Tollywood..ఈ మధ్యకాలంలో సెలబ్రిటీల పైన సోషల్ మీడియా ప్రభావం ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా సెలబ్రిటీలు తమకు నచ్చిన విషయాన్ని లేదా నచ్చని విషయాన్ని అభిమానులతో చేరవేయడానికి ఈ సోషల్ మీడియాను ప్లాట్ఫార్మ్ గా చేసుకుంటున్నారు. అందుకే వీరికి సంబంధించిన ప్రతి విషయం కూడా ఇట్టే క్షణాల్లో వైరల్ అవుతోంది. అయితే సోషల్ మీడియా అన్నివేళలా సెలబ్రిటీలకు అనుకూలంగా ఉందా అంటే చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా వివాహమైన సెలబ్రిటీలు జంటగా కనిపించకపోతే చాలు విడాకులు తీసుకుంటున్నారు అంటూ రూమర్స్ సృష్టిస్తున్నారు. ఇంకొంతమంది సోషల్ మీడియా ద్వారా తమ భాగస్వామి ఫోటోలు తొలగించినా.. లేదా పేరు తొలగించినా సరే విడాకుల రూమర్స్ ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఒక హీరోయిన్ తన కొడుకుతో కలిసి వెకేషన్ కి వెళ్ళగా.. ఆమె కూడా తన భర్త నుండి విడాకులు తీసుకోబోతోంది అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు. మరి ఆ హీరోయిన్ ఎవరు? ఇలా విడాకుల రూమర్స్ రావడానికి గల కారణం ఏంటి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.
ఇన్నేళ్లయినా తగ్గని క్రేజ్..
ఆమె ఎవరో కాదు లక్ష్మీ కళ్యాణం, చందమామ లాంటి చిత్రాలతో తెలుగు ఆడియన్స్ హృదయాలను దోచుకున్న కాజల్ అగర్వాల్ (Kajal Agarwal). ఒకప్పుడు కుర్రకారు కలల రాకుమారిగా గుర్తింపు తెచ్చుకున్న ఈమె .. పాన్ ఇండియా రేంజ్ లో అప్పట్లోనే పాపులారిటీ దక్కించుకుంది. ముఖ్యంగా కుర్ర హీరోలకు ఫస్ట్ ఛాయిస్ గా కాజల్ అగర్వాల్ నిలిచిన విషయం తెలిసిందే. అటు దర్శక నిర్మాతలు కూడా కాజల్ అగర్వాల్ ను తమ సినిమాలో పెట్టుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసేవారు. అలా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె.. మగధీర, డార్లింగ్, బృందావనం ఇలా పలు చిత్రాలతో తన ఫేమ్ ను కొనసాగించింది. ముఖ్యంగా దాదాపు స్టార్ హీరోలు అందరి సరసన నటించింది. అందుకే ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా ఈమె క్రేజ్ మాత్రం తగ్గలేదని చెప్పాలి.
విడాకుల దిశగా కాజల్ అగర్వాల్..
ఇకపోతే వివాహం చేసుకున్న తర్వాత హీరోయిన్స్ కెరియర్ డౌన్ అవుతుందని అందరూ అనుకుంటారు. కానీ ఈమె తన చిన్ననాటి స్నేహితుడు ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ గౌతమ్ కిచ్లూ ను వివాహం చేసుకున్న తర్వాత కూడా సినిమాలలో అవకాశాలు అందుకొని బిజీగా మారింది. ఇలాంటి సమయంలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేయగా..ఇలా ఉన్నట్టుండి ఇలాంటి వార్తలు రావడానికి కారణం ఇటీవల ఈమె ఒంటరిగానే పలుమార్లు కనిపించడమే.. దీనికి తోడు కొడుకుతో కలిసి దుబాయ్ ట్రిప్పు కి వెళ్ళినప్పుడు కూడా తన భర్త లేకపోవడంతో ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరింది. ముఖ్యంగా కాజల్ అగర్వాల్తో గౌతమ్ కిచ్లూ ట్రావెల్ ఫోటోలలో లేకపోవడం వల్లే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయేమో అనే వార్తలు సృష్టించారు.
రూమర్స్ కి చెక్ పెట్టిన సన్నిహితులు..
అయితే దీనిపై ఖండించిన కాజల్ కుటుంబ సభ్యుల సన్నిహితులు ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాయి. కుటుంబంతో ఎంతో ఆనందంగా గడిపే వీరు సామాజిక మాధ్యమాలలో వచ్చే ప్రతి ఊహాగానానికి స్పందించాల్సిన అవసరం కూడా లేదు. ప్రస్తుతం గౌతమ్ తన పనులతో బిజీగా ఉన్న కారణంగా కాజల్ తో కలిసి ట్రిప్ కి వెళ్లలేక పోయారు. అంతమాత్రాన రూమర్స్ సృష్టించడం ఎంత మాత్రం కరెక్ట్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక ప్రస్తుతం కాజల్ అగర్వాల్ తన భర్తతో విడాకులు తీసుకోబోతోంది అంటూ వస్తున్న వార్తలలో ఎలాంటి నిజం లేదని చెప్పవచ్చు.