BigTV English

Akhanda 2 : ‘అఖండ 2’ కోసం స్పెషల్ గెస్ట్.. బోయపాటి ప్లాన్ తో థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Akhanda 2 : ‘అఖండ 2’ కోసం స్పెషల్ గెస్ట్.. బోయపాటి ప్లాన్ తో థియేటర్లు చిరిగిపోవాల్సిందే..

Akhanda 2 : నందమూరి నటసింహం బాలయ్య ఈమధ్య వరుసగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. గత కొన్నిర్లుగా ఆయన సినిమాలు భారీ విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి.. ఈ ఏడాది డాకు మహారాజు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీ యావరేజ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్స్ పరంగా హిట్ అయింది. ప్రస్తుతం టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో అఖండ 2 సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఈ సినిమాను రిలీజ్ చేస్తామని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. అందుకే సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రమోషన్స్ ని మొదలుపెట్టే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమా గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో అనుకొని అతిధి ఎంట్రీ పోతున్నాడు అంటూ వార్త ప్రచారంలో ఉంది. మరి ఆ స్పెషల్ గెస్ట్ ఎవరు? ఏ పాత్రలో నటిస్తున్నాడో?ఇప్పుడు మనం తెలుసుకుందాం..


‘అఖండ 2’ షూటింగ్ అప్డేట్..

నందమూరి బాలయ్య, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో గతంలో వచ్చిన అఖండ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా రాబోతున్న విషయం అందరికీ తెలుసు.. ఆ మూవీలో బాలకృష్ణ అఘోర పాత్రలో నటించాడు. అప్పట్లో ఈ మూవీ హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు రాబోతున్న అఖండ 2 తాండవం మీద ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. బిజినెస్ ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. నిర్మాతలు తొందరపడకుండా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. ఇప్పటిదాకా నలభై శాతానికి పైగానే పూర్తయినట్టు ఇన్ సైడ్ టాక్.. మరో నెలలో సినిమా షూటింగ్ ను పూర్తి చేసి మిగిలిన పనులను చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది. 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఇప్పుడు మరో నటుడు గెస్ట్ పాత్రలో నటించబోతున్నాడు అంటూ ఓ వార్త ఫిలింనగర్ చక్కర్లు కొడుతుంది..


Also Read:బుల్లితెరపై యాంకర్ అవ్వాలంటే.. కమిట్మెంట్ ఇవ్వాలా? బయటపడుతున్న నిజాలు..

అఘోరగా మరో నటుడు.. 

గతంలో వచ్చిన అఖండ మూవీతో పోలిస్తే ఈ మూవీలో చాలామంది సీనియర్ నటులు నటిస్తున్నారు అన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే పలువురిని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఇందులో బాలకృష్ణకు గురువుగా మురళీమోహన్ మరో అఘోరీగా కనిపించబోతున్నారని తెలిసిందే. ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖ నటుడు బాబీ డియోల్ కూడా ఇందులో ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారని తాజా సమాచారం. అధికారికంగా ప్రకటించలేదు కానీ ఆయన ఎంట్రీ జార్జియాలోనే ఉంటుందని వినికిడి. అఘోరాగా కనిపించే బాలయ్యతో ఆయన కలయికలో ఎలాంటి ఎపిసోడ్ ఉంటుందో ఊహించుకోవడం కష్టమే. తనకి బోయపాటి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాలని గట్టిగానే ప్లాన్ చేస్తున్నాడు. సంయుక్త మీనన్, ఆదిపినిశెట్టి తదితరులు కీలకపాత్రలో నటిస్తున్నారు. త్వరలోనే మూవీ గురించి ఓ అప్డేట్ రానుందని సమాచారం..

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×