Racharikam Trailer : ఆర్జీవి హీరోయిన్ అప్సర రాణి (Apsara Rani) లీడ్ రోల్ పోషిస్తున్న ‘రాచరికం’ (Racharikam) సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. అయితే ఈ ట్రైలర్ లో కేటీఆర్ డైలాగ్ ‘సీఎం అవ్వాలంటే జైల్ కి వెళ్ళాలి…’ అని ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. అలాగే ఇందులో షర్మిల ‘ఆడపిల్ల ఈడ పిల్ల గాదు’ అనే డైలగ్ కూడా ఉంది.
‘రాచరికం’ (Racharikam) ట్రైలర్
హీరోయిన్ అప్సర రాణి (Apsara Rani) గతంలో ఎన్నడూ లేని విధంగా ‘రాచరికం’ (Racharikam) సినిమాలో సరికొత్త పాత్రలో నటించింది. ఈ మూవీలో అప్సర రాణితో పాటు వరుణ్ సందేశ్, విజయ్ శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. చిల్ బ్రోస్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఈశ్వర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ‘రాచరికం’ మూవీకి సురేష్ లంకెలపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్ లో అప్సర రాణి ఉగ్రరూపంలో కనిపించి షాక్ కి ఇచ్చింది. అయితే ఇదేదో హర్రర్ మూవీగా రూపొందుతోందేమో అనుకుంటే, తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్లో ఇది పక్కా పొలిటికల్ ఎంటర్టైనర్ అనే విషయంపై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఇక ఈ ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగగా… రక్తపాతంతో వైలెన్స్ గట్టిగానే ఉన్నట్టుగా చూపించారు.
షర్మిల (Sharmila), కేటీఆర్ (KTR) డైలాగులు
“రాచకొండ ఒక అడవి లాంటిదబ్బా… ఈడ బలంతో పోరాడే పులులు, బలగంతో పోరాడే ఏనుగులు, ఎత్తుకు పై ఎత్తేసే గుంట నక్కలు, కాసుకుని కాటేసే విష సర్పాలు ఉంటాయి… ఆధిపత్యం కోసం జరిగే పోరులో రక్తపాతాలే తప్ప రక్త సంబంధాలు ఉండవు” అనే డైలాగ్ ఆసక్తికరంగా ఉంది. ఇక ఈ ట్రైలర్లో అప్సర రాణి లవ్ స్టోరీ, పరువు హత్య, రాజకీయం, అధికారం కోసం పాకులాట, వైలెన్స్ వంటివి మెండుగా ఉన్నాయని ఈ ట్రైలర్ ని చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్ మధ్యలో అప్సర రాణి పాలిటిక్స్ లో అడుగు పెట్టి “ఆడపిల్ల పెళ్లయ్యాక ఈడ పిల్ల కాదు” అనే షర్మిల డైలాగ్, చివరలో “సీఎం పీఎం అవ్వాలంటే జైలుకెళ్లడం ఒక క్వాలిఫికేషన్ అవుతాది” అనే డైలాగ్స్ మెయిన్ హైలెట్ గా నిలిచాయి. ఇదే డైలాగ్ కేటీఆర్ నోటి వెంట వచ్చి తెగ వైరలైన సంగతి తెలిసిందే. కేటీఆర్ డైలాగ్ వచ్చినప్పుడు వరుణ్ సందేశ్ జైల్లో నడుస్తూ కనిపించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఫిబ్రవరిలో రిలీజ్
ఇక ఈ సినిమా వరుణ్ సందేశ్ తో పాటు అప్సరా రాణి కెరీర్ కు కూడా చాలా ముఖ్యం. అయితే ట్రైలర్ ను బట్టి చూస్తుంటే, వీరిద్దరూ ఈ మూవీతో హిట్ కొట్టేలా కనిపిస్తున్నారు. మొత్తానికి ఆర్జీవి బ్యూటీ రూట్ మార్చి, ఒక మంచి కంటెంట్ బేస్డ్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘రాచరికం’ (Racharikam) సినిమాను ఫిబ్రవరి 1న థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నామని ఈ ట్రైలర్ చివర్లో మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు.