BigTV English

Vishwambhara: అప్పుడే రివీల్ చేస్తాం.. ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై దర్శకుడి క్లారిటీ

Vishwambhara: అప్పుడే రివీల్ చేస్తాం.. ‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై దర్శకుడి క్లారిటీ

Vishwambhara: ప్రస్తుతం సీనియర్ హీరోలంతా యంగ్ హీరోలకు అన్ని విషయాల్లో పోటీ ఇవ్వడానికి సిద్ధపడుతున్నారు. స్క్రిప్ట్ సెలక్షన్, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం.. ఇలా అన్ని విషయాల్లో సీనియర్ హీరోలు దూసుకుపోతున్నారు. కానీ మిగతా వారితో పోలిస్తే చిరంజీవి మాత్రం కాస్త వెనకబడినట్టుగా అనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ రీమేక్స్ చేసి ప్రేక్షకులను మెప్పించలేక వెనకబడ్డారు చిరు. ఇప్పుడు ‘విశ్వంభర’ అనే ఒరిజినల్ మూవీతో ఆడియన్స్ ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నా కూడా ఈ సినిమాకు ఇప్పటివరకు ఒక రిలీజ్ డేట్ అనేది కన్ఫర్మ్ కాలేదు. తాజాగా ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ట.. దీని రిలీజ్ డేట్‌పై ఒక క్లారిటీ ఇచ్చారు.


దర్శకుడి క్లారిటీ

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అప్‌కమింగ్ మూవీ ‘విశ్వంభర’ సెట్స్‌పైకి వెళ్లి చాలాకాలమే అయ్యింది. గతేడాది నుండే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకుంది. షూటింగ్ మొదలయిన కొత్తలో ఎప్పటికప్పుడు సెట్స్ నుండి ఫోటోలు షేర్ చేసేవారు మేకర్స్. కానీ ఇప్పుడు అలాంటి అప్డేట్స్ కూడా రావడం తగ్గిపోయింది. అంతే కాకుండా అసలు ‘విశ్వంభర’ విషయంలో ఏం జరుగుతోంది, దీని రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయాన్ని కూడా మేకర్స్ రివీల్ చేయకుండా ఫ్యాన్స్‌ను సస్పెన్స్‌లో పెట్టారు. తాజాగా తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నాడు ‘విశ్వంభర’ దర్శకుడు వశిష్ట (Vassishta). అక్కడ తనకు మూవీ రిలీజ్ డేట్ గురించి ప్రశ్నలు ఎదురవ్వగా వాటిపై ఒక క్లారిటీ ఇచ్చాడు.


ఇప్పుడే చెప్పను

‘‘విశ్వంభర రిలీజ్ డేట్‌ను త్వరలోనే అనౌన్స్ చేస్తాం. ఇంకా చాలా సమయం ఉంది’’ అని క్లారిటీ ఇచ్చాడు వశిష్ట. తన కామెంట్స్‌ను బట్టి చూస్తే ‘విశ్వంభర’ మూవీ సమ్మర్‌లో విడుదల అవ్వడం కూడా కష్టమే అని తెలుస్తోంది. అసలైతే 2025 జనవరిలో సంక్రాంతి కానుకగా ‘విశ్వంభర’ విడుదల కావాల్సింది. కానీ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’తో పోటీపడలేక ఈ సినిమాను చిరంజీవి స్వయంగా పోస్ట్‌పోన్ చేయించారని వార్తలు వచ్చాయి. అందుకే సమ్మర్‌లో కచ్చితంగా ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తుందని అనుకున్నారు. కానీ వశిష్ట మాటలను బట్టి ఈ మూవీ సమ్మర్‌లో కాకుండా మరింత లేట్‌గా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది.. కోరికలు బయటపెట్టిన పూజా హెగ్డే..

అందుకే లేట్

ఇప్పటికే ‘విశ్వంభర’ (Vishwambhara) సినిమాకు సంబంధించిన పోస్టర్స్, టీజర్ బయటికొచ్చాయి. ముఖ్యంగా టీజర్ విడుదలయిన తర్వాత ఈ సినిమాలోని గ్రాఫిక్స్‌ను ప్రేక్షకులంతా ట్రోల్ చేశారు. అందుకే మేకర్స్ అంతా కలిసి ఈ గ్రాఫిక్స్‌ను సరిచేయడం కోసం కొత్త టీమ్‌ను రంగంలోకి దించుతున్నారని కూడా అప్పట్లో రూమర్స్ వినిపించాయి. గ్రాఫిక్స్ వర్క్ మళ్లీ కొత్తగా ప్రారంభం అవుతుంది కాబట్టే సినిమా విడుదలకు మరింతద సమయం పడుతుందేమో అని ప్రేక్షకులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ కచ్చితంగా ‘విశ్వంభర’ను ఎంజాయ్ చేస్తారని, బ్లాక్‌బస్టర్ చేస్తారని వశిష్ట నమ్మకం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం తను ఏ ఇతర సినిమాలకు కమిట్ అవ్వలేదని క్లారిటీ ఇచ్చాడు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×