Arbaaz Khan: ఈ మధ్యకాలంలో చాలా మంది సెలబ్రిటీలు లేటు వయసులో పెళ్లిళ్లు చేసుకొని అంతే లేటుగా పిల్లల్ని కంటున్నారు. అలా ఇప్పడు మనం చెప్పుకోబోయే నటుడు ఏకంగా 57 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు. మరి ఇంతకీ 57 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న ఆ నటుడు ఎవరు? అనేది చూస్తే.. బాలీవుడ్ నటుడు అర్బాజ్ ఖాన్(Arbhaaj khan).. అయితే అర్బాజ్ ఖాన్ అనే పేరు చెబితే ఎక్కువగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)తమ్ముడు అర్బాజ్ ఖాన్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది. సల్మాన్ ఖాన్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన అర్బాజ్ ఖాన్ పలు సినిమాల్లో విలన్ గా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా.. నటించి మెప్పించారు. అలాగే సినిమాలు మాత్రమే కాకుండా పలు షోలలో వ్యాఖ్యాతగా కూడా పనిచేశారు..
57 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు..
అయితే అలాంటి అర్బాజ్ ఖాన్ తాజాగా 57 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నట్టు ఒక వార్త బాలీవుడ్లో చక్కర్లు కొడుతుంది. అర్బాజ్ ఖాన్ 2023లో మేకప్ ఆర్టిస్ట్ అయినటువంటి షురా ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్నారు అనే న్యూస్ గత కొద్ది రోజులుగా చక్కర్లు కొడుతుంది.కానీ దీనిపై అర్బాజ్ ఖాన్ క్లారిటీ ఇవ్వలేదు.కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలలో అర్బాజ్ ఖాన్ భార్య షురా ఖాన్ బేబీ బంప్ తో కనిపించడంతో అర్బాజ్ ఖాన్ 57 ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్నాడు అంటూ ఈ వీడియో చూసి నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.
అర్బాజ్ ఖాన్ పర్సనల్ లైఫ్..
ఇక అర్బాజ్ ఖాన్ పర్సనల్ లైఫ్ కి వస్తే.. ఈయన మొదట స్టార్ హీరోయిన్ అయినటువంటి మలైకా అరోరాని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అలా 1998లో మలైకా అరోరా (Malaika Arora) ని పెళ్లి చేసుకున్న అర్బాజ్ ఖాన్ 2017 లో ఆమెకు విడాకులు ఇచ్చారు.విడాకుల తర్వాత కొద్ది రోజులు సింగిల్ గా ఉన్న అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్ట్ అయినటువంటి షురా ఖాన్ ని వివాహం చేసుకున్నారు. ఇక మలైకా అరోరాకి అర్హన్ ఖాన్ అనే ఒక కొడుకు కూడా పుట్టాడు.
అర్బాజ్ ఖాన్ సినిమాలు..
ఇక అర్బాజ్ ఖాన్ సినిమాల విషయానికొస్తే.. ఈయన బాలీవుడ్ లోనే కాకుండా సౌత్ లో కూడా కొన్ని సినిమాలు నటించారు. అలా ముఖ్యంగా చిరంజీవి హీరోగా నటించిన ‘జై చిరంజీవా’ మూవీలో విలన్ పాత్ర పోషించారు. అలాగే యాంకర్ ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు హీరోగా నటించిన ‘శివం భజే’, రాజ్ తరుణ్ ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ వంటి సినిమాల్లో కూడా అర్బాజ్ ఖాన్ విలన్ పాత్ర పోషించారు. అలా కేవలం బాలీవుడ్ లోనే కాకుండా తెలుగులో కూడా రాణిస్తున్నారు.
also read:Allu Arjun: ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. బన్నీని ఏకేస్తున్న నెటిజన్స్..మారవా అంటూ ట్రోల్స్!