Ranbir Kapoor: ఇండస్ట్రీలో ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయిన సినిమాలు కొన్ని ఉంటాయి. ఆ సినిమాలతో ఒక రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకులు కూడా ఉంటారు. అలాంటి దర్శకుల్లో ఒకరు సందీప్ రెడ్డి వంగా. తన సినిమాలపై, తన పర్సనాలిటీపై ఎన్ని విమర్శలు వచ్చినా కూడా వెనక్కి తగ్గని దర్శకుల్లో సందీప్ రెడ్డి వంగా ముందుంటాడు. అలాంటి తను దర్శకత్వం వహించిన చివరి చిత్రం ‘యానిమల్’ చాలారోజల పాటు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ‘యానిమల్’ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందని అప్పుడే కన్ఫర్మ్ చేశాడు దర్శకుడు. అయితే ఈ మూవీ రెండు పార్ట్స్‌లో విడుదల కాదని చెప్తూ అందరికీ షాకిచ్చాడు హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor).
రెండు భాగాలు కాదు
‘యానిమల్’ మూవీకి సీక్వెల్‌గా ‘యానిమల్ పార్క్’ అనేది ఉంటుందని ఇప్పటికే పలుమార్లు బయటపెట్టాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). అంతే కాకుండా ఈ కథతో ఒక ఫ్రాంచైజ్ ప్లాన్ చేస్తున్నానని కూడా అన్నాడు. కానీ నిజంగానే ఆ ఫ్రాంచైజ్ ఉంటుందా లేదా అనే విషయంపై మళ్లీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ దగ్గర ‘యానిమల్’ను ఆపేసి మిగతా కథను సీక్వెల్‌లో చూసుకోమన్నాడు దర్శకుడు. అందుకే ఈ సీక్వెల్ కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య చాలానే ఉంది. ఇప్పుడు ‘యానిమల్’ సీక్వెల్‌తో పాటు మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను అందించాడు రణబీర్ కపూర్. ఇది అసలు మూడు భాగాలుగా తెరకెక్కే సినిమా అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’పై మరో సినిమా.. రాజమౌళి ప్లాన్ మామూలుగా లేదుగా!
ఎగ్జైటింగ్‌గా ఉంది
‘‘2027లో యానిమల్ పార్క్‌ను ప్రారంభిస్తాం. ఇప్పటికే యానిమల్‌తో ప్రేక్షకుల్లో హైప్ క్రియేట్ చేశాడు దర్శకుడు. ఆయన ఈ మూవీని మూడు భాగాలుగా తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. అందులో సెకండే పార్టే యానిమల్ పార్క్. యానిమల్ నుండే నేను డైరెక్టర్ మా ఐడియాలు షేర్ చేసుకుంటూ ఉన్నాం. తను ఈ కథను ముందుకు ఎలా తీసుకెళ్లాలని అనుకుంటున్నాడో నాకు చెప్పాడు. నాకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది ఎందుకంటే ఇప్పటినుండి ఇందులో హీరో నేనే, విలన్ నేనే. ఇది ఒక ఎగ్జైటింగ్ డైరెక్టర్‌తో కలిసి నేను చేస్తున్న ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్’’ అని ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టాడు రణబీర్ కపూర్.
‘పుష్ప’ను ఫాలో
‘యానిమల్’ను ఒక ఫ్రాంచైజ్‌లాగా తెరకెక్కిస్తానని సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన స్టేట్‌మెంట్ నిజమే అని ప్రేక్షకులకు ఇన్నాళ్లకు క్లారిటీ వచ్చింది. ఇక ఈ మూవీకి సీక్వెల్ టైటిల్ ‘యానిమల్ పార్క్’ కాగా.. మూడో భాగానికి ‘యానిమల్ కింగ్డమ్’ అనే టైటిల్ ఖరారు అయినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఏ సినిమా అయినా రెండు భాగాలుగా తెరకెక్కించడమే పెద్ద హైలెట్ విషయంగా ఉండేది. ఇప్పుడు ‘పుష్ఫ’ లాంటి పాన్ ఇండియా సినిమాతో సహా చిత్రాలన్నీ మూడు భాగాలుగా విడుదలయితే ప్రేక్షకులు ఇష్టపడతారని మేకర్స్ అనుకుంటున్నారు. ఇప్పుడు ‘యానిమల్’ కూడా ‘పుష్ప’ రూటునే ఫాలో అవ్వనుంది.
Ranbir Kapoor confirms again that Animal is going to have 3 parts
1. Animal Park
2. Animal Kingdom
much awaited 🥵#RanbirKapoor pic.twitter.com/Ve9NIdekJx— 𝙑 ♪ (@RKs_Tilllast) December 8, 2024