Bullet Bhaskar: జబర్దస్త్ కామెడీ షో ద్వారా పరిచయమైన కమెడియన్స్ లో బుల్లెట్ భాస్కర్ ఒకడు. మిమిక్రీతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని.. జబర్దస్త్ లో కంటెస్టెంట్ గా మొదలై ఇప్పుడు టీమ్ లీడర్ గా కొనసాగుతున్నాడు. తన మీద, తన పెళ్లిళ్ల మీద పంచ్ లు వేస్తూ కామెడీ పండిస్తూ ఉంటాడు. జబర్దస్త్ లో చాలామంది బుల్లెట్ భాస్కర్ కు మూడు పెళ్లిళ్లు అయ్యాయని.. మూడు ఫ్యామిలీలను కాపాడుతున్నాడని కామెడీ చేస్తుంటారు. అయితే అందులో నిజమెంత.. ? అబద్ధమెంత.. ? అనేది తెలియదు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో బుల్లెట్ భాస్కర్ గుట్టు బయటపడింది. అతను తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడంటూ ఒక యువతి ఫోన్ లో బండబూతులు తిడుతుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఒక యూట్యూబ్ ఛానెల్ కు బుల్లెట్ భాస్కర్ గెస్ట్ గా వెళ్ళాడు. అక్కడ యాంకర్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.
Pushpa 2: The Rule : ‘పుష్ప 2’ చూడడానికి వెళ్తూ ట్రైన్ యాక్సిడెంట్… 19 ఏళ్ల యువకుడి మృతి
ఈ మధ్య జబర్దస్త్ లో ఎక్కువ డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉంటున్నాయి అంటున్నారు.. దానిపై మీరేమంటారు అన్న ప్రశ్నకు.. భాస్కర్ మాట్లాడుతూ.. జబర్దస్త్ లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువ అని అంటున్నారు.. అనిమల్ సినిమాలో అన్ని బూతులే ఉన్నాయి. మరి ఆ సినిమాను ఎలా చూసారు. మూడు గంటల సినిమాను మేము 10 నిమిషాల్లో చూపించడమే స్కిట్ అని చెప్పుకొచ్చాడు.
ఆ తరువాత ప్రతి ఒక్కరు జబర్దస్త్ లో మేము చేసిన స్కిట్స్ చూసి.. మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అని కేసులు పెడుతున్నారు. రేపొద్దున అడుక్కొనేవారి గెటప్ వేసి కామెడీ చేస్తే.. వారు కూడా మా మనోభావాలు దెబ్బతిన్నాయని అంటారేమో అంటూ ఫైర్ అయ్యాడు.
Pushpa 2: జాతర సీక్వెన్స్.. థియేటర్లలో మహిళలకు పూనిన అమ్మవారు..!
ఇక సరదాగా సాగిపోతున్న ఇంటర్వ్యూలో యాంకర్ బాంబ్ పేల్చింది. నాకు కొంతకాలంగా ఒక అమ్మాయి కాల్ చేస్తుంది. బుల్లెట్ భాస్కర్ తనకు అన్యాయం చేశాడని చెప్తుంది. నేను మాట్లాడతాను అని ఆమెకు చెప్పాను అని.. ఇంటర్వ్యూలోనే సదురు యువతికి కాల్ చేసి ఇచ్చింది.
ఇక ఒక యువతి కాల్ లోనే.. భాస్కర్.. నన్ను మర్చిపోయావా.. ? అందరు ఫోర్ ఫ్యామిలీస్ అని అడుగుతున్నారు. నేను గుర్తులేనట్లు కామెడీ చేయమాకు.. జబర్దస్త్ లో చేసుకో నీ కామెడీ. నేను గుర్తులేను.. పిల్లలు గుర్తులేరు.. వస్తా వస్తా అని చెప్తున్నావ్.. ఇప్పటివరకు రాలేదు” అంటూ ఆ యువతి ఏడవడం మొదలుపెట్టింది. ఇక ఆమె అంత ఏడుస్తున్నా .. భాస్కర్ నవ్వుతూ కూర్చున్నాడు.
Deepika Padukone: స్టార్ సింగర్‌కు కన్నడ నేర్పిన దీపికా పదుకొనె.. స్టేజ్‌పైనే అతడితో కలిసి రచ్చ
ఇక యాంకర్ కూడా సీరియస్ అయ్యి.. ఆమె ఏడుస్తుంటే సీరియస్ అవుతారు ఏంటి అంటూ మండిపడగా.. అందుకే నేను ఇంటర్వ్యూలకు రాను అని భాస్కర్ చెప్పడం గమనార్హం. అయితే ఇది నిజం కాదని.. కావాలనే యాంకర్ ఫ్రాంక్ చేసిందని కొందరు చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాలంటే ఈ ఇంటర్వ్యూ రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.