AP deputy cm Pawankalyans praise for Niharika : నిహారిక కొణిదెల కమిటీ కుర్రోళ్లు మూవీతో ఇటీవల మళ్లీ పాపులారిటీ సంపాదించుకుంది. నిర్మాతగా ఓ మంచి మూవీని అందించారని సినీ ఇండస్ట్రీ అంతా పొగడ్తలతో ముంచెత్తారు. ఇక లోబడ్జెట్ మూవీగా వచ్చి బయ్యర్లకు లాభాలను తెచ్చిపెట్టింది కమిటీ కుర్రోళ్లు మూవీ. 2016 నుంచి తన నట ప్రస్థానాన్ని ప్రారంభించిన నిహారిక. ఒక మనసు మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది నిహారిక. ఆ మూవీలో హీరోగా నాగ శౌర్య నటించాడు. నాగశౌర్యకు జతగా నిహారిక నటించింది. సినిమా ఆర్థికంగా ఆడలేకపోయినా..నిహారిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. హీరోయిన్ కాకముందే కొన్ని రియాలిటీ షోలకు యాంకర్ గా పనిచేశారు. తర్వాత తన ఓన్ బ్యానర్ పింక్ ఎలిఫెంట్ బ్యానర్ మీద ‘ముద్ద పప్పు-ఆవకాయ్’ అనే తెలుగు వెబ్ సిరీస్ లో నటించారు. యూట్యూబ్ లో ఈ సిరీస్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. తర్వాత హీరోయిన్ గా చేసిన సూర్యకాంతం అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. పెదనాన్న చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి మూవీలో ఓ చిన్న పాత్ర చేసింది.
రూ.5 లక్షల సాయం
కమిటీ కుర్రోళ్లు మూవీకి ప్రశంసలతో బాటు, వసూళ్లు కూడా బాగానే వచ్చాయి. మహేష్ బాబు కూడా నిహారిక ను మెచ్చుకున్నారు. ఉత్తమ అభిరుచి కలిగిన నిర్మాతగా కమిటీ కుర్రోళ్లు మూవీని అందించిన నిహారిక భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన సినిమాలు నిర్మించాలని కోరారు. మహేష్ ట్వీట్ తో కమిటీ కుర్రోళ్లు మూవీ కలెక్షన్లు మరింతగా పెరిగాయి. దాదాపు అందరూ నూతన తారలతో నిర్మించిన కమిటీ కుర్రోళ్లు మూవీ నిహారిక ఆశలు వమ్మ చేయలేదు. అయితే ఇటీవల ఏపీలో బుడమేరు వరద తాకిడికి విజయవాడ నగరవాసులు లక్షల సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టాలీవుడ్ అగ్ర హీరోలంతా కోటి రూపాయల సాయం అందించారు. చిన్న హీరోలు కూడా ఈ విషయంలో స్పందించారు. అయితే కొణిదెల నిహారిక కూడా రూ.5 లక్షల సాయం అందించిన విషయం తెలిసిందే. ఏపీలో వరద ముంపుకు గురైన ఒక్కో గ్రామానికి యాభై వేల చొప్పున పది గ్రామాలకు తాను సాయం అందిస్తున్నట్లు తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ పెట్టారు. అయితే ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ లేటెస్ట్ గా తన స్పందన తెలిపారు.
పవన్ కళ్యాణ్ ప్రశంసలు
ఏపీని కష్టకాలంలో ఆదుకున్న తన అన్న కుమార్తె నిహారికను మనసారా అభినందనలతో సహా నిండు మనసుతో ఆశీర్వదించారు. నిహారిక పెద్ద మనసుకు..సాయం చేసే గుణానికి మనసారా ఆమెను అభినందిస్తున్నానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ సందర్భంగా పూర్తిగా పల్లెటూరు నేపథ్యంలో ఎంతో సహజంగా కేవలం కంటెంట్ ను మాత్రమే నమ్ముకుని ఎంతో ధైర్యంగా..ఒక నిర్మాతగా నిహారిక అందించిన కమిటీ కుర్రోళ్లు మూవీ నిర్మాతకు అభినందనలు. నిహారిక తన ప్రయాణాన్ని ఇంతటితో ఆపేయకుండా భవిష్యత్తులో మరిన్ని విజయవంతమైన సినిమాలు రూపొందించాలని మనసారా కోరుకుంటున్నాను.
నిహారికను పవన్ కళ్యాణ్ చిన్నప్పటినుంచి ఆమెను అపురూపంగా చూసుకునేవారు. నిహారిక కూడా తన బాబాయ్ అంటే అంతే ప్రేమగా ఉంటారు. తన జీవితానికిక బాబాయ్ పవన్ కళ్యాణ్ ఎంతగానో స్ఫూర్తినిచ్చారని అంటుంటారు.
ఆంధ్రప్రదేశ్లో వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చి ఒక్కొక్క గ్రామానికి 50 వేల రూపాయల చొప్పున 10 గ్రామాలకు రూ. 5 లక్షల విరాళం ప్రకటించిన అన్నయ్య @NagababuOffl గారి కుమార్తె, కొణిదెల నిహారికకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. కష్టకాలంలో ప్రజలకు అండగా ఉండాలనే మంచి…
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) September 9, 2024