BigTV English

Balagam Venu: హీరోల చేతిలో ఆగం అవుతున్న ‘ఎల్లమ్మ’.. ఆఖరికి ఈ హీరో అయినా సెట్ చేస్తాడా.?

Balagam Venu: హీరోల చేతిలో ఆగం అవుతున్న ‘ఎల్లమ్మ’.. ఆఖరికి ఈ హీరో అయినా సెట్ చేస్తాడా.?

Balagam Venu: ‘బలగం’ (Balagam) సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టడం మాత్రమే కాదు.. ఒక క్లాసిక్ హిట్‌ను కూడా సంపాదించుకున్నాడు వేణు. అప్పటివరకు వేణు (Venu) అంటే వెండితెరపై క్యారెక్టర్ ఆర్టిస్ట్, బుల్లితెరపై కామెడియన్ అనుకునేవారు ప్రేక్షకులు. కానీ తనలో ఒక మంచి డైరెక్టర్ ఉన్నాడని ‘బలగం’తోనే బయటపడింది. ఈ సినిమా ఎన్నో అవార్డులను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు.. ప్రేక్షకుల దృష్టిలో కూడా ఒక స్పెషల్ ఫిల్మ్‌గా నిలిచిపోయింది. ‘బలగం’ చిత్రం విడుదలయ్యి దాదాపు ఏడాదిన్నర అయిపోతోంది. అయినా ఇంకా వేణు తెరకెక్కించే తరువాతి ప్రాజెక్ట్‌పై ఎన్నో కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ అవుతున్నాయి.


చేతులు మారింది

‘బలగం’లాగానే మరొక విలేజ్ డ్రామాతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని వేణు ముందుగానే డిసైడ్ అయ్యాడు. తన తరువాతి ప్రాజెక్ట్‌కు ‘ఎల్లమ్మ’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశాడు. కథ అంతా ఓకే అయినా కూడా ఈ సినిమాకు హీరో సెట్ అవ్వడమే కష్టంగా మారింది. ఒక హీరో చేతిలో నుండి మరొక హీరో చేతిలోకి ఈ స్క్రిప్ట్ వెళ్తుంది కానీ ఫైనల్‌గా ఈ సినిమా ఎవరు చేయబోతున్నారు అనే విషయంపై మాత్రం క్లారిటీ లేదు. ముందుగా ‘ఎల్లమ్మ’ (Yellamma) కథను నితిన్‌కు వినిపించాడు వేణు. ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ పలువురు యంగ్ హీరోల దగ్గరకు వెళ్లింది. ఇప్పుడు చివరిగా మళ్లీ నితిన్ దగ్గరికే రావడంతో నితిన్, వేణు ప్రాజెక్ట్ ఫిక్స్ అని సమాచారం.


Also Read: ఉపేంద్ర లవ్ స్టోరీ.. సినిమా తీసేయెచ్చు భయ్యా..!

కానీ ఒక కండీషన్

ముందుగా ‘ఎల్లమ్మ’ను నితిన్ రిజెక్ట్ చేయడంతో నేచురల్ స్టార్ నానికి ఈ కథను వినిపించాడు వేణు. అప్పటికే శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘దసరా’ సినిమా చేశాడు నాని. అందులో పక్కా తెలంగాణ కుర్రాడిగా నటించి ఆకట్టుకున్నాడు. తన ప్రతీ సినిమాను డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకునే నాని.. మళ్లీ అదే మ్యానరిజంతో, తెలంగాణ స్టైల్‌లో ‘ఎల్లమ్మ’ను చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో ఈ స్క్రిప్ట్ తేజ సజ్జా దగ్గరకు వెళ్లింది. తను ఈ సినిమా చేయడానికి ఓకే అన్నట్టుగానే అనిపించినా ఫైనల్‌గా రిజెక్ట్ చేశాడు. అలా తిరిగి తిరిగి ఈ కథ మళ్లీ నితిన్ చేతికే వచ్చింది. దీంతో ఈ యంగ్ హీరో ఒక నిర్ణయానికి వచ్చాడు. ‘ఎల్లమ్మ’ కథను ఓకే చేశాడు కానీ ఒక కండీషన్ పెట్టాడు.

వరుస కమిట్మెంట్స్

‘ఎల్లమ్మ’ సినిమా తాను చేయాలంటే కథలో కొన్ని మార్పులు చేయాలని వేణుకు చెప్పాడట నితిన్. తను చేసిన మార్పులు నచ్చడంతో ఫైనల్‌గా ఈ సినిమాను ఓకే చేశాడట. తాజాగా వేణు, నితిన్ కాంబినేషన్‌లో ‘ఎల్లమ్మ’ సినిమా ఫైనల్ అయ్యిందని టాలీవుడ్ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం నితిన్ చేతిలో ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ సినిమాలు ఉన్నాయి. ‘తమ్ముడు’ మూవీ గురించి అప్డేట్స్ వచ్చి చాలాకాలం అయ్యింది. కానీ ‘రాబిన్ హుడ్’ షూటింగ్ మాత్రం దాదాపు చివరిదశకు చేరుకుంది. దాని తర్వాత విక్రమ్ కే కుమార్‌తో కూడా ఒక ప్రాజెక్ట్ ఓకే చేశాడు నితిన్. ఇలా వరుస కమిట్మెంట్స్ ఉండడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరీలోనే ‘ఎల్లమ్మ’ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.

Related News

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Actress Mohini: అలా చేయాలని బలవంతం చేశారు.. చాలా ఏడ్చాను, బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

Shriya Saran: నేను హీరోయిన్ అని నా భర్తకు తెలీదు.. ఆ మూవీ చూసి భయపడ్డారు – శ్రియా

Barrelakka: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బర్రెలక్క.. బేబీ ఎంత క్యూట్ గా ఉందో?

Heroes Remuneration : హైయెస్ట్ పెయిడ్ హీరోలు… మన తెలుగు హీరోలు ఎంత మంది ఉన్నారో చూడండి

Nainika Anasuru : మా నాన్న అలాంటివాడు, అందుకే ఎక్కువ చెప్పను

Nainika Anasuru : నా ఫోటో పెట్టి రేట్ చెప్పే వాళ్ళు, నాకు కూతురు ఉంటే ఇండస్ట్రీకి పంపను

Nainika Anasuru : చచ్చి పోదాం అనుకున్నాను, కన్నీళ్లు పెట్టుకున్న నైనిక

Big Stories

×