The Goat life: ‘ది గోట్ లైఫ్’.. ఈ సినిమా ఎంత విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ చిత్రాన్ని తెలుగులో ‘ఆడు జీవితం’ అంటూ విడుదల చేయగా.. ఇటు తెలుగు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకుంది. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాకు ఒక అరుదైన అవార్డు లభించింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం కేరళ తిరువనంతపురం వేదికగా.. 54వ కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డుల వేడుక ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకకు మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన నటీనటులు, ప్రముఖులు కూడా హాజరయ్యారు. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కూడా ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు అవార్డులు అందించారు. ఇందులో భాగంగా ఆడు జీవితం చిత్రానికి గానూ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కు ఉత్తమ నటుడిగా అవార్డు లభించింది. అంతేకాదు ఈ సినిమా మరో తొమ్మిది విభాగాలలో అవార్డు సొంతం చేసుకోవడం గమనార్హం.
మొత్తం తొమ్మిది విభాగాలలో అవార్డులు అందుకున్న ది గోట్ లైఫ్..
ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే.. మలయాళ సూపర్ స్టార్ హీరోగా, దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ఆడు జీవితం సినిమాలో సౌదీ అరేబియాలో కూలీలు పడే కష్టాలను చూపిస్తూ డైరెక్టర్ బ్లెస్సీ (Blessy) తో కలిసి చాలా అద్భుతంగా తెరకెక్కించారు. గత ఏడాది మార్చి 28న విడుదలైన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. మొత్తంగా రూ.150 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి మలయాళం సినీ ఇండస్ట్రీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. ఇందులో హీరోయిన్ గా అమలాపాల్ (Amalapaul)హీరోయిన్ గా నటించగా.. మైత్రి మూవీ మేకర్స్ వారు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను విడుదల చేశారు. ఇకపోతే ఈ చిత్రాన్ని విజువల్ రొమాన్స్ ఇమేజ్ మేకర్స్, జెట్ మీడియా ప్రొడక్షన్, అల్టా గ్లోబల్ మీడియా వారు సంయుక్తంగా నిర్మించారు. మొత్తానికి అయితే 9 విభాగాలలో ఈ చిత్రం అవార్డులు సొంతం చేసుకోవడంతో హీరోనే కాకుండా అభిమానులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే ఈ సినిమాకు వచ్చిన అవార్డుల విషయానికి వస్తే..
ఉత్తమ నటుడు: పృథ్వీరాజ్ సుకుమారన్
ఉత్తమ దర్శకుడు : బ్లెస్సీ
ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ : రంజిత్ అంబాడి
ఉత్తమ సహాయ నటుడు: విజయ రాఘవన్
ఉత్తమ రచయిత : బ్లెస్సీ
ఉత్తమ సినిమా ఆటోగ్రాఫర్ : కేఎస్ సునీల్
ఉత్తమ చిత్రం : ఆడు జీవితం
బెస్ట్ స్క్రీన్ ప్లే అడాప్షన్ 2024 – బ్లెస్సీ
అత్యధిక పాపులర్ సంపాదించిన చిత్రం తో పాటూ ఉత్తమ కలరిస్ట్ విభాగంలో కూడా ఈ ఆడు జీవితం సినిమా అవార్డులు అందుకుంది. ఇలా మొత్తం 9 విభాగాలలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ది గోట్ లైఫ్ (ఆడు జీవితం) సినిమా అవార్డులు సొంతం చేసుకోవడం గమనార్హం.
Drugs Ride: హోటల్ పై డ్రగ్స్ రైడ్… మూడో అంతస్తు నుంచి దూకి హీరో పరార్..?