Pushpa 2.. అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో గత ఏడాది పుష్ప(Pushpa ) సీక్వెల్ గా వచ్చిన చిత్రం పుష్ప 2(Pushpa 2) . ఎన్నో అంచనాల మధ్య 2025 డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఊహించిన విజయాన్ని సొంతం చేసుకుంది. అంతే కాదు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అతి తక్కువ సమయంలోనే రూ.1830 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన రెండవ చిత్రంగా నిలిచింది. ఇకపోతే ఈ సినిమా విజయాన్ని అల్లు అర్జున్ సెలెబ్రేట్ చేసుకోలేకపోయారు. కారణం డిసెంబర్ 4వ తేదీన హైదరాబాదులోని సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం.. ఆమె కొడుకు ప్రాణాలతో ఆసుపత్రిలో ఇప్పటికీ పోరాడుతూనే ఉండడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనికి తోడు ఇదే విషయంపై జైలు జీవితం కూడా గడిపివచ్చారు అల్లు అర్జున్. ఇలాంటి సమయంలో పుష్ప2 పై ఏపీ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా మారింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
ఇలాంటి సినిమాలు మనకెందుకు?
తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులకు మంత్రి సత్య కుమార్ యాదవ్ (Satya Kumar Yadav) కీలక సూచనలు చేశారు. శనివారం నంద్యాలలో ఒక మీడియాతో మాట్లాడిన ఆయన, సమాజానికి ఉపయోగపడే సినిమాలు మాత్రమే తీయాలని తెలిపారు. బందిపోట్లు, స్మగ్లర్ల బయోగ్రఫీలతో సినిమా తీయడం ఎందుకు? అంటూ ప్రశ్నించారు. సమాజంలో ఇలాంటివి మంచివి కాదని, జన్మించిన ఊరు, సమాజం కోసం శ్రమించే వాళ్ళ కథలను సినిమాలుగా తీయాలని పలికారు. మొత్తానికైతే పుష్ప2 సినిమా ఎర్రచందనం స్మగ్లర్ నేపథ్యంలో తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇక ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సత్య కుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం గమనార్హం.
పుష్ప 2 సినిమా విశేషాలు..
పుష్ప సినిమా తర్వాత మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా దాదాపు మూడు సంవత్సరాల పాటు నిర్విరామంగా పుష్ప 2 కోసం పనిచేశారు అల్లు అర్జున్. ఇందులో అమ్మవారి జాతర కోసం లేడీ గెటప్ లో కనిపించి, భారీ పాపులారిటీ అందుకున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడానిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ పై నవీన్ యేర్నేని (Naveen yerneni) వై. రవిశంకర్(Y.Ravi shankar ) ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) హీరోయిన్ గా నటించగా.. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీ లీల (Sree Leela) స్పెషల్ సాంగ్ చేసి అందరిని అబ్బురపరిచింది. ఎప్పటిలాగే అనసూయ(Anasuya ), సునీల్ (Suneel), ఫహద్ ఫాజిల్ (Fahad fazil) తదితరులు తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. ఇకపోతే ఇటీవల ఈ సినిమా హీరోయిన్ లో కలెక్షన్ల సాధించడంతో నిర్మాతలు అలాగే సుకుమార్ ఇళ్ళ పై ఐటి అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.