Arjun Kapoor: సినీ పరిశ్రమలో పెళ్లి చేసుకొని ఎన్నో ఏళ్ల పాట కలిసున్న సెలబ్రిటీలే ఎప్పటికీ అలాగే ఉంటారనే గ్యారెంటీ లేకుండా పోయింది. ముఖ్యంగా గత కొన్నేళ్లలో ఈ విడాకుల కేసులు మరీ ఎక్కువయిపోయాయి. అదే విధంగా ప్రేమ పేరుతో ఎన్నో ఏళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నవారు కూడా విడిపోతున్నారు. తాజాగా బాలీవుడ్‌లో జరిగిన అలాంటి బ్రేకప్ ఒకటి హాట్ టాపిక్‌గా మారింది. అదే అర్జున్ కపూర్, మలైకా అరోరా బ్రేకప్. మలైకా కంటే అర్జున్ వయసులో చిన్న కాబట్టి వీరి ఏజ్ గ్యాప్ గురించి చాలా ట్రోల్స్ వచ్చాయి. అయినా పట్టించుకోకుండా హ్యాపీగా గడిపేసిన ఈ లవ్ బర్డ్స్‌కు ఇటీవల బ్రేకప్ అయ్యిందని వార్తలు వచ్చాయి. తాజాగా అర్జున్ కపూరే స్వయంగా వీటిపై క్లారిటీ ఇచ్చాడు.
క్లారిటీ వచ్చేసింది
అర్జున్ కపూర్ (Arjun Kapoor), మలైకా అరోరా (Malaika Arora)కు ఉన్న ఏజ్ గ్యాప్ గురించి నెటిజన్లు ఓపెన్‌గానే నెగిటివ్ కామెంట్స్ చేసేవారు. అయినా కూడా వారిని ఈ జంట పట్టించుకోలేదు. వీరిద్దరూ దాదాపు అయిదేళ్లు హ్యాపీగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. వీరు త్వరలోనే పెళ్లి కూడా చేసుకుంటారని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ ఇంతలోనే అర్జున్, మలైకాకు బ్రేకప్ అయ్యిందని బాలీవుడ్‌లో రూమర్స్ మొదలయ్యాయి. ప్రతీ బర్త్‌డేను కలిసి సెలబ్రేట్ చేసుకునే ఈ జంట.. ఈసారి విడివిడిగా జరుపుకున్నారు. దీంతో బ్రేకప్ రూమర్స్ నిజమే అని ప్రేక్షకులు నమ్మడం మొదలుపెట్టారు. తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న అర్జున్ కపూర్.. ఈ విషయంపై అందరి ముందు క్లారిటీ ఇచ్చాడు.
Also Read: ఈ హీరోలు హీరోయిన్లు ఒక్క పెళ్లిలో పర్ఫార్మ్ చేయడానికి ఎంత తీసుకుంటారో తెలుసా?
ఫీలవుతున్న ఫ్యాన్స్
తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఒక దీపావళి ఈవెంట్‌లో పాల్గొన్నాడు అర్జున్ కపూర్. అక్కడ తను మాట్లాడడానికి మైక్ పట్టుకోగానే ప్రేక్షకులంతా మలైకా అని అరవడం మొదలుపెట్టారు. అది విన్న అర్జున్ నవ్వుతూ.. ‘‘లేదు. ఇప్పుడు నేను సింగిలే. ఈ విషయం చెప్పకపోతే వెంటనే పెళ్లి గురించి అడిగేలా ఉన్నారు. అందుకే నేను సింగిలే. రిలాక్స్ అయిపోండి’’ అని క్లారిటీ ఇచ్చాడు. మొత్తానికి వీరి బ్రేకప్ గురించి మొదటిసారి అధికారికంగా ప్రకటించారు. దీంతో ప్రేక్షకులకు కూడా ఒక క్లారిటీ వచ్చింది. బీ టౌన్‌లో ఉన్న ఎంతోమంది లవ్ బర్డ్స్‌లో అర్జున్, మలైకా ఒకరు. వీరిద్దరి జంటకు చాలామంది ఫ్యాన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు వీరి బ్రేకప్ గురించి తెలిసి చాలామంది ఫీలవుతున్నారు.
మధ్యలో గ్యాప్
మలైకా అరోరాకు 51 ఏళ్లు. అర్జున్ కపూర్ వయసు 39. వీరి ఏజ్ గ్యాప్ ఎప్పుడూ వీరి ప్రేమను ఆపలేదు. రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయిన కొన్నాళ్లకే వీరిద్దరూ ప్రేమలో ఉన్నామనే విషయాన్ని ఓపెన్‌గానే ఒప్పుకున్నారు. అప్పటినుండి వీరిపై చాలా ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. అవన్నీ పట్టించుకోకుండా అయిదేళ్ల పాటు కలిసున్న ఈ ఇద్దరు.. తాజాగా బ్రేకప్ చేసుకొని విడిపోయారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇప్పుడు విలన్ రోల్స్ అయినా పర్వాలేదంటూ ముందుకెళ్తున్నాడు అర్జున్. త్వరలోనే ‘సింగం అగైన్’లో విలన్‌గా భయపెట్టనున్నాడు.