Virinchi Varma: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న యంగ్ డైరెక్టర్స్ లో విరించి వర్మ ఒకరు. ఉయ్యాల జంపాల సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు విరించి వర్మ. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. అప్పటికే షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు సాధించుకున్న రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల సినిమాతో హీరో ఒక పరిచయం అయ్యాడు. ఒక విలేజ్ లవ్ స్టోరీని చాలా అందంగా అద్భుతంగా తీసి సక్సెస్ అయ్యాడు విరించి వర్మ. బావ మరదలు మధ్య జరిగే కొన్ని సీన్స్ చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయ్యాయి. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించింది. ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తనకంటూ మంచి గుర్తింపు సాధించుకున్న అనుదీప్ (anudeep) కూడా ఈ సినిమాకి పనిచేశాడు.
Also Read: Happy Birthday Trivikram Srinivas : ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ త్రివిక్రమ్ ఎలా అయ్యారంటే.?
ఒక సినిమా కాన్సెప్ట్ బాగుంటే అది కొత్తవాళ్లు చేసిన కూడా ఖచ్చితంగా ప్రేక్షకాదరణ పొందుతుంది అని నిరూపించిన సినిమా ఉయ్యాల జంపాల. ఈ సినిమా మ్యూజిక్ కూడా అద్భుతంగా వర్కౌట్ అయింది. ఈ సినిమా తర్వాత ఏకంగా నానితో సినిమా చేసే అవకాశాన్ని సాధించుకున్నాడు విరించి వర్మ. ఇక నాని హీరోగా మజ్ను అనే సినిమాను తెరకెక్కించాడు విరించి వర్మ. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది కేవలం యావరేజ్ సినిమా గా మాత్రమే ఆడింది. అయితే ఈ సినిమాలో నాని అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తూ ఉంటాడు. మొదట ఈ క్యారెక్టర్ ని రాసినప్పుడు ఈ క్యారెక్టర్ ఒక రైటర్ అని రాసుకున్నాడు విరించి వర్మ. ఈ క్యారెక్టర్ ను అసిస్టెంట్ డైరెక్టర్ చేద్దామని నాని చెప్పడంతో అసిస్టెంట్ డైరెక్టర్ గా మార్చాడు. అయితే ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్ట్ గా పని చేస్తే బాగుంటుందని టాపిక్ రావడంతో బాహుబలి (baahubali) సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ పెడదామని నాని చెప్పారట.
Also Read : Sai Pallavi: ఆ హీరో ఫ్యాన్స్‌ను హర్ట్ చేసిన సాయి పల్లవి.. మరోసారి సోషల్ మీడియాలో రచ్చ
ఇక మజ్ను సినిమాలో ఎస్.ఎస్ రాజమౌళి కొన్ని కీలక పాత్రలో కనిపిస్తూ ఉంటారు. ఈ ఆలోచనను చెప్పగానే రాజమౌళి కూడా ఒప్పుకున్నారట. నాని చెప్పడం వల్లే రాజమౌళి ఒప్పుకున్నారు. అయితే ఈ షూటింగ్ అంతా కూడా రామోజీ ఫిలిం సిటీలో బాహుబలి సెట్ లోనే చేశారట. ఈ షూటింగ్ సమయంలో ఎస్ఎస్ రాజమౌళి బాగా హెల్ప్ ఫుల్ గా ఉన్నారని తెలిపాడు విరించి వర్మ. ఇక ప్రస్తుతం జితేందర్ రెడ్డి అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు విరించి వర్మ. ఈ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది ఈ తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నాడు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని తెలియజేశాడు.