BigTV English

Dance Ikon 2: 2 గంటల్లో అద్భుతం.. కేవలం రూ.75 వేలతోనే.. ఏం తీశారయ్యా!

Dance Ikon 2: 2 గంటల్లో అద్భుతం.. కేవలం రూ.75 వేలతోనే.. ఏం తీశారయ్యా!

Dance Ikon 2: ఈరోజుల్లో ప్రతీ విషయంలో క్రియేటివిటీ చూపిస్తే తప్పా ప్రేక్షకులు దానికి అట్రాక్ట్ అవ్వడం లేదు. అందుకే వెండితెరపై సినిమాలు అయినా, బుల్లితెరపై షోలు అయినా చాలా క్రియేటివ్‌గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా సింగింగ్, డ్యాన్సింగ్ రియాలిటీ షోలు అనేవి చాలాకాలంగా ప్రేక్షకులు చూస్తూనే ఉన్నారు. కానీ వాటిని మరింత సరికొత్తగా చూపించాలంటే కొత్త కొత్త ఐడియాస్ కావాలి. అందుకే ఆహాలో స్ట్రీమ్ అయ్యే ‘డ్యాన్స్ ఐకాన్ 2’ (Dance Ikon 2) కూడా అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అదే ఫైనల్ కట్. ఫైనల్ షాట్. ఫైనల్ ఛాన్స్. అసలు ఈ కొత్త థీమ్ ఏంటి, దీని కాన్సెప్ట్ ఏంటి చెప్తూ మేకర్స్ ఒక ప్రోమోను విడుదల చేశారు.


కొత్త థీమ్

‘‘ఈరోజు థీమ్.. మ్యూజిక్ వీడియో థీమ్’’ అని ఓంకార్ చెప్పడంతో ‘డ్యాన్స్ ఐకాన్ 2’ ప్రోమో మొదలవుతుంది. ఆ తర్వాత దాని గురించి వివరిస్తూ.. ‘‘ప్రతీ ఒక్క కంటెస్టెంట్‌కు రూ. 75 వేలు ఇవ్వడం జరిగింది. ఆ డబ్బులతో వాళ్లు ఒక వీడియో సాంగ్‌ను క్రియేట్ చేయాలి’’ అని చెప్పుకొచ్చాడు. అలా పర్ఫార్మెన్స్‌లు మొదలయ్యాయి. ముందుగా మానస్ టీమ్ నుండి వచ్చిన కంటెస్టెంట్.. ‘బాహుబలి’ సినిమాలో ‘ధీవర’ పాటకు మ్యూజిక్ వీడియో చేసి చూపించింది. అది చూసిన శేఖర్ మాస్టర్.. అంత తక్కువ డబ్బుతో ఇలాంటి మ్యూజిక్ వీడియో చేశారంటే నమ్మబుద్ధి కావడం లేదు అంటూ ఆశ్యర్యపోయాడు. తన డ్యాన్స్ చూడడానికి చాలా బాగుందంటూ ఫరియా అబ్దుల్లా సైతం ప్రశంసించింది.


అన్నీ పర్ఫెక్ట్

ఆ తర్వాత యశ్ టీమ్ నుండి వచ్చిన కంటెస్టెంట్.. ‘అరుంధతి’లోని ‘జేజమ్మ’ పాటకు మ్యూజిక్ వీడియో చేసింది. ఆపై తన కొరియోగ్రాఫర్ వచ్చి ఆ మ్యూజిక్ వీడియోను 2 గంటల్లో పూర్తిచేశామని చెప్పగానే శేఖర్ మాస్టర్ నమ్మలేకపోయాడు. భవిష్యత్తులో తను మంచి కొరియోగ్రాఫర్‌గా ఎదగాలని మానస్ అన్నాడు. వీరి తర్వాత దీపికా రంగరాజ్ టీమ్ నుండి వచ్చిన కంటెస్టెంట్ ‘కేజీఎఫ్’ పాటపై మ్యూజిక్ వీడియో చేయగా.. అది కాస్త కామెడీ అనిపించినా జడ్జిలను మాత్రం ఇంప్రెస్ చేసింది. ‘కేజీఎఫ్’ పాటకు తను చేసినవన్నీ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయని శేఖర్ మాస్టర్ ప్రశంసించాడు. అన్నింటికంటే ఒక చిన్నారి చేసిన మ్యూజిక్ వీడియో ప్రోమోకే హైలెట్ అయ్యింది.

Also Read: మిడ్ రేంజ్ హీరోకు ఓటీటీ కష్టాలు.. గట్టెక్కే ఉపాయం దొరికేనా.?

పరేషాన్ చేసేసిందిగా

‘రోజా’ సినిమాలోని ‘చిన్ని చిన్ని ఆశ’ పాటకు మ్యూజిక్ వీడియో క్రియేట్ చేసింది ఓ చిన్నారి. అది జడ్జిలతో పాటు ప్రేక్షకులను సైతం బాగా ఇంప్రెస్ చేసింది. తన పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన ముమైత్ ఖాన్.. ఆ చిన్నారితో ఒక తెలుగు పద్యం చెప్పించింది. ఆపై ముమైత్ ఖాన్ టీమ్ నుండి వచ్చిన అమ్మాయి.. ‘ధృవ’ సినిమాలోని ‘పరేషానురా’ పాటకు మ్యూజిక్ వీడియో క్రియేట్ చేయగా దానికి యశ్ పరేషాన్ అయ్యాడు. సినిమాలో రకుల్ రేంజ్‌లో ఆ అమ్మాయి పర్ఫార్మ్ చేసిందని అందరూ పొగిడారు. ఆపై ఫరియా కూడా ఈ పాటకు తన స్టైల్‌లో స్టెప్పులు వేసి చూపించింది. ఇలాంటి కొత్త థీమ్‌తో ముగిసిన ఈ ఎపిసోడ్.. ఏప్రిల్ 25 సాయంత్రం 7 గంటలకు ఆహాలో స్ట్రీమ్ కానుంది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×