్స్‌లో బడ్జెట్స్ ఉంటాయి. అయితే.. ఈ సినిమాకున్న క్రేజ్‌కు థియేట్రికల్ రన్ నుంచి చాలా ఎక్కువ కలెక్షన్లను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.ఇది మలయాళంలోనే హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ అవుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే ఓటీటీ రైట్స్ కోసం భారీగా డిమాండ్ చేస్తున్నారట. ప్రస్తుతానికి జియో హాట్ స్టార్ (JioHotstar) ఓటీటీ రైట్స్ కోసం గట్టిగా ట్రై చేస్తుందట. ఇంకా లెక్క తేలడం లేదట. కానీ మలయాళం ఇండస్ట్రీలోనే హైయెస్ట్ ధరకు ఈ మూవీ ఓటీటీ రైట్స్ సేల్ అయ్యే ఛాన్స్ ఉంది.
Also Read: ఆటకు ‘పెద్ది’ సిద్ధం.. కానీ రెహమాన్ దెబ్బ?
అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్!
దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత వస్తున్న కూడా లూసీఫర్(Lucifer) సీక్వెల్‌కు ఫుల్ డిమాండ్ ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఎల్2 ఎంపురాన్’ప్రమోషనల్ కంటెట్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. దీంతో.. అడ్వాన్స్ బుకింగ్స్‌లో జోరు చూపిస్తోంది ఎంపురాన్. ప్రీ సేల్స్‌లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా రాబట్టినట్టుగా అంచనా వేస్తున్నారు. దీంతో.. ఎంపురాన్ వరల్డ్ వైడ్‌గా భారీ ఓపెనింగ్ డే కలెక్ట్ చేసే అవకాశం ఉంది. మలయాళ సినిమాలలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసేలా ఉంది. మోహన్ లాల్ కెరీర్లోనే హెయెస్ట్ ఓపెనింగ్ మూవీగా నిలవబోతోంది.మరి
విడుదలకు ముందే ఇన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న ఎంపురాన్.. రిలీజ్ తర్వాత ఇంకెన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుందో చూడాలి.