New Year 2025 : న్యూఇయర్ సెలబ్రేషన్ కోసం సిద్ధమవుతున్న మందుబాబులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రత్యేకంగా ఆ రోజు యువతీయువకుల ఆనందాన్ని రెట్టింపు చేస్తూ రాష్ట్రంలోని వైన్ షాపులకు అర్థరాత్రి 12 గంటల వరకు ఓపెన్ చేసుకునేందుకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. అలాగే.. రెస్టారెంట్లు, పబ్ లు రాత్రి ఒంటి గంట వరకు తెరిచే ఉంచవచ్చంటూ బంపర్ ఆఫర్ ఇచ్చేసింది. దీంతో.. ఎలాంటి హడావిడి లేకుండా కొత్త ఏడాది రోజున ఎంజాయ్ చేసేందుకు నగరవాసులు సిద్ధమైపోతున్నారు.
సాధారణ రోజులతో పోల్చితే న్యూఇయర్ రోజు అట్టహాసంగా వేడుకలు జరుగుతుంటాయి. కాస్త మందు అలవాటు ఉన్నవాళ్లు అయితే.. ఇంకా ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వాళ్లందరికీ ఉపయోగపడేలా వైన్స్, పబ్ ల టైమింగ్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక జీవో జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం. అయితే.. ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని ఆ రోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు పోలీసులు. ఆఫర్ తో పాటు కొన్ని రూల్స్ కూడా పెట్టేశారు. అవేంటంటే..
న్యూ ఇయర్ వేడుకల్లో ఎంజాయ్ చేసే వరకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ.. డ్రగ్స్ వినియోగిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. డ్రగ్స్ వినియోగంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉన్న నేపథ్యంలో నగర వ్యాప్తంగా దాదాపు 40కి పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి న్యూ ఇయర్ రోజు తనిఖీలు చేపట్టనున్నారు. ఎవరైనా నిషేధిత డ్రగ్స్ వినియోగించినట్లు తేలితే.. నేరుగా జైలుకే వెళతారంటూ హెచ్చరిస్తున్నారు.
వేడుకలు నిర్వహణకు సిద్ధమవుతున్న పబ్లు, రెస్టారెంట్లు సైతం ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని సూచించిన పోలీసులు.. వేడుకలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారో తెలపాలన్నారు. అలాగే.. ఆ రోజు ఎంత మంది వస్తారనే విషయాన్ని పోలీసులకు తెలపాలన్నారు. ఒకవేళ పబ్లు, రెస్టారెంట్లల్లో డ్రగ్స్ దొరికితే.. సంబంధిత పబ్, రెస్టారెంట్ల యజమానుల్నే దోషులుగా తేల్చి కేసులు పెడతామంటుని, కాబట్టి.. ఎలాంటి అనుమతి లేని పదార్థాలను ప్రోత్సహించవద్దని చెబుతున్నారు.
న్యూఇయర్ రోజున ప్రత్యేక తనిఖీలు చేపట్టనున్న తెలంగాణ పోలీసులు.. ఇప్పటికే డ్రగ్స్ టెస్టింగ్ కిట్స్ ను సిద్ధం చేస్తున్నారు. ఆ రోజు నగరవ్యాప్తంగా విస్తృతంగా డ్రగ్స్ తనిఖీలు చేపట్టనున్నారు. అలాగే.. అతిగా మద్యం తాగి రోడ్లపై సంచరించవద్దని హెచ్చరిస్తున్నారు. ఒకరి కారణంగా ఇతరుల జీవితాలను పాడు చేయొద్దని, ఎవరి ఇళ్లల్లో విషాదం నింపొద్దు అంటున్నారు. ఎక్కువగా మద్యం సేవిస్తే.. నగరంలో అందుబాటులో ఉన్న క్యాబ్ సర్వీసుల్ని వినియోగించుకోవాలని, ఎట్టిపరిస్థితుల్లో డ్రైవింగ్ చేయవద్దని అంటున్నారు.
నగరంలోని రోడ్లపై అర్థరాత్రి వేళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ, ప్రమాదరకరంగా డ్రైవ్ చేస్తే అలాంటి వారి లైసెన్సులు రద్దు చేయడం తో పాటు కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, హెల్మెంట్ లేని ప్రయాణాలు చేయవద్దంటున్న పోలీసుల.. ఆయా రోజుల్లో నగర వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Also Read : హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన.. ఇలాంటి ఇళ్లను ఎవరూ కూడా..?
న్యూఇయర్ వేడుకలకు పకడ్భందీగా ఏర్పాట్లు చేస్తున్న పోలీసులు.. నగర వాసులకు ప్రత్యేక సూచనలు చేశారు. అతిగా మద్యం తాగి కానీ లేదా ఇతర సందర్భాల్లో విధుల్లో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించవద్దని సూచించారు. వారిపై దాడులు, వాగ్వాదాలకు దిగొద్దని.. అలా చేస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. నగరంలోకి డ్రగ్స్ ప్రవేశాన్ని నిరోధించడంతో పాటు వినియోగాన్ని పూర్తిగా కట్టడి చేసేందుకు గానూ టాస్క్ ఫోర్స్, నార్కోటిక్ బ్యూరో, పోలీస్ విభాగాల్లోని సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.