Arjun Sarja: ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు కూడా తమ పిల్లలను ఒక ఇంటి వారు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే యాక్షన్ కింగ్ గా పేరు సొంతం చేసుకున్న అర్జున్ సర్జ (Arjun Sarja) ఇటీవలే తన పెద్ద కూతురు ఐశ్వర్య సర్జా (Aishwarya Sarja)కు ఘనంగా వివాహం జరిపించగా.. ఇప్పుడు చిన్న కూతురు నిశ్చితార్థం కూడా జరిపించారు. అర్జున్ సర్జ చిన్న కూతురు అంజన సర్జ (Anjana sarja) త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతోంది. తాజాగా తన ప్రియుడుతో ఆమె నిశ్చితార్థం జరగగా.. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. అంజన సర్జ తన ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా తన ప్రియుడుతో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటూ..” 13 ఏళ్ల తర్వాత నా కల నెరవేరింది. మీరు అనుకున్నది నిజమే. ఎంగేజ్మెంట్ పూర్తయింది” అంటూ తన ప్రియుడితో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.
ఘనంగా నిశ్చితార్థం పూర్తి..
ఎట్టకేలకు 13 ఏళ్ల ప్రేమాయణం తర్వాత నిశ్చితార్థం అనే తొలి అడుగు వేశారు ఈ జంట. అంజనా విషయానికి వస్తే ఈమె వరల్డ్ కంపెనీని స్థాపించడం తోపాటు దానికి సీఈఓ గా కూడా వ్యవహరిస్తోంది.ఇక అంజన సర్జ షేర్ చేసిన ఫోటోలలో తన ప్రియుడి ముఖాన్ని అంజనా తన చేతులతో ప్రేమగా పట్టుకోగా.. మరొక ఫోటోలో అతడు అంజనాని ఎత్తుకుంటే.. వెనకాల అర్జున్ సర్జ దంపతులతో పాటు ఐశ్వర్య దంపతులు చిరునవ్వులు చిందిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చారు. ఇక మరొక ఫోటోలో అందరూ కలిసి గ్రూప్ ఫోటోగా దిగారు. ఇలా ఇరు కుటుంబాల సమక్షంలో ఈ ప్రేమ జంట ఎంగేజ్మెంట్ తో ఒకటయ్యారు. ఇది చూసిన అభిమానులు సెలబ్రిటీలు ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
also read; The Goat life: అవార్డుల పంట పండించిన ‘ది గోట్ లైఫ్’.. ఇప్పటివరకు ఎన్ని అవార్డ్స్ వచ్చాయంటే..?
అర్జున్ సర్జ సినిమాలు..
యాక్షన్ కింగ్ అర్జున్ సర్జ సినిమాలు విషయానికి వస్తే.. ఈయన అసలు పేరు శ్రీనివాస్ సర్జా.. కన్నడ హీరోగా పేరు తెచ్చుకున్న ఈయన.. తన నటనతో తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషలలో కూడా అనేక చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా తెలుగులో ‘పుట్టింటికి రా.. చెల్లి’ సినిమా ఈయనకు మరింత ఇమేజ్ అందించింది. ఈ చిత్రంతో పాటు త్రిమూర్తులు, శ్రీ ఆంజనేయం, రామ రామ కృష్ణ కృష్ణ, హనుమాన్ జంక్షన్, శ్రీ ఆంజనేయం, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అటు హీరోగానే కాకుండా ఇటు దర్శకుడిగా కూడా సుమారుగా 10 చిత్రాలను తెరకెక్కించారు. ఇలా ఒకవైపు హీరోగా, దర్శకుడిగా కొనసాగుతూనే మరొకవైపు తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తూ తన కూతుర్లు ఇద్దరిని వారు ఇష్టపడిన వారికే ఇచ్చి వివాహం జరిపిస్తూ వారికంటూ ఒక కుటుంబాన్ని క్రియేట్ చేస్తున్నారు.
Anjana Arjun Of course yes ♥️ #13yearslater #AnjanaArjun #Engagement #family #ArjunSarja #2ndDaughter #Marriage #BIGTVCinema pic.twitter.com/j0qmyaMEWA
— BIG TV Cinema (@BigtvCinema) April 17, 2025