Babu Mohan:కమెడియన్ గా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వారందరిలో బాబు మోహన్ (Babu Mohan) కూడా ఒకరు.. ఆయన తన కటౌట్, డైలాగ్స్, కామెడీ పంచ్ లతో ఇండస్ట్రీలో ఉన్న కమెడియన్ లలో ఒకరిగా ఫేమస్ అయ్యారు. ఒకానొక సందర్భంలో ఈయన 10, 15 సినిమాలకు ఒకేసారి డేట్స్ ఇచ్చేవారట. అంత బిజీగా గడిపే వారట. అయితే అలాంటి బాబు మోహన్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఆయన బీఆర్ఎస్, టీడీపీ, బిజెపి అంటూ పలు పార్టీలు తిరిగారు. అయితే అలాంటి బాబు మోహన్ రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తినే పాన్ లో విషం పెట్టి చంపాలనుకున్నారట. మరి ఇంతకీ బాబు మోహన్ ను.. తినే పాన్ లో విషం పెట్టి చంపాలని అనుకున్నది ఎవరు? ఆ గండం నుండి ఆయన ఎలా బయటపడ్డారు? అనేది ఇప్పుడు చూద్దాం..
Honey Rose: 20 ఏళ్లయినా ఆ కోరిక తీరలేదంటున్న హనీ రోజ్.. ఏంటంటే..?
పాన్ లో విషం పెట్టి నన్ను చంపాలనుకున్నారు – బాబు మోహన్
బాబు మోహన్ గతంలో తనకు విషం పెట్టి చంపాలనుకున్నారు అంటూ ఓ సంచలన విషయం బయట పెట్టారు. ఆ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. నేను ప్రతిరోజు 35 పాన్ లు తినేవాడిని. స్పెషల్ గా నాకోసం పాన్ లు కట్టించుకునేవాడిని. ఇక నేను రాజకీయాల్లోకి వచ్చాక సంగారెడ్డి నుండి హైదరాబాద్ వెళ్లే రూట్లో నా కోసమే స్పెషల్ గా ఒక పాన్ డబ్బాని కూడా పెట్టించుకున్నాను.అంతేకాదు ఆ వ్యక్తికి నాకోసం పాన్ ఎలా తయారు చేయాలో దాన్ని ఎలా కట్టివ్వాలో కూడా నేర్పించాను. అలా ప్రతిరోజు అటువైపు వెళుతూ ఉండగా ఆ పాన్ తీసుకునే వాడిని. కానీ నా కోసం కనీసం 5,6 పాన్ అయినా ఆ వ్యక్తి ఉంచేవాడు.అలా ఓ రోజు నేను పాన్ కట్టించుకొని హైదరాబాద్ వెళుతున్న సమయంలో సడన్ గా ఎస్పీ ఫోన్ చేసి మీరు పాన్ తినకండని చెప్పారు. ఇదేంటి ఈయన నన్ను పాన్ తినకంటాడు అని పాన్ ఓపెన్ చేసి తినేలోపే మరొక లేడీ కాల్ చేసి మీరు పాన్ తినకండి అందులో విషం ఉంది అంటూ ఏడ్చుకుంటూ హిందీలో మాట్లాడింది.
ఆ దెబ్బకు పాన్ తినడం మానేశాను – బాబు మోహన్..
ఆమె మాటలకు నేను షాక్ అయ్యాను. ఆలోపే మళ్ళీ ఎస్పీ ఫోన్ చేసి అందులో విషం ఉంది వెంటనే దాన్ని పాడేయండి అని గట్టిగా బెదిరించారు.దాంతో నేను పాన్ బయటికి పడేసాను. అప్పటినుండి ఇప్పటి వరకు మళ్ళీ పాన్ మొహం కూడా చూడడం లేదు అంటూ ఆ ఇంటర్వ్యూలో బాబు మోహన్ చెప్పారు.మరి అందులో విషం పెట్టి చంపాలనుకున్నది ఎవరు అని యాంకర్ అడగగా.. ఇప్పుడు అది చెప్పాలనుకోవడం లేదు.అది పెద్ద హిస్టరీ అంటూ చెప్పారు. ఇక రాజకీయాల్లో ఉన్న తన ప్రత్యర్థులే తనకి అలా విషం పెట్టి చంపాలని చూసారని బాబు మోహన్ పరోక్షంగా చెప్పారు. అలా రోజుకు 35 పాన్ లు తినే బాబుమోహన్ ఒకే ఒక్క సంఘటనతో పాన్ తినడం మానేసారట.