BigTV English

AR Rahman: విడాకులకు అప్లై చేయలేదు.. షాకిచ్చిన ఏఆర్ రెహమాన్ భార్య

AR Rahman: విడాకులకు అప్లై చేయలేదు.. షాకిచ్చిన ఏఆర్ రెహమాన్ భార్య

AR Rahman: సినీ పరిశ్రమలో విడాకులు అనేవి ఇప్పుడే కాదు.. ఎప్పటినుండో కామన్. కానీ గత కొన్నాళ్లలో పదేళ్లకు పైగా వైవాహిక జీవితంలో కలిసున్న జంటలు కూడా విడిపోతున్నాయి. ఇది చూసి ప్రేక్షకులు సైతం షాకవుతున్నారు. ఇన్నేళ్ల తర్వాత అసలు వాళ్లు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని అందరూ చర్చించుకోవడం మొదలుపెడతారు. ఇక ఇటీవల మ్యూజిక్ లెజెండ్ ఏఆర్ రెహమాన్ విషయంలో కూడా అదే జరిగింది. పెళ్లయ్యి 29 ఏళ్లు కలిసున్న తర్వాత తన భార్య సైరా బానుతో విడిపోతున్నట్టుగా రెహమాన్ ప్రకటించారు. కానీ తాజాగా అసలు తాము విడాకులకే అప్లై చేయలేదని స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ షాక్‌కు గురయ్యేలా చేశారు సైరా బాను.


కుటుంబ సభ్యుల క్లారిటీ

ఇటీవల ఏఆర్ రెహమాన్ (AR Rahman) చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో రెహమాన్ అడ్మిట్ అయ్యారనే విషయం బయటికి రాగానే అసలు ఆయనకు ఏమైంది అని ఫ్యాన్స్ అంతా ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు క్లారిటీ ఇచ్చారు. లండన్ టూర్ నుండి వచ్చిన తర్వాత ఏఆర్ రెహమాన్ డీహైడ్రేట్ అయ్యారని, అంతే కాకుండా కాస్త మెడ నొప్పి రావడంతో ఆసుపత్రికి వచ్చారని వారు క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా రెగ్యులర్ పరీక్షలు పూర్తయిన తర్వాత రెహమాన్‌ను వెంటనే పంపించేశామని తెలిపారు. ఆపై తన కుటుంబ సభ్యులు కూడా ఈ విషయంపై సోషల్ మీడియాలో స్పందించారు.


అదంతా అబద్ధం

ముందుగా ఏఆర్ రెహమాన్ కుమారుడు ఏఆర్ అమీన్ తన తండ్రి ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇచ్చాడు. తన తండ్రి బాగానే కోలుకుంటున్నాడని, అందరూ ఇంత సపోర్ట్ అందించినందుకు థాంక్యూ అని తెలిపాడు. ఇక రెహమాన్ సోదరి రేహానా సైతం ఈ విషయంపై సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. రెహమాన్ ఛాతి నొప్పి వల్ల ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు అనే వార్తలు అంతా అబద్ధమని కొట్టిపారేసింది. లండన్ నుండి ప్రయాణం చేసి రావడం వల్ల అలసట, డీహైడ్రేషన్ వల్లే రెహమాన్ అనారోగ్యానికి గురయ్యాడని క్లారిటీ ఇచ్చింది. ఇక అందరితో పాటు రెహమాన్ భార్య సైరా బాను కూడా ఈ విషయంపై స్పందించింది. మీడియా వైఖరిని తప్పుబట్టింది.

Also Read: ‘రాబిన్‌హుడ్’లో గెస్ట్ రోల్.. డేవిడ్ వార్నర్ ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నాడంటే.?

మాజీ భార్య కాదు

‘‘మేము కేవలం సెపరేట్ అయ్యాం అంతే. చట్టపరంగా మేము ఇంకా భార్యభర్తలమే. మేమిద్దరం ఇంకా విడాకులకు ఫైల్ చేయలేదు. నాకు ఉన్న అనారోగ్య సమస్యల వల్ల రెహమాన్‌కు ఒత్తిడి తీసుకురాకూడదు అనే కారణంతో మాత్రమే తనకు దూరంగా ఉంటున్నాను. మేము విడిపోయినా కూడా రెహమాన్ బాగుండాలనే నేనెప్పుడూ కోరుకుంటాను. నన్ను తన మాజీ భార్య అనడం ఆపేయండి’’ అంటూ అందరికీ క్లారిటీ ఇచ్చేసింది సైరా బాను (Saira Banu). దీంతో ప్రేక్షకుల్లో కన్ఫ్యూజన్ మొదలయ్యింది. వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్టుగా ప్రకటించారు కదా.. మళ్లీ ఇప్పుడు కేవలం సెపరేట్ అయ్యామని అంటున్నారేంటి అంటూ అందరిలో కొత్తగా చర్చలు మొదలయ్యాయి.

Related News

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

TFCC Elections : ముగిసిన వివాదం… త్వరలోనే ఛాంబర్‌కి ఎలక్షన్లు

Big Stories

×