BigTV English

Animal Movie Review : అంచనాలను మించి .. బాక్సాఫీస్ వద్ద యానిమల్ గర్జన ..

Animal Movie Review : అంచనాలను మించి .. బాక్సాఫీస్ వద్ద యానిమల్ గర్జన ..
Animal Movie Review

Animal Movie Review : సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో.. రణబీర్ కపూర్, రష్మీక కాంబోలో తరకెక్కిన యానిమల్ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదల అయింది. పేరుకు ఇది హిందీ మూవీ.. కానీ స్ట్రైట్ తెలుగు మూవీ కి ఉన్నంత క్రేజ్ ఈ మూవీపై క్రియేట్ అయింది. సందీప్ రెడ్డి వంగా బ్రాండ్ వ్యాల్యూ యాడ్ అవ్వడంతో మార్కెట్లో ఈ మూవీకి మంచి బజ్ ఉంది.ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి హైప్ విపరీతంగా పెంచిన ఈ చిత్రం.. ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..


మూవీ: యానిమల్

డైరక్టర్: సందీప్ రెడ్డి వంగా


యాక్టర్స్: రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్

               రష్మిక మందన్న, త్రిప్తి డిమ్రి

సినిమాటోగ్రఫీ: అమిత్ రాయ్

నిర్మాతలు : భూషణ్ కుమార్, కృష్ణ కుమార్, మురాద్ ఖేతాని, ప్రణయ్ రెడ్డి వంగ

విడుదల తేదీ: డిసెంబర్ 1,2023

కథ:

రణవిజయ్ సింగ్ (రణబీర్ కపూర్) హై రిచ్ క్లాస్ కి చెందిన ఒక కుర్రవాడు. అతని తండ్రి బల్బీర్ సింగ్ (అనిల్ కపూర్) ఒక పెద్ద వ్యాపారవేత్త. కొడుకుకి ఆస్తి, హోదా అన్ని అందించిన తండ్రి అతనికి టైం మాత్రం కేటాయించలేక పోతాడు. దీంతో మొదటి నుంచి రణవిజయ్ కు తండ్రి ప్రేమ పూర్తిగా ఎప్పుడూ దక్కలేదు అన్న వెలితి ఏర్పడుతుంది. తండ్రి తనని పట్టించుకోవాలని ..తన గురించి గొప్పగా చెప్పాలని.. తనని గుర్తించాలని ..దగ్గరకు తీసుకొని ప్రేమ చూపించాలని ..ఆత్రుతతో తండ్రికి నచ్చిన పనులు చేయాలి అని రణవిజయ్ ప్రయత్నిస్తుంటాడు. ఇలా చేసే క్రమంలో కొన్నిసార్లు అతను చేసే తప్పిదాల వల్ల తండ్రికి మరింత కోపం తెప్పిస్తూ ఉంటాడు.

రన్ విజయ్ ఫైనల్ గా తన ఫ్రెండ్ కార్తీక్ కు ఫ్రెండ్ అయినా గీతాంజలి (రష్మిక మందన్న) ని ఇష్టపడతాడు. వీళ్ళ లైఫ్ పై కూడా రణవిజయ్ కి తన తండ్రి మీద ఉన్న పిచ్చి ప్రేమ కారణంగా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో హ్యాపీగా ఉంటుంటారు. సడన్ గా ఒక రోజు బల్బీర్ సింగ్ బై దాడి జరుగుతుంది. అసలు అతనిపై దాడి ఎందుకు జరిగింది? ఎవరు చేయించారు? తండ్రి కొడుకుల మధ్య గొడవ ఎప్పటికీ సమసిపోయింది? తండ్రి కోసం కొడుకు ఎంత దూరం వరకు వెళ్ళాడు? సినిమాలో చూపించిన ఇంత వైలెన్స్ కి అసలు కారణం ఏమిటి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వెంటనే మూవీ చూసేయండి.

