EPAPER

Rajinikanth: రజినీకాంత్ ను పరామర్శించిన సీఎం.. కాల్ చేసి మరీ..

Rajinikanth: రజినీకాంత్ ను పరామర్శించిన సీఎం.. కాల్ చేసి మరీ..

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్  అనారోగ్యంతో హాస్పిటల్ లో చేరిన విషయం తెల్సిందే. సోమవారం రాత్రి ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వెంటనే హాస్పిటల్ కు తరలించారు. రజినీని పరీక్షించిన వైద్యులు ఆయన గుండెలో ఉండే రక్తనాళాల్లో సమస్య ఉందని గుర్తించి వెంటనే  స్టెంట్ వేశారు. ప్రస్తుతం రజినీ ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో మూడు రోజుల్లో ఆయన డిశ్చార్జ్ చేయనున్నట్లు వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఇక దీంతో అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని  దేవుడికి పూజలు చేస్తున్నారు.


అభిమానులతో పాటు పలువురు ప్రముఖులు కూడా రజినీ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం  రజినీకాంత్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. పర్సనల్ గా కాల్ చేసి మరీ ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. రజినీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు సమాచారం.

ఇక చంద్రబాబు- రజినీకాంత్ మధ్య స్నేహ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  గతేడాది ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలకు రజినీకాంత్ ను చంద్రబాబు ముఖ్య అతిథిగా పిలిచిన విషయం తెల్సిందే. ఈ ఉత్సవాల వలన రజినీ ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్టీఆర్ గురించి, చంద్రబాబు గురించి రజినీ గొప్పగా చెప్పడంతో.. అప్పట్లో ఉన్న వైసీపీ ప్రభుత్వం, రజినీపై నిప్పులు చెరిగింది.


ఇక వయస్సులో పెద్ద , సూపర్ స్టార్ అన్న కనీస మర్యాదను కూడా ఇవ్వకుండా వైసీపీ నేతలు అసభ్యపదజాలంతో రజినీని తిట్టిపోశారు. ఆ తరువాత దీనిపై చంద్రబాబు మండిపడిన  విషయం కూడా విదితమే. ఎన్నో ఏళ్లుగా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఇంకా కొనసాగుతూనే ఉంది. రజినీ కోలుకొని ఇంటికివచ్చాకా.. చంద్రబాబు, తలైవాను కలుస్తారేమో చూడాలి.

Related News

Martin Movie Review : మార్టిన్ మూవీ రివ్యూ…

Fahadh Faasil: 100 కోట్ల హీరో అని చెప్పండ్రా ఈయనకు.. మరీ సైడ్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు

Viswam: మాస్ సాంగ్ అదిరింది.. కావ్య అందాలు అయితే నెక్స్ట్ లెవెల్..

Tollywood Heroine: బూరె బుగ్గలతో ముద్దొస్తున్నఈ చిన్నారి.. ఇప్పుడు యమా హాట్ బ్యూటీ.. గుర్తుపట్టండి చూద్దాం

Soundarya: సౌందర్య నిర్మించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా..?

Thiruveer: మసూద హీరో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’.. చీఫ్ గెస్ట్ గా రానా..

Vettaiyan : రానా మళ్లీ అదే మిస్టేక్ చేస్తున్నాడు.. ఇకనైనా మారండి బాస్..!

Big Stories

×