Devara Success Meet : గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ దేవర మూవీ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ మిక్సీ్డ్ టాక్ ను అందుకున్నా కూడా కలెక్షన్స్ మాత్రం సునామీ సృష్టిస్తున్నాయి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ వినిపించింది. కానీ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు భారీ ఎత్తున వచ్చారు.. స్లోగా సినిమా క్రేజ్ పెరుగుతుంది. అయితే మొదటి రోజు ఉన్నంత బజ్ ఇప్పుడు లేదనే చెప్పాలి. ఆదివారం వరకు బాగానే ఉన్న కలెక్షన్స్ ఇప్పుడు తగ్గినట్లు తెలుస్తుంది. సోమవారం నుంచి వసూళ్లు కొంత తగ్గినప్పటికీ.. కలెక్షన్ స్టడీగా ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్ 2న గాంధీ జయంతి కావడం, ఆ తర్వాత నుంచి దసరా సెలవులు ఉండటంతో, మరో వారం రోజులు థియేటర్లో దేవరదే హవా ఉండనుంది. కలెక్షన్ల జోరు పెరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ మూవీ సక్సెస్ మీట్ ను రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజమేంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
దేవర సక్సెస్ మీట్ రద్దు..
ఇక ఈ సినిమా సక్సెస్ ను అందుకున్న నేపథ్యంలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చెయ్యాలని రెడీ అవుతోంది చిత్ర యూనిట్. కానీ ఎప్పుడు? ఎక్కడ? అనేది తేలడం లేదు. అయితే తెలుగులో ప్రమోషన్స్ కూడా సరిగ్గా చెయ్యలేదు కాబట్టి తెలుగు రాష్ట్రాల్లోనే గ్రాండ్ గా ఈవెంట్ ను ప్లాన్ చెయ్యాలని మేకర్స్ భావిస్తున్నారట.. అభిమానుల సమక్షంలో సక్సెస్ ఈవెంట్‌ను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 2 లేదా 3వ తేదీన దేవర సక్సెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉందని నిన్న వార్తలు వినిపించాయి.. కానీ ఇప్పుడు ఈ ఈవెంట్ క్యాన్సిల్ అయ్యిందనే వార్త చక్కర్లు కొడుతుంది. అందుకు కారణం సక్సెస్ మీట్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదని టాక్. కనీసం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగలేదు. ఈ ఈవెంట్ లో అయిన తారక్ ను చూద్దామని అనుకున్న ఫ్యాన్స్ కు నిరాశ మిగిలింది. ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ఎన్టీఆర్ కు కూడా ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. మరి దీనిపై దేవర టీమ్ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..
ఇక దేవర కలెక్షన్స్ విషయానికొస్తే.. ‘దేవర’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు మిక్స్డ్ టాక్ వినిపించింది. కానీ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా థియేటర్లకు భారీ ఎత్తున వచ్చారు. దాంతో మూడు రోజుల్లోనే 300 కోట్ల కలెక్షన్ వసూలు చేసింది. సోమవారం నుంచి వసూళ్లు కొంత తగ్గినా కూడా దసరా సెలవులు రావడంతో కలెక్షన్స్ మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.. మరి దేవర 1000 కోట్ల క్లబ్ లోకి చేరుతుందా? లేదా? అన్నది చూడాలి..