Arjun Kapoor Malaika Arora: సినీ పరిశ్రమలో డేటింగ్, బ్రేకప్ అనేది కామన్ అని చాలామంది ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. కానీ గత కొన్నేళ్లుగా డేటింగ్ అంటూ ప్రయాణం మొదలుపెట్టిన చాలామంది సెలబ్రిటీలు.. పెళ్లి చేసుకొని వారి డేటింగ్‌కు హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. కానీ బ్రేకప్ అయిపోయిన వారు మాత్రం వారి ఇష్టాలకు తగినట్టుగా మరొకరితో తమ ప్రయాణాన్ని కొత్తగా ప్రారంభించారు. అయితే అన్ని బ్రేకప్స్ ఒకేలాగా ఉండవు. కొందరు అయితే ఎన్నో మనస్పర్థలు, గొడవల మధ్య విడిపోయి ఒకరిపై ఒకరు నిందలు వేసుకునే కపుల్స్ కూడా ఉన్నారు. ప్రస్తుతం అర్జున్ కపూర్, మలైకా అరోరా సోషల్ మీడియా చూస్తుంటే వీరు కూడా అదే కేటగిరి అని అనుమానం వస్తుంది.
నేను సింగిల్
కొందరు సెలబ్రిటీలకు తమకు నచ్చిన కోట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయడం చాలా ఇష్టం. అందులో అర్జున్, మలైకా కూడా ఉంటారు. కానీ వీరు రిలేషన్‌లో ఉన్నప్పుడు షేర్ చేసిన కోట్స్‌కు, బ్రేకప్ అయిపోయిన తర్వాత షేర్ చేస్తున్న కోట్స్‌కు చాలా తేడా ఉంటోంది. హీరోగా అవకాశాలు రాకపోవడం, హిట్లు లేకపోవడంతో ఇటీవల విలన్‌గా తన కెరీర్‌లో కొత్త అడుగు వేశాడు అర్జున్ కపూర్. అందులో భాగంగానే ముందుగా ‘సింగం అగైన్’ మూవీలో విలన్‌గా నటించడానికి ఒప్పుకున్నాడు. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అందులో మలైకా అరోరా గురించి ఏమైనా చెప్పమని ప్రెస్ అడగగా.. తాను సింగిల్ అని స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అప్పటినుండి ఇన్‌స్టాలో కోల్డ్ వార్ మొదలయ్యింది.
Also Read: ఏ.ఆర్. రెహమాన్ విడాకులతో లింక్.. స్పందించిన మోహిని..!
ఢీ అంటే ఢీ
అర్జున్ కపూర్ తాను సింగిల్ అని ప్రకటించిన తర్వాతి రోజే ‘మనసుకు ఒక్క క్షణం దగ్గరయినా ప్రాణానికి జీవితాంతం దగ్గరయినట్టే’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్ షేర్ చేసింది మలైకా అరోరా. దానికి సమాధానంగా అర్జున్ కపూర్ మరొక కోట్ షేర్ చేశాడు. అలా మలైకా అరోరా (Malaika Arora), అర్జున్ కపూర్ (Arjun Kapoor) మధ్య ఇప్పటికీ ఇన్‌స్టాగ్రామ్‌లో కోట్స్‌తో కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ఇది చూస్తున్న ప్రేక్షకులు.. అసలు వీరిద్దరి మధ్య ఇంత వార్ జరిగేలా ఏం జరిగింది? అసలు వీరిద్దరికీ బ్రేకప్ ఎందుకు జరిగుంటుంది అని ఆశ్చర్యపోతున్నారు.
ట్రోల్స్ పట్టించుకోలేదు
మలైకా.. అర్జున్ కంటే చాలా పెద్దది. అంతే కాకుండా ఇదివరకే తనకు సల్మాన్ ఖాన్ సోదరుడితో పెళ్లయ్యింది. వీరిద్దరికీ ఒక కుమారుడు కూడా ఉన్నాడు. విడాకుల తర్వాత తన పర్సనల్ లైఫ్ గురించి, డేటింగ్ లైఫ్ గురించి పెద్దగా వార్తల్లో రాలేదు. కానీ అర్జున్ కపూర్‌తో రిలేషన్ మొదలుపెట్టిన తర్వాత మరోసారి మలైకా అరోరా పేరు వైరల్ అయ్యింది. మొత్తానికి తమ మధ్య ఉన్న వయసు తేడాను ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రోల్ చేసినా ఈ జంట ఎప్పుడూ వాటిని పట్టించుకోలేదు. దాదాపు అయిదేళ్లు పైగా హ్యాపీగా ఉన్న ఈ కపుల్.. సడెన్‌గా ఎందుకు విడిపోయారా అని బాలీవుడ్ ప్రేక్షకులు ఇప్పటికీ చర్చించుకుంటున్నారు.