HBD Balakrishna: టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) జూన్ 10వ తేదీ పుట్టినరోజు(Birthday) వేడుకలను జరుపుకుంటున్న విషయం తెలిసిందే. నేడు బాలయ్య పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున అభిమానులు బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను జరుపుకుంటున్నారు. అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడమే కాకుండా పలు సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా పాల్గొంటున్నారు. ఇకపోతే బాలకృష్ణ తన పుట్టినరోజు వేడుకలను ప్రతిసారి కూడా బసవతారకం హాస్పిటల్ లోనే జరుపుకుంటారనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా బసవతారకం హాస్పిటల్ లోనే ఈయన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.
వెల్లు వెత్తుతున్న శుభాకాంక్షలు..
అక్కడ క్యాన్సర్ పేషంట్ల సమక్షంలో కేక్ కట్ చేసి స్వయంగా బాలకృష్ణ ఆ చిన్నారులకు కేక్ తినిపిస్తూ ఈ వేడుకలను జరుపుకున్నారు. ఇకపోతే బాలయ్య పుట్టినరోజు కావడంతో ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మొదలుకొని రామ్ చరణ్, కళ్యాణ్ రామ్ వంటి వారందరూ కూడా బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. ఇక కళ్యాణ్ రామ్ ఏకంగా తన బాబాయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ లవ్ సింబల్ జోడించి ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే మరొక అబ్బాయ్ అయినటువంటి ఎన్టీఆర్ (NTR)మాత్రం ఇప్పటివరకు బాలకృష్ణకు ఏ విధమైన శుభాకాంక్షలు తెలియజేయలేదు.
ఫేక్ ట్వీట్…
ఇలా ఎన్టీఆర్ బర్త్ డే విషెస్ చెప్పకపోవడంతో అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం ఎన్టీఆర్ ట్విట్టర్ అకౌంట్ నుంచి బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు ఒక పోస్ట్ మాత్రం వైరల్ అవుతుంది. ఇందులో భాగంగా..” జన్మదిన శుభాకాంక్షలు బాల బాబాయ్.. మీరు అన్నివేళలా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను… మరొకసారి వచ్చి గేటు తీసిపో బాబాయ్” అంటూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇలా ఈ పోస్ట్ చేసిన కాసేపటికే దీనిని డిలీట్ చేశారు కానీ అప్పటికే సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూస్తుంటే ఇది ఎన్టీఆర్ అకౌంట్ నుంచి వచ్చింది కాదని, ఫేక్ అకౌంట్ నుంచి ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పోస్ట్ చేశారని స్పష్టమవుతుంది.
Delete chesadu 😭🤣 pic.twitter.com/glQ8dgYddk
— के! (@steve_hairngton) June 10, 2025
ఇక ఎన్టీఆర్ ఇప్పటివరకు బాలకృష్ణకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయలేదని చెప్పాలి. అయితే గత కొంతకాలంగా బాలకృష్ణ, ఎన్టీఆర్ మద్యం పూర్తిగా గ్యాప్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇలా ఇద్దరి మధ్య మాటలు లేకపోయినా బాలకృష్ణకు సంబంధించిన ఏ విషయం గురించి అయిన ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు మాత్రం పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ చేయకపోవడంతో అభిమానులు ఎన్నో సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం పలు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అవ్వడంతో సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారని అందుకే విష్ చేయలేకపోయారంటూ పలువురు అభిమానులు భావిస్తున్నారు.