Nani : కొన్నిసార్లు టైం ఎలా నడుస్తుంది అని మన చేతుల్లో ఉండదు. ఈరోజు మనకు వచ్చిన సక్సెస్ రేపటికి ఉండకపోవచ్చు. అలానే ఈరోజు ఉన్న బాధలు కూడా రేపటికి ఉండకపోవచ్చు. ఇక నాని విషయానికొస్తే ప్రస్తుతం నాని మంచి సక్సెస్ జోష్ లో ఉన్నాడు. కానీ ఒకప్పుడు నాని కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ రావడం, ఫెయిల్యూర్స్ రావడం కామన్ గా జరుగుతుంది. ఇక నాని విషయానికి వస్తే ఒకప్పుడు నాని కూడా డిజాస్టర్ సినిమాలు చూశాడు. ఒక సినిమా ఫెయిల్ అయినప్పుడు అభిమానులు మా హీరో హిట్టు కొట్టలేకపోయాడు అని ఎంత బాధపడతారో, మా అభిమానులు ఆశించిన సక్సెస్ ఇవ్వలేకపోయామని కూడా హీరోలు బాధపడుతూ ఉంటారు.
ఫెయిల్యూర్ తో బాధపడుతుంటే
ఒక సందర్భంలో నాని హీరోగా చేసిన రెండు వర్ష సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. నాని చేసిన ఆహా కళ్యాణం సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత వారం గ్యాప్ లో వచ్చిన పైసా సినిమా కూడా సక్సెస్ ఇవ్వలేకపోయింది. ఈ రెండు సినిమాలు ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయ్యాయి. అయితే ఫిబ్రవరి 24న నాని పుట్టినరోజు. ఈ రెండు సినిమాలు పోయాయి అని నాని తన ఆఫీసులో బాధపడుతుంటే పుట్టినరోజు సందర్భంగా బాహుబలి చిత్ర యూనిట్ వచ్చి నాని బర్త్డేను సెలబ్రేట్ చేశారట. ఈ విషయాన్ని స్వయంగా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని పంచుకున్నాడు. బాహుబలి టీం అంతా వచ్చి తన బర్త్డే సెలబ్రేట్ చేయడం అనేది తనకు బాగా సప్రైజింగ్ అనిపించింది అంటూ నాని చెప్పుకొచ్చాడు.
Also Read : Chiru Odela : చిరంజీవి సినిమాలో నాని, చాలా పగడ్బందీగా ప్లాన్ చేశావ్ శ్రీకాంత్
రాజమౌళి దర్శకత్వంలో
ఇక బాహుబలి చిత్ర యూనిట్ కి నానికి ఉన్న కనెక్షన్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాలో నాని ఒక కీలక పాత్రలో కనిపించాడు. స్క్రీన్ పైన నాని కనిపించింది తక్కువ సేపే అయినా కూడా కథను మాత్రం నడిపించింది నాని. చాలామంది హీరోలను ఎస్ఎస్ రాజమౌళి సెంటిమెంట్ వెంటాడినట్లు నానిని కూడా వెంటాడింది. ఇక ప్రస్తుతం నాని వరుస హిట్ సినిమాలు చేస్తున్నాడు. ఒకవైపు హీరోగా మాత్రమే కాకుండా మరోవైపు నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకుంటున్నాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో నిర్మాతగా సినిమా చేసే స్థాయికి వచ్చేసాడు నాని.
Also Read : Actor Sivaji : మనసులను దోచుకున్న మంగపతి, ఏకంగా సూర్య నుంచి ప్రశంసలు