విశ్లేషణ:

యానిమల్ మూవీ ఒక కంప్లీట్ రివేంజ్ గ్యాంగ్స్టర్ డ్రామా.. తండ్రి కోసం రంగంలోకి దిగిన కొడుకు ప్రత్యర్థులకు తనలోని యానిమల్ ని పరిచయం చేస్తాడు. ఇక ఈ మూవీ స్టార్టింగ్ నుంచి వచ్చే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఎంతో ఆసక్తిగా ఉన్నాయి. ముఖ్యంగా రణబీర్ కపూర్ ఎంట్రీ ప్రేక్షకులకు మాంచి ఐ ఫీస్ట్. ఒకపక్క ఫ్యామిలీ మెన్ గా.. మరోపక్క గ్యాంగ్ స్టర్ గా రణబీర్ అద్భుతమైన నటన కనబరిచాడు.

ఇది ఓన్లీ యాక్షన్ మూవీ కాదు..ఇందులో తండ్రి కొడుకులు..భార్య భర్తల మధ్య లోతైన ఎమోషన్ సీన్స్ గుండెకు హత్తుకునే విధంగా ఉన్నాయి. బీభత్సమైన వైలెన్స్ మధ్య హార్ట్ టచింగ్ ఫ్యామిలీ సెంటిమెంట్ అద్భుతంగా ఆవిష్కరించడంలో సందీప్ రెడ్డి తన ప్రతిభ కనబరిచాడు. స్కూల్ పిల్లాడి దగ్గర నుంచి కాలేజ్ బాయ్ వరకు.. ప్రేమ, పెళ్లి దగ్గర నుంచి గ్యాంగ్ స్టర్ అవ్వడం వరకు.. హీరో జీవితానికి సంబంధించిన అన్ని దశలను ఎంతో అద్భుతంగా చూపించారు. మొదట్లో మూడున్నర సినిమా అంటే.. బోర్ కొడుతుందని అందరూ అనుకున్నారు కానీ ఎక్కడ బోర్ అనేది లేకుండా ప్రతి నిమిషం ఆస్వాదించే విధంగా ఈ మూవీని  సందీప్ రెడ్డి తెరకెక్కించాడు.

ఓపెనింగ్ సీన్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్ పడే వరకు.. ఆడియన్స్ కంప్లీట్ యాక్టివ్ గా ఉంటారు. అలా ఉంది మూవీ.ఈ మూవీలో తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఎమోషన్ సినిమాకే స్ట్రాంగ్ పిల్లర్ లాంటిది. తండ్రి అంటే విపరీతమైన ఇష్టం పెంచుకున్న కొడుకు సైకో మాదిరిగా బిహేవ్ చేయడం.. అది చూసి తట్టుకోలేక తండ్రి ఆవేదన వ్యక్తం చేయడం.. చిన్నతనం నుంచి తండ్రి పిల్లల పట్ల శ్రద్ధ తీసుకోకపోతే పెద్దయ్యాక వాళ్ళు ఎలా తయారవుతారు అనే విషయాన్ని చాలా ఇన్నోవేటివ్ గా సందీప్ డీప్ మీనింగ్ తో తెరకెక్కించాడు. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎమోషన్ ని కరెక్ట్ గా జస్టిఫై చేస్తూ అద్భుతంగా ఈ చిత్రం ముందుకు సాగుతుంది. ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగా అంటే అర్జున్ రెడ్డి లేదా కబీర్ సింగ్ ఇంపాక్ట్ కనిపించేది కానీ ఈ మూవీతో అతను తనకంటూ సరికొత్త బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.

ప్లస్ పాయింట్స్:

రణబీర్ కపూర్, అనీల్ కపూర్ యాక్టింగ్ ఈ మూవీ కి ప్లస్ పాయింట్స్.

తండ్రి కొడుకుల మధ్య ఎమోషన్స్ సీన్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

యాక్షన్ ఎపిసోడ్స్ గూస్ బంప్స్ కలిగించేలా ఉన్నాయి.

మూవీ లో ఫస్ట్ 15 నిమషాలు మొత్తం మూవీ పై ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.

మైనస్ పాయింట్స్:

సినిమా కాస్త లెంతీగా ఉంది.

మధ్యలో కొన్ని సీన్స్ ఎమోషన్ మరీ ట్రాజెడీగా ఉంటుంది.

చివరి మాట:

భారీ యాక్షన్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా మూవీగా యానిమల్ ను వర్ణించవచ్చు. ఈ మూవీని అస్సలు మిస్ కాకండి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×