Man Sells Son| ఈ ప్రపంచంలో ఆరోగ్యం తరువాత అతిపెద్ద సమస్య పేదరికం. ఆర్థిక కష్టాలు మనిషిని వివశుడిని చేస్తాయి. చుట్టూ ఉన్న సమాజం అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషిని ఇంకా దోచుకునేందుకే ప్రయత్నిస్తుంది. అలాంటి ఒక ఘటన తాజాగా జరిగింది. భార్య అత్యవసరంగా చికిత్స చేయించడానికి ఒక వ్యక్తి ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించాడు.
ఆస్పత్రి బిల్లు చెల్లించకపోతే అతని భార్యను డిశ్చార్చ్ చేయడానికి ఆస్పత్రి యజమాన్యం అంగీకరించలేదు. అప్పుడు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ వ్యక్తికి పిల్లలు విక్రయించే ఒక గ్యాంగ్ పరిచయమైంది. వారు ఆ వ్యక్తి మూడేళ్ల కొడుకును తమకు విక్రయిస్తే డబ్బులు ఇస్తామని చెప్పారు. దీంతో ఆ వ్యక్తి తన కొడుకుని వారికి విక్రయించి ఆస్పత్రి బిల్లు చెల్లించాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ గ్యాంగ్, ఆస్పత్రిపై చర్యలు తీసుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.
Also Read: సహజీవనం చేసిన వ్యక్తిపై రేప్ కేసు పెట్టిన యువతి.. ఈజీగా బెయిల్ తెచ్చుకున్న నిందితుడు.. ఎలాగంటే?
వివరాల్లోకి వెళితే.. ఉత్తర్ ప్రదేశ్ లోని కుషీనగర్ జిల్లా బర్వా పట్టీ ప్రాంతానికి చెందిన హరీశ్ పటేల్ కు నలుగురు సంతానం. అతని భార్యకు మరోసారి గర్భవతి అయింది. అయితే ఆమెకు తీవ్ర అనారోగ్యం కావడంతో చికిత్స కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ చికిత్స చేస్తుండగా.. కాన్పు సమయంలో కూడా అక్కడికే తీసుకురావాలని లేకపోతే తన భార్య ప్రాణాలకు ముప్పు ఉందని వైద్యులు చెప్పారు. దీంతో కూలిపని చేసుకునే హరీశ్ పటేల్.. భార్య కాన్పు సమయంలో కూడా అదే ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే ఈసారి వైద్య ఖర్చుల బిల్లు తన భరించలేనంత అయింది.
తన వద్ద అంత డబ్బులు లేవని ఆస్పత్రి వారికి తెలుపగా.. బిల్లు చెల్లిస్తేనే అతని భార్య, అప్పుడే పుట్టిన బిడ్డను ఆస్పత్రి నుంచి డిశ్చార్చి చేస్తామని ఆస్పత్రి యజమాన్యం కఠినంగా చెప్పారు. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న హరీశ్ పటేల్ కు ఆస్పత్రిలో క్లీనింగ్ పనిచేసే ఒక మహిళ పరిచయమైంది. తనకు ఆస్పత్రి బిల్లు చెల్లించేందుకు సాయం చేస్తానని చెప్పి.. ఒకచోటికి తీసుకెళ్లింది.
అక్కడ ఇద్దరు యువకులు హరీశ్ పటేల్ కు ఒక ఆఫర్ ఇచ్చారు. హరీశ్ పటేల్ కు మూడేళ్ల కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుని తమకు విక్రయిస్తే.. ఆస్పత్రి బిల్లు తో పాటు రూ.50 వేలు అదనంగా ఇస్తామని చెప్పారు. ఇది హరీశ్ పటేల్ షాక్ కు గురయ్యాడు. బాగా ఆలోచించిన తరువాత వారి చెప్పిన దానికి అంగీకరించాడు. మరుసటి రోజు ఆ ఇద్దరు యువకులతో పాటు ఒక భార్యభర్త కూడా హరీశ్ పటేల్ ను కలిశారు. వారు పూర్తి ఏర్పాట్లతో అక్కడికి వచ్చారు. హరీశ్ పటేల్ కొడుకుని వారు దత్తత తీసుకుంటున్నట్లు అగ్రీమెంట్ పేపర్లు తీసుకొచ్చారు.
Also Read: కేవలం రూ.20 లంచం తీసుకున్న పోలీస్.. 34 ఏళ్ల తరువాత మండిపడిన కోర్టు!
హరీశ్ పటేల్ వాటికి సంతకం చేసి వారిచ్చిన డబ్బులు తీసుకున్నాడు. ఆస్పత్రి బిల్లు చెల్లించిన తరువాత తన భార్యను ఇంటికి తీసుకెళుతుండగా.. పోలీసులు ఒక్కసారిగా అక్కడికి వచ్చి హరీశ్ పటేల్ ను పట్టుకున్నారు. తమకు పిల్లలు విక్రయించే గ్యాంగ్ గురించి సమాచారం అందిందని.. చెప్పి హరీశ్ పటేల్ ని అదుపులోకి తీసుకున్నారు. అయితే పూర్తి విచారణ చేసిన తరువాత ఆస్పత్రిలో పనిచేసే ఆ క్లీనింగ్ మహిళ, ఇద్దరు యువకులు, పిల్లాడిని దత్తత తీసుకున్న దంపతులను అరెస్ట్ చేశారు. హరీశ్ పటేల్ కు అతని కొడుకుని తిరిగి అప్పగించారు.