Akkineni Naga chaitanya: అక్కినేని ఇంట పెళ్లి పనులు మొదలయ్యిపోయాయి. అక్కినేని వారసుడు నాగ చైతన్య, సమంతకు విడాకులు ఇచ్చిన తరువాత శోభితాతో రెండో వివాహానికి రెడీ అయ్యాడు . డిసెంబర్ 4 న వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరగనుంది. సమంతతో కలిసి ఉన్నప్పటి నుంచి చైకు శోభితాకు పరిచయముందని టాక్. ఇక ఇవన్నీ పక్కన పెడితే.. మొట్ట మొదటిసారి నాగచైతన్య .. తన పెళ్లి గురించి, తనకు కాబోయే భార్య శోభితా గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు.
” శోభితాతో వివాహం కోసం నేను ఎంతగానో ఎదురుచూస్తున్నాను. నా మనసులో సీతాకోక చిలుకలు ఎగురుతున్నాయి. అది కూడా మా వివాహ వేడుక మా కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన అన్నపూర్ణ స్టూడియోస్ లో, మా తాత గారి విగ్రహం ముందు జరగడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. మా రెండు కుటుంబాలు ఈ పెళ్లిని చేయడానికి ఎంతో ఉత్సాహం చూపించడం మరింత ఆనందంగా ఉంది.
Nidhhi Agerwal: అంతులేని అందాలతో మైమరిపిస్తున్న నిధి అగర్వాల్
ఇక శోభితా జీవితాన్ని పంచుకోవడం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను. మొదటినుంచి కూడా ఆమెతో నేను డీప్ గా కనెక్ట్ అయ్యాను. తను నన్ను బాగా అర్ధం చేసుకుంటుంది. ఒంటరిగా.. ఏదో కోల్పోయినవాడిలా ఉన్న నన్ను ఆమె మళ్ళీ మాములు మనిషిని చేసింది. నాలో తెలియని ఖాళీని శోభితా ఫిల్ చేసింది. మా ఇద్దరిది ఒక అద్భుతమైన ప్రయాణం కానుంది.
ఈ ఏడాది నా లైఫ్ లో రెండు పెద్ద విషయాలు జరగనున్నాయి. ఒకటి నా సినిమా తండేల్ రిలీజ్ కు రెడీ అవుతుంది. డిసెంబర్ 4 న నా పెళ్లి జరగనుంది. ఇక నా పుట్టినరోజును నేనెప్పుడూ చాలా సింపుల్ గా జరుపుకుంటాను. ఈ ఏడాది కూడా అదే చేస్తున్నాను. నా ఫ్యామిలీతో కలిస్ గోవాలో ప్రశాంతంగా గడుపుతున్నాను. శోభితా నా బర్త్ డే చేయాలనీ ప్లానింగ్ చేయనా అని అడిగింది.
Krithi Shetty: ‘బేబి’ హిందీ రీమేక్‌లో కృతి శెట్టి.. స్టార్ కిడ్‌తో జోడీకి రెడీ
ఆమె ఏది చేసినా నన్నే అడుగుతుంది. ఏ నిర్ణయం అయినా నాకే వదిలేస్తుంది. శోభితా ఉన్నంత కాలం నాకు అది సరిపోతుంది” అని చెప్పుకొచ్చాడు. అయితే చై, శోభితా గురించి చెప్పింది ఏంటంటే.. ఏ నిర్ణయం అయినా అతనికి వదిలేసింది అని, అంటే సామ్ ఆ పని చేయలేదా.. ? అక్కడే వీరికి విభేదాలు తలెత్తాయా.. ? అందుకే విడిపోయారా.. ? అని కొందరు మాట్లాడుకుంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది వారికే తెలియాలి.