BigTV English
Advertisement

Appudo ippudo Eppudo: నీల్ తో మూవీ.. నిఖిల్ దెబ్బకు హీరోయిన్ కెరియర్ మటాష్..!

Appudo ippudo Eppudo: నీల్ తో మూవీ.. నిఖిల్ దెబ్బకు హీరోయిన్ కెరియర్ మటాష్..!

Appudo ippudo Eppudo.. నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddharth) హీరోగా, రుక్మిణి వసంత్ (Rukmini vasanth) హీరోయిన్ గా ఎప్పుడో కరోనా కాలంలో షూటింగ్ మొదలుపెట్టారు. ఇన్నేళ్ల తర్వాత షూటింగ్ పూర్తి చేసుకుని త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం “అప్పుడో ఇప్పుడో ఎప్పుడో”.. అసలు కరోనా సమయంలో ఈ సినిమా ప్రకటించినప్పుడు ఎటువంటి బజ్ లేదు. దీనికి తోడు సినిమాపై ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ రాకపోవడం మరో నెగిటివ్ కి కారణం అని చెప్పాలి. దీనికి తోడు సినిమాపై ఎటువంటి బజ్ లేదు. నిఖిల్ కూడా ఈ సినిమాను పట్టించుకోవడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు లండన్ లో సినిమా షూటింగ్ పూర్తి చేయడం సబ్సిడీ కోసమే అన్నట్టుగా కూడా వార్తలు వినిపించాయి.ఇలాంటి ఎన్నో అనుమానాలు, ఆరోపణల మధ్య హీరోయిన్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) కెరియర్ ఇరకాటం లో పడిందనే వార్తలు వినిపిస్తూ ఉండడం గమనార్హం.


ఫ్లాప్ లతో సతమతమవుతున్న డైరెక్టర్, హీరో..

కార్తికేయ 2 సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న నిఖిల్ (Nikhil)ఆ తర్వాత 18 పేజెస్, స్పై వంటి చిత్రాలు తెరకెక్కించారు. కానీ ఈ రెండు చిత్రాలు డిజాస్టర్ గా నిలిచాయి. ఇక అందరూ కార్తికేయ -3 కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో నిఖిల్ నుంచి ఈ సినిమా రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పైగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన సుధీర్ వర్మ (Sudheer Varma) కి షాకిని డాకిని , రావణాసుర రూపంలో డిజాస్టర్లు కూడా పలకరించాయి.


ఇరకాటంలో పడ్డ హీరోయిన్ కెరియర్..

ఇలాంటి డైరెక్టర్ ఇప్పుడు ఈ సినిమాతో రాబోతుండడంతో హీరోయిన్ కెరియర్ కు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. హీరోయిన్ రుక్మిణి వసంత్ విషయానికి వస్తే.. రుక్మిణి వసంత్ కన్నడ నటి.. ఈమె బీర్బల్ ట్రైలాజీ కేస్ 1: ఫైండింగ్ వజ్రముని అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఆ తర్వాత సప్త సాగర దాచేయల్లో అనే సినిమాతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది.. దర్శకుడు హేమంత్ ఎం రావు దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో రష్మిక (Rashmika mandanna) మాజీ లవర్ రక్షిత్ శెట్టి (Rakshith Shetty) హీరోగా నటించారు.

ప్రశాంత్ నీల్ తో హీరోయిన్ మూవీ..

ఇక ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) రచన సహకారం అందించిన భఘీరా (Bagheera)లో నటిస్తోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. త్వరలోనే విడుదలకు సిద్ధం కాబోతున్న ఈ సినిమాలో ఈమె అవకాశాన్ని అందుకోవడం అభిమానులకు సంతోషాన్ని కలిగించే అంశమే అని చెప్పాలి . మరొకవైపు మరో రెండు మూడు తమిళ్ చిత్రాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇలా కెరియర్లో ఫుల్ ఫామ్ లో ఉన్న ఈమె నుంచి వస్తున్న అప్పుడో ఇప్పుడో ఎప్పుడో మూవీ ఈమె కెరియర్ కు ఇప్పుడు నష్టం వాటిల్లేలా కనిపిస్తోంది. అసలు ఎలాంటి బజ్ లేకుండా ఈ సినిమా రాబోతుండడంతో అందరూ హీరోయిన్ కెరియర్ నాశనం అవుతుందేమో అంటూ కామెంట్ లు చేస్తున్నారు. మరి రుక్మిణి వసంత్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందో చూడాలి.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×