Anil Ravipudi: ఏ ప్రోడక్ట్ ప్రజలలోకి వెళ్ళాలి అన్నా ప్రమోషన్ అనేది చాలా ముఖ్యం. ఎంత కష్టపడి ప్రోడక్ట్ ను తయారుచేశారు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఆ ప్రోడక్ట్ ను బయట జనాలకు తెలిసేలా ఎలా ప్రమోట్ చేసాం అన్నది ఇంపార్టెంట్. ఇక ఈ కాలంలో ప్రమోషన్స్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం. సినిమాల విషయానికొస్తే ప్రమోషన్స్ మాత్రమే ఎక్కువ చేయాలి. ప్రస్తుతం మేకర్స్.. సినిమాకు ఎంత ఖర్చు పెట్టాం అన్నది చూడడం లేదు. ప్రమోషన్స్ కోసం ఎంత ఖర్చు పెట్టామన్నది చూస్తున్నారు. ఈ కాలంలో ఎంత డిఫరెంట్ గా ప్రమోషన్స్ చేస్తే అంత ఎక్కువగా సక్సెస్ ను అందుకుంటున్నారు.
ఇక ఇండస్ట్రీలో ప్రమోషన్స్ అందు రాజమౌళి ప్రమోషన్స్ వేరు అని చెప్పుకొస్తారు. ఇండియా మొత్తం తిరిగి అయినా కూడా జక్కన్న చేసే హడావిడి అంతా ఇంతా కాదు. మీడియాలో ఎక్కడ చూసినా కూడా వారే ఉంటారు. ఇక రాజమౌళి తరువాత అంతటి హడావిడి అనిల్ రావిపూడి మాత్రమే చేస్తున్నాడు. ఆయన సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన దగ్గర నుంచి సినిమా రిలీజ్ అయ్యేవరకు సోషల్ మీడియాలో ఒకటే మ్యూజిక్.
Rashmika Mandanna: తెలుగు హీరోతో రష్మిక పెళ్లి.. నిర్మాత ఓపెన్ అయ్యిపోయాడుగా
ఇవన్నీ పక్కన పెడితే.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సంక్రాంతి కానుకగా జనవరి 14 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. నిత్యం ఏదో ఒక కొత్త కాన్సప్ట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ఇప్పటికే ఒక్కో సాంగ్ రిలీజ్ చేయడానికి ఒక్కో రకమైన కాన్సెప్ట్ ను వెతికి మరీ అనిల్ రావిపూడి ప్రేక్షకులకు హైప్ తీసుకొస్తున్నాడు. స్టేజ్ పై క్రికెట్ ఆడడం, సెట్ లో సాంగ్స్, డ్యాన్స్. కు సంబంధించిన వీడియోలను వదలడం, ఏ షో వదలకుండా గెస్టులుగా వెళ్లడం చేస్తూనే ఉన్నారు.
ఇక తాజాగా.. అనిల్ కొత్త కాన్సెప్ట్ తో వచ్చేశాడు. సినిమాలో నటించినవారందరూ కూర్చొని ఇంటర్వ్యూ చేయడం కామన్ అనుకున్నాడో ఏమో.. అనిల్ ఈసారి.. వెంకీ నటించిన ఐకానిక్ క్యారెక్టర్స్ గెటప్స్ లో హీరోయిన్స్ ని రెడీ చేయడమే కాకుండా నిర్మాత దిల్ రాజును కూడా అందులోకి దింపాడు.
Game Changer : వార్నీ… ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ లేట్ అవ్వడానికి ఇదా కారణం?
బొబ్బిలిరాజా గెటప్ ను మీనాక్షీ వేయగా.. చంటి గెటప్ లో ఐశ్వర్య కనిపించింది. ఇక ఘర్షణలో డీసీపీ రామచంద్రగా దిల్ రాజు కనిపించగా.. జయం మనదేరా సినిమాలో పెద్ద వెంకటేష్ లా అనిల్ కనిపించి కనువిందు చేశాడు.అందులోని హిట్ సాంగ్స్ కు చిందేస్తూ అలరించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వీడియోలు చూసిన అభిమానులు షాక్ అవుతున్నారు.
అయ్యా.. అయ్యా దేన్నీ వదలడం లేదుగా.. అన్ని వాడేసున్నావ్ గా.. ఏం వాడకం అయ్యా బాబు అంటూ అనిల్ క్రియేటివిటీకి సలామ్ చేస్తున్నారు. మరి ఈ ప్రమోషన్స్ వలన సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
Ayyo Ayyo Ayayyoooo 😄
Presenting @Meenakshiioffl as RAJA from #BobbiliRaja 😍
Stay tuned for the next one and keep guessing 😉#SankranthikiVasthunam GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025. pic.twitter.com/btrn9IedG6
— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024
ఘర్షణ.. ఘర్షణ.. ఘర్షణ.. 🔥
Presenting #DilRaju garu as DCP Ramachandra from #Gharshana 💥
Stay tuned for VENKY MAMAs tho #SankranthikiVasthunam 🥳
It's going to be a full fun blast for you all this NEW YEAR❤️ pic.twitter.com/KLVPYkvg7r
— Sri Venkateswara Creations (@SVC_official) December 31, 2024