BigTV English

Anushka Shetty: ఒక వేశ్య.. ఇంత బ్రూటల్ గా హత్యలు చేస్తుందా..?

Anushka Shetty: ఒక వేశ్య.. ఇంత బ్రూటల్ గా హత్యలు చేస్తుందా..?

Anushka Shetty:  ఒక సాధారణ యోగ టీచర్.. అందం మాత్రమే ఆమె దగ్గర ఉంది. నటనలో కోచింగ్ తీసుకున్నది లేదు. షూటింగ్ అంటే తెలియదు. ఆడిషన్ అంటే ఏంటో తెలియదు. ఒకరోజు డైరెక్టర్ పూరి జగన్నాథ్ ను కలిసింది. సినిమాలో నటిస్తావా.. ? అంటే  ఓకే అంది. అలా సూపర్ సినిమాలో శాషాగా ఇండస్ట్రీకి పరిచయమైంది. అప్పుడు ఆమెను చూసిన వారెవ్వరికి తెలియదు.. కొన్నేళ్లు పోతే ఈమెనే టాలీవుడ్ కు లేడీ సూపర్ స్టార్ కానుందని.  ఒకే ఒక్క సినిమా.. ఆమె జీవితాన్ని మార్చేసింది. ఇంత ఇంట్రడక్షన్ ఇచ్చాక కూడా ఆమె ఎవరో తెలియదు అంటే.. అసలు మీరు టాలీవుడ్ అభిమానినే అయ్యి ఉండరు.


ఇక ఆ అందం ఎవరో కాదు. అనుష్క శెట్టి.  అరుంధతి సినిమాతో అనుష్క  జీవితం మారిపోయింది. స్వీటీ.. ఇండస్ట్రీలో గ్లామర్ పాత్రలకే అంకితమవ్వాలని అనుకోలేదు. అరుంధతి లాంటి సినిమా  తరువాత  ఆమె బిల్లాలో నటించింది.  అరుంధతిలో జేజమ్మగా నటించడం ఒక అదృష్టం.ఆ సినిమా తరువాత ఎవరైనా కథలను ఆచితూచి ఎంచుకుంటారు. అలాంటి పాత్రలనే అందుకుంటారు. కానీ, స్వీటీ అలాంటి పాత్రలకే  అంకితమవ్వాలని అనుకోలేదు. ఈ సినిమా తరువాత బిల్లాలో బికినీతో కనిపించి షాక్ ఇచ్చింది. నిజం చెప్పాలంటే.. ఏ హీరోయిన్ కూడా దీనికి ఒప్పుకోదు. ఎందుకంటే కొంచెం అటుఇటు అయినా కెరీర్ మొత్తం పోతుంది.కానీ స్వీటీ చేసింది.  అది కేవలం అనుష్క గట్స్ అని చెప్పాలి.

Virinchi Varma: నాని చెప్పడం వలన రాజమౌళితో యాక్టింగ్ చేయించాను.


ఇక స్వీటీ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ లలో సరోజ పాత్ర ఒకటి. స్టార్ హీరోయిన్ గా  కొనసాగుతున్న సమయంలో ఒక వేశ్య పాత్రలో నటించాలి అంటే చచ్చినా ఏ హీరోయిన్ ఒప్పుకోదు.  మరోసారి అనుష్క తన గట్స్ చూపించింది. నేను చేస్తా అని చెప్పి .. వేదంలో సరోజ పాత్రలో  మెప్పించింది. క్రిష్ జాగర్లమూడి కలం నుంచి జాలువారిన మంచి పాత్రల్లో సరోజ ఒకటి. ఆ పాత్రకు అనుష్కను ఆయన సెలెక్ట్ చేయడమే క్రిష్ చేసిన మంచి పని.

వేశ్య అంటే.. నలుగురితో బెడ్ పై రొమాన్స్ చేస్తూ.. ఎబెట్టుగా అందాలను ఆరబోయడం లాంటివి చూపించలేదు. వేశ్యగా ఉన్నా.. వారి గౌరవాన్ని కాపాడుకోవడం చూపించాడు. తమకంటూ ఒక గుర్తింపు ఉండాలని ఆరాటపడే ఒక అమ్మాయి మనోగతాన్ని చూపించాడు. ఇక ఆ పాత్రలో అనుష్క ఒదిగిపోయింది. ఆమె  అందం.. వర్ణించడం చాలా కష్టం.  అలా టాలీవుడ్ లో ఎంతోమంది హీరోయిన్స్ ఇలా వేశ్యలగా నటించారు. అందులో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది సరోజ.

Pic Talk: మాల్దీవ్స్ లో చిరు, మహేష్, నాగ్, రామ్ చరణ్ పార్టీ.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న ఫోటో

ఇక కెజిఎఫ్  లో  యష్ చెప్పిన డైలాగ్ .. ” ఎవడ్రా  జనాలను కొట్టి డాన్ అయ్యాను అన్నది. నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే” గుర్తుందా. అది అనుష్క విషయంలో మార్చాలంటే.. ఆమె ప్రత్యేకమైన సినిమాలు చేసి లేడీ సూపర్ స్టార్ అవ్వలేదు.. ఆమె చేసిన ప్రతి సినిమా ప్రత్యేకమే. అరుంధతి, బాహుబలి, భాగమతి, వేదం, మిర్చి, సైజ్ జీరో.. ఇలా చెప్పుకుంటూ పోవచ్చు. ఇక ఇప్పుడు ఈ లిస్ట్ లో ఇంకో సిరీస్ చేరనుంది.

వేదం లాంటి ఒక మంచి సినిమాతో అనుష్కకు కెరీర్ బెస్ట్ ఇచ్చిన డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో స్వీటీ నటిస్తున్న తాజా సిరీస్ ఘాటీ.  అమెజాన్ ఒరిజినల్స్ గా తెరకెక్కుతున్న ఈ సిరీస్  లో స్వీటీ మరోసారి వేశ్యగా నటిస్తోంది. నేడు స్వీటీ పుట్టినరోజును పురస్కరించుకొని.. ఘాటీ నుంచి ఒక స్పెషల్ గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. మునుపెన్నడూ చూడని అనుష్కను ప్రేక్షకులు ఈ గ్లింప్స్ లో చూశారు.  ప్రశాంతంగా ఉన్న రోడ్డుపై వస్తున్న ఒక బస్సు.. సడెన్ గా అందులో నుంచి జనాలు బయటకు పరిగెత్తడం మొదలుపెట్టారు. బస్సులో ఒకడి తలను పట్టుకొని.. ఎంతో కర్కశంగా పీకను కత్తితో కోస్తూ కనిపించింది స్వీటీ. అంతేనా.. ఆ తెగిన తలను చేత్తో పట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే.. చూసేవారికి ఒళ్లు గగుర్పుడవడం ఖాయమే.

త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్.. ఆయన రాసినవాటిలో బెస్ట్ డైలాగ్స్ ఇవే..

ఇక ఘాటీ గ్లింప్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఒక వేశ్య.. ఇంత బ్రూటల్ గా హత్యలు చేస్తుందా..? అంటే.. ఆమె జీవితంలో ఎంత బాధ ఉంటే  ఇంతలా చేస్తుంది. దేనికోసం ఇదంతా ఒక వేశ్య చేస్తుంది.. ? అనే అనుమానాన్ని ఈ గ్లింప్స్ ద్వారా ప్రేక్షకులలో కలిగించారు. ఇక అనుష్క మరణ మాస్ అవతార్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. సలార్ లో ప్రభాస్.. ప్రజలను కాపాడడానికి కాటేరమ్మ కొడుకుగా మారితే.. ఘాటీ తనను నమ్ముకున్నవారి కోసం అనుష్క కాటేరమ్మ కూతురుగా మారిందని ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు.

Kamal Haasan: 70 ఏళ్ల వయస్సులో కూడా ఆ ఫిట్ నెస్ ఏంటి మావా.. నెక్ట్స్ లెవెల్ అంతే

ఇక మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి సినిమాలో స్వీటీ ముఖాన్ని  AIలో తగ్గించి చూపించారు. కానీ, క్రిష్ ఆ తప్పు చేయలేదని తెలుస్తోంది. స్వీటీ ముఖం చాలా ఒరిజినల్ గా కనిపించింది. ముఖం బొద్దుగానే ఉన్నా ఎంతో అందంగా కనిపించింది. సడెన్ గా చూసి మా స్వీటీనీ ఏంట్రా ఇలా చేసేశారు అని అనుకున్నా.. ఆమె నటనను చూసి షేక్ అవ్వడానికి సిద్ధంగా ఉండండి అని నెటిజన్స్ కామెంట్స్  పెడుతున్నారు. మరి ఈ సిరీస్ తో అనుష్క శెట్టి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×